Bigg Boss Telugu 6: Eliminated Contestant Rajasekhar Remuneration Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ షో ద్వారా రాజ్‌ ఎంత సంపాదించాడంటే?

Published Mon, Nov 28 2022 9:37 PM | Last Updated on Wed, Nov 30 2022 11:41 PM

Bigg Boss Telugu 6: Rajasekhar Remuneration Details - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో అడుగుపెట్టిన 21 మందిలో రాజ్‌ ఒకరు. మొదట్లో అతడు మాట్లాడటానికి కూడా భయపడటాన్ని చూసి ఎక్కువకాలం ఉండడని అనుకున్నారంతా! కానీ రోజులు గడిచేకొద్దీ తనను తాను మలుచుకుని ధైర్యంగా నిలబడ్డాడు. ఆదిరెడ్డిలాంటివారిని కూడా కరెక్ట్‌ పాయింట్‌ చెప్పి నోరు మూయించేంత మాటకారిగా ఎదిగాడు. గీతూతో ఫైట్‌ చేసిన విధానం కూడా అతడికి ప్లస్‌ పాయింట్‌గా మారింది. ఇక ఆటలో అయితే ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఆడాడు.

దీంతో మొదటి నాలుగు వారాల్లోనే వెళ్తాడనుకున్న రాజ్‌ పన్నెండు వారాలు ఉండగలిగాడు. నిజానికి ఈ వారం కూడా ఉండేవాడే.. కానీ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను అడ్డుపెట్టుకుని రాజ్‌ను బయటకు పంపించేశారు. నిజానికి గత నాలుగో సీజన్‌లో ఓట్లతో చివరి స్థానంలో ఉన్న అవినాష్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడటంతో ఆ వారం ఎలిమినేషన్‌ రద్దయింది. అంతేతప్ప చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న అరియానాను పంపించలేదు.

కానీ ఈ సీజన్‌లో మాత్రం అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఫైమా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడి సేవ్‌ అవడంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా ఎలిమినేట్‌ చేశారు. ఇంతకీ రాజ్‌ పన్నెండు వారాల్లో ఎంత సంపాదించాడని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం రాజ్‌.. వారానికి రూ.25 వేల నుంచి 30 వేల రూపాయలు అందుకున్నాడట. అంటే మొత్తం 12 వారాలకుగానూ అతడు మూడు లక్షల పైచిలుకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: నరాలు కట్టయ్యాయా? పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్‌
రేవంత్‌ మీద నిప్పులు చెరిగిన ఫైమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement