మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌కు శుభం కార్డు పడనుంది. ఎవరు ఫినాలేకు చేరుకుంటారు? ఎవరు కప్పు కొడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 12 వారం ఎలిమినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఫైమా, రాజశేఖర్ ఇద్దరూ చివరి రెండు స్థానాల్లో ఉండగా ఫైనల్‌గా రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అతడి గేమ్ చూసి రాజ్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడనుకున్నారు, కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజ్ బయటకు వచ్చేశాడు. ఇంతకీ రాజ్ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..
ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన వ్యక్తి రాజ్. మాటల్లో తడబాటు, ఆటలో వెనకబడటం చూసి అతడు త్వరలోనే ఎలిమినేట్ అవుతాడనుకున్నారంతా! కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన గ్రాఫ్‌ను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాడు. మాటల్లో, ఆటల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ముందుకు సాగాడు. తనను చూసి నవ్వినవారితోనే చప్పట్లు కొట్టించుకున్నాడు.
అయితే మొదటినుంచీ తనకంటూ ఫ్యాన్ బేస్ లేకపోవడం రాజ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. వారాలు గడిచేకొద్దీ కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎక్కువవుతూ వస్తుంది. అలాంటి సమయంలో హౌస్‌మేట్స్ గేమ్ కంటే కూడా బయట వారి అభిమానులు వేసే ఓట్లే కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడున్నవారిలో అందరికంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాజ్‌కే! పైగా తనకెలాంటి పీఆర్‌టీమ్ కూడా లేకపోవడంతో ఓట్లు పెద్దగా పడలేదు.
మూడు వారాలుగా రాజ్ నామినేషన్‌లోకి రాలేదు. ఇది కూడా ఓట్లు పడకపోవడానికి ఒక ప్రధాన కారణం. మొదటి నుంచీ సోలో ప్లేయర్‌గా ఆడకుండా ఎవరో ఒకరి పక్కన నీడలా ఉండటం కూడా జనాలకు పెద్దగా నచ్చలేదు. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే రాజ్ కన్నింగ్, చీటింగ్ ప్లేయర్ కాదు కానీ కొంత సేఫ్‌గా ఆడేవాడు. అప్పుడప్పుడూ స్మార్ట్‌గా కూడా ఆడేవాడు. కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ ఆదిరెడ్డి నోటికే తాళం వేసేవాడు. కాకపోతే చాలావరకు మాటల్లో కాన్ఫిడెన్స్, క్లారిటీ తక్కువగా ఉండేది. దీనివల్ల అతడు మిగతావారికంటే వీక్ అన్నట్లుగా కనిపించింది.
చివరగా ఈవారం ఫైమాకు తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను ఎలిమినేట్ చేశారు. అంటే ప్రేక్షకుల ఓట్లతో కాకుండా బిగ్‌బాస్ నిర్ణయంతోనే అతడకు బయటకు వచ్చేశాడన్నమాట!
చదవండి: మరోసారి తాతైన బ్రహ్మానందం
ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్ అయ్యేది!
Comments
Please login to add a commentAdd a comment