బిగ్‌బాస్ హౌస్‌లో మొదట గేమే ఆడలేదు శ్రీసత్య. తిండి మీద పెట్టిన దృష్టి ఆట మీద పెట్టు అని నాగార్జున హెచ్చరించడంతో గేమ్ మీద ఫోకస్ చేసింది. తన వంతు ఎఫర్ట్స్ పెడుతూ బాగా ఆడుతోంది. తాజాగా శ్రీసత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు, ఫ్యామిలీ గురించి పలు విషయాలను పంచుకున్నారు.
'నా కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నప్పుడు నా భార్య పక్షవాతం బారిన పడింది. ఇప్పటికి మూడున్నరేళ్లు అవుతోంది. ప్రపంచంలో ఏ కూతురూ తన తల్లికి ఖర్చు పెట్టనంతగా శ్రీసత్య తన అమ్మ కోసం ఖర్చు పెడుతోంది. ఇప్పటిదాకా రూ.75 లక్షలు ఖర్చు పెట్టింది. కేవలం ఒక్క నెలకే నా భార్యకు రెండు లక్షలదాకా ఖర్చవుతుంది. అవన్నీ ఇప్పుడు నా కూతురే పెట్టుకుంటోంది. అందుకే డబ్బుల కోసమే బిగ్‌బాస్‌కు వచ్చానని మొదట్లో ధైర్యంగా చెప్పింది. అసలైతే నేను బిగ్‌బాస్ వద్దన్నాను. కానీ కేరళలో వైద్యం కోసం రూ.6 లక్షలు అడిగారు. అంత డబ్బు ఒకేసారి రావాలంటే బిగ్‌బాస్‌కు వెళ్లాల్సిందేనంది.
శ్రీసత్య ఎంగేజ్‌మెంట్ అయ్యాక అబ్బాయి మంచివాడు కాదని తెలిసింది. పెళ్లి క్యాన్సిల్ కావడంతో సత్య ఆత్మహత్యకు యత్నించింది. చేతి మణికట్టు కోసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. కళ్ల ముందే కూతురు వేలాడటం చూసి నా భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే ఆమెను కాపాడింది కానీ రెండుమూడురోజులకే గుండెపోటు వచ్చింది. అప్పుడు కోవిడ్ టైమ్.. ఎవరూ ఆస్పత్రిలో చేర్పించుకోలేదు. ఒకవేళ జాయిన్ చేసుకునుంటే పాతికవేలతో అయిపోయేది. తర్వాతి రోజు పొద్దున తీసుకెళ్తే మెదడులో నరాలు పగిలిపోయాయి అంటూ ఆపరేషన్‌కు 40 లక్షలు అడిగారు. ఆపరేషన్ తర్వాత తనకు పక్షవాతం వచ్చింది. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆమె నోటి నుంచి సత్య అన్న పిలుపు వచ్చింది. అప్పటినుంచే అన్నీ గుర్తుకురావడం ప్రారంభమైంది' అని చెప్పుకొచ్చాడు శ్రీసత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్.
శ్రీసత్య- అర్జున్ కల్యాణ్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ వారిది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని స్పష్టం చేశాడు. కొన్ని ఛానెళ్లు వారి ఫ్రెండ్‌షిప్‌ను వక్రీకరించి మాట్లాడారని, అది చూసి తన భార్య ఏడ్చిందని చెప్పాడు. సత్య లైఫ్ గురించి పిచ్చిపిచ్చిగా రాస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ల మీద కేసు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. శ్రీసత్య వ్యక్తిగత విషయాల గురించి ఏది పడితే అది రాస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment