Mehaboob Dilse Love Propose to Sri Satya on Valentine's day - Sakshi
Sakshi News home page

Sri Satya-Mahabood Dilse: శ్రీసత్యకు ప్రపోజ్‌ చేసిన మెహబూబ్‌, చేయి కోసుకుంటానంటూ బ్లాక్‌మెయిల్‌!

Published Wed, Feb 15 2023 3:28 PM | Last Updated on Wed, Feb 15 2023 4:45 PM

Bigg Boss Fame Mahaboob Dilse Love Propose To Sri Satya Valentines day - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్‌ 6 సీజనల్‌లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్‌ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్‌ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్‌ కూడా వారి పర్ఫామెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్‌ డే పోస్ట్‌, చెప్పుతో కొడతానంటూ..!

ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్‌ డే సందర్భంగా మెహబూబ్‌ దిల్‌ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్‌ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్‌ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్‌ ప్రియాంక, సంకేత్‌ల సాయంతో మహబూబ్‌ దిల్‌ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్‌ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్‌ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది.

చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ

దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చాయ్‌. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్‌ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్‌ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement