బిగ్‌బాస్ సీజన్-6లో నాలుగోవారం ఆరోహి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్‌లో చలాకీగా, గడుసుతనంతో కనిపించిన ఆరోహి ఎలిమినేషన్ అనంతరం యాంకర్ శివకి ఇచ్చిన బజ్ ఇంటర్యూలోనూ తనదైన శైలిలో మాట్లాడింది. బిగ్‌బాస్ జర్నీ ఎలా అనిపించింది అని అడగ్గా.. కొంతమందితో కనెక్ట్ అయ్యాననిపించింది అని పేర్కొంది ఆరోహి.ఎవరితో కనెక్ట్ అయ్యావ్ అని శివ కౌంటర్ వేయగా, ఎమోషనల్‌గా అంటే శ్రీహాన్, కీర్తిలతో కనెక్ట్’ అయ్యాను అని తెలిపింది. దీంతో ఏంటి తప్పు చెప్తున్నావా? లేదా సేఫ్ ఆడుతున్నావా అంటూ శివ ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేయగా ఏ.. నువ్వు ఎవరిపేరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? ఏంటి అని గట్టిగానే బదులిచ్చింది.
నువ్ ఎప్పుడైతే నీ కోసం నువ్వు ఆడటం పక్కనపెట్టావో.. నీ గ్రాఫ్ పడిపోయింది అని శివ పేర్కొనగా, దీనికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని ఆరోహి వాదించే ప్రయత్నం చేసింది. దీనికి శివ.. నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదే నిదర్శనం. నువ్ ఎలిమినేట్ అయి నా ముందు ఉన్నావ్ కదా అంటూ కౌంటర్ ఇచ్చాడు శివ. హౌస్‌లో ఆరోహి మితిమీరింది అన్న ప్రశ్నకు .. మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటూ బదులిచ్చింది.
మాకు అంత ప్యూర్‌గా ఏం అనిపించలేదే అని శివ అనేసరికి ఆరోహి..పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇంటర్యూ అయినా నువ్వు ఇలా మాట్లాడితే అస్సలు ఊరుకోను అంటూ ఆరోహి ఫైర్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment