బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌లో నెగెటివిటీని కాకుండా గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోయిన వ్యక్తి రాజశేఖర్. జనాల ఓట్లు పడ్డప్పటికీ లక్ కలిసిరాకపోవడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడు ఆఫీస్ బాయ్ నుంచి మోడల్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. మరి ఈ జర్నీ ఎలా సాధ్యమైందో అతడి మాటల్లోనే చదివేయండి..
'నాది హైదరాబాద్. 2009లో మా నాన్న చనిపోయాడు. నా చెల్లిని చదివించడం కోసం ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. కానీ మంచి ఉద్యోగం రావాలంటే చదువు అవసరమని అర్థమైంది. దీంతో ఓపక్క చదువుతూనే మరోపక్క పని చేసేవాడిని. అలా ఆఫీస్ బాయ్‌గా పని చేసిన అదే కార్యాలయంలో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా, సేల్స్ టీమ్ లీడర్‌గా ఎదిగాను. తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు మోడలింగ్ ఆలోచన వచ్చింది. 2015లో మోడలింగ్ మొదలుపెట్టాను. 2018లో మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నిలిచాను. ఎన్నో బ్రాండ్స్‌కు పని చేశాను. కెరియర్ బిల్డ్ చేసుకునే సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. టీవీ ప్రాజెక్ట్స్ చేశాను. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. టాప్ 5లో ఉంటాననుకున్నాను. కానీ కుదరలేదు ' అని చెప్పుకొచ్చాడు రాజ్.
Comments
Please login to add a commentAdd a comment