Bigg Boss Telugu 6: Adi Reddy Remuneration Details - Sakshi
Sakshi News home page

Adi Reddy: 15 వారాలకు ఆదిరెడ్డి ఎంత సంపాదించాడో తెలుసా?

Published Mon, Dec 19 2022 1:59 PM | Last Updated on Mon, Dec 19 2022 2:59 PM

Bigg Boss Telugu 6: Adi Reddy Remuneration Details - Sakshi

ఒక సినిమాకు స్టార్‌ హీరోయిన్‌ అందుకునే పారితోషికం.. తన నెల సంపాదనతో సమానం అని ఆదిరెడ్డే స్వయంగా చెప్పా..

కామన్‌ మ్యాన్‌ నుంచి రివ్యూయర్‌గా.. రివ్యూయర్‌ నుంచి కంటెస్టెంట్‌గా.. కంటెస్టెంట్‌ నుంచి కెప్టెన్‌గా.. కెప్టెన్‌ నుంచి థర్డ్‌ రన్నరప్‌గా ఎదిగాడు ఆదిరెడ్డి. విన్నర్‌ కాలేకపోయానన్న బాధ కన్నా తనను ఫినాలే వరకు తీసుకొచ్చి ఆదరించినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాడు. తనకింత గుర్తింపు తెచ్చిన బిగ్‌బాస్‌ షోకు, ఓట్లేసి ఇంత దూరం తీసుకువచ్చిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. ప్రేక్షకుల అభిమానమే కాకుండా బిగ్‌బాస్‌ ద్వారా అతడు ఎంత సంపాదించాడో చూద్దాం..

గత కొన్ని సీజన్ల నుంచి ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూ పోతున్నాడు. అతడి రివ్యూలను మెచ్చుకునేవాళ్లు ఉన్నారు, విమర్శించే వాళ్లూ ఉన్నారు. ఏ కంటెస్టెంట్‌ దగ్గరో డబ్బులు నొక్కేసాడు, అందుకే వారిని పొగుడుతూ వేరేవారిని తిడుతున్నాడన్న మాటలు కూడా వినిపించేవి. కానీ అలాంటి విమర్శలను ధీటుగా తిప్పికొట్టేవాడు ఆదిరెడ్డి. నాకు డబ్బిచ్చేంత సీన్‌ ఏ కంటెస్టెంట్‌కూ లేదని, బిగ్‌బాస్‌ షోలో ఉన్నవారి కంటే యూట్యూబ్‌లో తాను ఎక్కువ సంపాదిస్తానని చెప్పేవాడు. తనను కొనడం ఎవ్వరితరం కాదని కుండ బద్ధలు కొట్టేవాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాని మాట్లాడుతూ.. ఒక సినిమాకు స్టార్‌ హీరోయిన్‌ అందుకునే పారితోషికం.. తన నెల సంపాదనతో సమానం అని ఆదిరెడ్డే స్వయంగా చెప్పాడని తెలిపాడు. అతడు డబ్బుల కోసం కాకుండా బిగ్‌బాస్‌ జర్నీని ఆస్వాదించాలని వచ్చాడని పేర్కొన్నాడు. షానీ చెప్పినదాని ప్రకారమైతే బిగ్‌బాస్‌ అతడికి కోట్లల్లో ఇవ్వాలి. కానీ అంత ఇచ్చుకోలేమని బిగ్‌బాస్‌ చేతులెత్తేశాడట! సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వారానికి లక్ష రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకున్నాడట ఆది. ఈ లెక్కన 15 వారాలకుగానూ అతడు దాదాపు రూ.12 లక్షల వరకు ఆర్జించినట్లు తెలుస్తోంది.

చదవండి: గ్రాండ్‌ ఫినాలే రోజు గ్రాండ్‌గా నేహా పెళ్లి, ఫోటో వైరల్‌
శ్రీహాన్‌కు హింట్‌.. బిగ్‌బాస్‌పై రేవంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement