
కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందనుకుంటే వ్యంగ్యానికి, వెటకారానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది ఫైమా. బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో తన కామెడీతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఫైమా రానురానూ కామెడీని పక్కనపెట్టి గేమ్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌తో గొడవలు, గొడవపడే క్రమంలో వెటకారాలు కనిపించాయి. 13 వారాల తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా తాజాగా బిగ్‌బాస్ కెఫె ఇంటర్వ్యూలో పాల్గొంది. వెటకారాన్ని ఎందుకు తగ్గించుకోలేదని యాంకర్ శివ అడగ్గా తాను బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉన్నానని బదులిచ్చింది. ఇప్పుడు నీకు ఇంట్లో ఉన్న ఒకరిని బయటకు పంపించే అవకాశం ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తావన్న ప్రశ్నకు రేవంత్ పేరు చెప్పింది.
ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్ల గురించి ఆమె మాట్లాడుతూ.. స్ట్రాంగ్ అనుకున్న గీతూ వెళ్లిపోయినప్పుడే మా అంచనాలు తారుమారవుతున్నాయనిపించింది. నేను టాప్ 5లో ఉండనని అప్పుడే అర్థమైంది. ఇకపోతే ఆర్జే సూర్య వెళ్లిపోయే వారం రోజుల ముందు నుంచి ఇనయ నాతో సరిగా మాట్లాడటం మానేసింది. కోపంలో చాలా మాటలు అనేస్తుంది. దానివల్ల నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ ఆమె గేమ్‌లో మగవాళ్లకు కూడా గట్టి పోటీనిస్తుంది.
శ్రీహాన్ గేమ్‌లో ఓడిపోతున్నామని తెలిసినా గెలవడానికే ప్రయత్నిస్తాడు. రోహిత్ ఎవరినీ నొప్పించకుండా మాట్లాడతాడు. ఆదిరెడ్డి ఫెయిర్‌గా ఆడుతున్నాడు, కాకపోతే మరీ ఎక్కువ ఆలోచిస్తాడు, అదే అతడి మైసస్. రేవంత్ గేమ్ స్టార్ట్ అవకముందే అందరికీ వార్నింగ్ ఇస్తాడు. కానీ అంతా అయిపోయాక వచ్చి సారీ చెప్తాడు. కీర్తి స్ట్రాంగ్ ప్లేయర్. శ్రీసత్య మొదట్లో భయపడి ఆడలేదు కానీ తర్వాత గేమ ఆడటం మొదలుపెట్టింది' అని చెప్పుకొచ్చింది ఫైమా.
Comments
Please login to add a commentAdd a comment