ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆదిరెడ్డి. నామినేషన్స్‌లో తను మాట్లాడినప్పుడు ఎదురు తిరగడానికి హౌస్‌మేట్స్ జంకేవారు. అంత సూటిగా, గునపంలా తన నామినేషన్ పాయింట్ దింపేవాడు. ఏదైనా పొరపాటు చేసినట్లు అనిపిస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ తను తప్పు చేయలేదనిపిస్తే నాగార్జునను సైతం ఎదిరించేందుకు వెనుకాడడు. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో అతడు థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. గుండె నిండా సంతోషంతో బయటకు వచ్చిన ఆదిరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు.
'ఒకప్పుడు నాకెన్నో సమస్యలుండేవి, కానీ ఈరోజు లేదు. 2013లో అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటికే బ్యాంకులో తీసుకున్న రూ.11 లక్షల లోన్ కట్టలేకపోయాం. 2018లో ఒకటిన్నర ఎకరా అమ్మేసి ఆ లోన్ తీర్చేశాం. అప్పటిదాకా చెల్లె పెన్షన్‌తో బతికాం. నెల్లూరులోని వరికుంటపాడుకు వెళ్తే అక్కడున్న ప్రతి మనిషి నేను పడ్డ కష్టాలన్నీ చెప్తారు. అమ్మ చనిపోయిన పదిహేను రోజుల తర్వాత బయటకు వెళ్తే తిన్నావా? అని జాలిగా అడిగేవారు. అంత దుర్భర స్థితిలో కాలం వెళ్లదీసాం. పెద్దయ్యాక మా అక్క ఫోన్ చేసి రెండు లక్షలు సంపాదించరా? నేను రెండు లక్షలు అప్పు చేసి నీకు పెళ్లి చేస్తానని మాట్లాడింది. అలాంటి దీన స్థాయి నుంచి పెళ్లి చేసుకుని నా కుటుంబంతో మంచి పొజిషన్‌లో నిలబడటమే కాకుండా ఇంతమంది జనాల ప్రేమను పొందడం నా సక్సెస్.
ఒకప్పుడు వదులైన బట్టలేసుకుని తిరిగాను, ఇప్పుడు సూట్‌లు వేసుకుని దర్జాగా తిరుగుతున్నాను. ఒకప్పుడు నా ఊరు నన్ను జాలిగా చూసింది, ఇప్పుడు వారు గర్వపడేలా చేశాను. చాలా హ్యాపీ.. కష్టాల వల్ల అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నాకూ కష్టాలు ఎదురయ్యాయి. కానీ వాటిని తట్టుకుని నిలబడ్డాను. అమ్మ చనిపోయేముందు వరకు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ఎవరి దగ్గరైనా ఒక బంగారు నగ అడిగి అది వేసుకునేది. ఆమె బతికి ఉండుంటే ఒంటినిండా నగలు వేసేవాడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
చదవండి: హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి
గ్రాండ్ ఫినాలే నుంచి నేరుగా మండపానికి, నేహా పెళ్లి ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment