డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే? | Bigg Boss 6 Telugu: Sri Satya Remuneration for BB House | Sakshi
Sakshi News home page

Sri Satya: బిగ్‌బాస్‌ ద్వారా శ్రీసత్య ఎంత సంపాదించిందంటే?

Published Fri, Dec 16 2022 10:29 PM | Last Updated on Sun, Dec 18 2022 3:44 PM

Bigg Boss 6 Telugu: Sri Satya Remuneration for BB House - Sakshi

శ్రీసత్యది అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ గ్రాండ్‌ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఎన్నో వారాలుగా కొందరు నెటిజన్లు ప్రయత్నించిన ఆపరేషన్‌ అసత్య అర్ధాంతరంగా ఆగిపోగా బిగ్‌బాస్‌ ఈసారి దాన్ని భుజాన వేసుకున్నాడేమో అన్నట్లుగా ఆమెను టాప్‌ 5లో ఉంచకుండా బయటకు పంపించేశాడు. ఫినాలే కోసం ఎలా రెడీ అవ్వాలి? అని ప్లానింగ్‌లో ఉన్న శ్రీసత్యకు ఇది పెద్ద షాక్‌ అనే చెప్పాలి!

మొదట్లో బిగ్‌బాస్‌ షోను పిక్‌నిక్‌ స్పాట్‌గా భావించింది శ్రీసత్య. అందరి ఆటను చూడ్డానికే వచ్చాను తప్ప ఆడటానికి కాదన్నట్లుగా ప్రవర్తించింది. ఆమె బిహేవియర్‌ చూసి హౌస్‌మేట్సే కాదు నాగార్జున సైతం తిట్టిపోశాడు. దీంతో మెల్లిగా తనను తాను మార్చుకుంటూ నెమ్మదిగా రంగంలోకి దిగి దెబ్బలు తగిలినా సరే ఆట వదిలేదే లేదన్నట్లుగా గేమ్‌ ఆడటం ప్రారంభించింది. అయితే ఇతరుల నామినేషన్స్‌ చూసి ఎగతాళి చేసినట్లుగా నవ్వడం, వెటకారం, రేవంత్‌ గురించి వెనకాల మాట్లాడటం ఇలా కొన్ని తప్పుల వల్ల ఆమెపై విపరతీమైన నెగెటివిటీ ఏర్పడింది. 

ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్‌ హౌస్‌లో అడుగుపెట్టారో అప్పుడు తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఇలా తయారయ్యావేంటి? నా కూతురు ఇలా ఉండదు అని తండ్రి ముఖం పట్టుకుని అనేసరికి వెటకారాన్ని తగ్గించేసింది. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం మానేసింది. అందరితో బాగుండటానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది.

ఎన్నోవారాలుగా ఆపరేషన్‌ అసత్య అంటూ తనను ఎలిమినేట్‌ చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఫినాలేలో అడుగుపెట్టానోచ్‌ అని సంబరపడుతున్న తరుణంలో బిగ్‌బాస్‌ ఆమెను మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి. మరి 15 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమె ఎంత పారితోషికం అందుకుందని పలువురు ఆరా తీస్తున్నారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆమెకు వారానికి లక్ష చొప్పున పారితోషికం ఇచ్చారట. అంటే ఈ లెక్కన ఆమె 15 వారాలకు గానూ రూ.15 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

చదవండి: బిగ్‌బాస్‌ షోకు నాగార్జున గుడ్‌బై చెప్పనున్నాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement