Bigg Boss 6 Telugu BB Cafe: Anchor Shiva Interview With Rajasekhar After Elimination - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: పాపం రాజ్‌.. ఘోరంగా అవమానించిన యాంకర్‌ శివ

Published Mon, Nov 28 2022 7:09 PM | Last Updated on Wed, Nov 30 2022 5:42 PM

Bigg Boss 6 Telugu: Anchor Shiva Interview With Rajasekhar - Sakshi

హోస్టింగ్‌ అదిరింది అన్నవారితోనే ఇదేం హోస్టింగ్‌రా బాబూ అనిపించేలా చేస్తున్నాడు యాంకర్‌ శివ. బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లను బిబి కెఫెలో ఇంటర్వ్యూ చేస్తాడు శివ. మొదట్లో ఇంటర్వ్యూలను రఫ్ఫాడించిన అతడు రానురానూ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. అందులోనూ కటువుగా మాట్లాడటం రాని సాఫ్ట్‌ కంటెస్టెంట్లపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో యాంకర్‌ శివపై జనాలు మండిపడుతున్నారు. అమాయకపు కంటెస్టెంట్లను ఎందుకంత అవమానపరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శివ బిబి కెఫెలో రాజ్‌తో ఏం మాట్లాడాడు? ఎలాంటి ప్రశ్నలు అడిగాడో చూద్దాం..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి.. ఈ రెండూ జరగకుండానే ఇన్నివారాలదాకా వచ్చావు. అంటే నువ్వు నక్క తోక తొక్కి వచ్చావు అని రాజ్‌ను కించపరిచినట్లుగా మాట్లాడాడు శివ. బిబి కెఫెకు వచ్చిన ఓ వ్యక్తి నువ్వు కెమెరాల నుంచి తప్పించుకుని భలే ఆడావన్నాడంటూ పడీపడీ నవ్వాడు. దీనికి ఏమని సమాధానమివ్వాలో అర్థం కాని రాజ్‌.. అదే నా గేమ్‌ అని ఒప్పుకుంటున్నాననగానే శివ మరోసారి నవ్వాడు. ఏమీ ఆడకుండా 12 వారాలు ఉన్నందుకు హ్యాపీగా ఉన్నట్లున్నావంటూ వెటకారంగా మాట్లాడాడు.

దీనికి రాజ్‌.. ఏం మాట్లాడుతున్నావ్‌ బ్రో, నీకేమైనా నరాలు కట్‌ అయ్యాయా? అని ప్రశ్నించాడు. అయినా తగ్గని శివ కేవలం లక్‌ వల్లే ఇన్నివారాలు ఉండగలిగావన్నట్లుగా తనను పదేపదే అవమానించడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు యాంకర్‌ శివకేమైనా పిచ్చిపట్టిందా? అని కామెంట్లు చేస్తున్నారు. తనలో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడకుండా పదేపదే తనను మానసికంగా దెబ్బ తీయాలని చూడటమెందుకోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: రేవంత్‌ మీద నిప్పులు చెరిగిన ఫైమా
అదే అసలైన మైనస్‌, అందువల్లే రాజ్‌ ఎలిమినేట్‌ అయ్యాడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement