Bigg Boss 6 Telugu: RJ Surya Gives Clarity About His Relationship With Inaya - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో వాళ్లే నా ఫ్రెండ్స్‌.. వెనకాల గోతులు తీసి..

Published Sat, Nov 5 2022 6:04 PM | Last Updated on Mon, Nov 7 2022 12:14 AM

Bigg Boss Telugu 6: RJ Surya Gives Clarity About His Friendship With Inaya - Sakshi

బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో ఇనయ- సూర్యల లవ్‌ ట్రాక్‌ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే! ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఇనయ సూర్యను దూరం పెట్టడం, అతడిని నామినేట్‌ చేయడం, ఆ వారమే సూర్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఓపక్క ఇష్టం అంటూనే నామినేట్‌ చేస్తావ్‌, వెళ్లిపోతుంటే ముద్దుల వర్షం కురిపిస్తూ ప్రేమ ఒలకబోస్తావు, ఎందుకంత నటిస్తున్నావు? అని నామినేషన్‌లో ఇనయను హౌస్‌మేట్స్‌ ఓ ఆటాడుకున్నారు.

అయితే ఎవరెన్ని మాటలన్నా సరే ఇనయ మాత్రం.. సూర్య అంటే నాకిష్టం అంటూ అతడి ప్లేటులోనే తింటూ తన జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది. ఇదిలా ఉంటే గతవారం ఎలిమినేట్‌ అయిన సూర్య.. ఇనయ తన వెనకాల చులకన చేసి మాట్లాడిన వీడియో చూసి హర్టయ్యాడు. అందుకే, ఆమె గురించి ఎక్కడా ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ నెటిజన్లు ఊరుకుంటారా? పదేపదే ఇనయ కోసం గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉన్నారు. అందులోనూ సూర్య.. మెరీనా రోహిత్‌లకు సపోర్ట్‌ చేసి ఇనయను మాత్రం గాలికొదిలేయడాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? అంటూ నిలదీస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సూర్య.

'చాలామంది పర్సనల్‌గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా.. నేను ఒక్కసారి ఫ్రెండ్‌ అనుకుంటే వాళ్లు ఎప్పటికీ నా ఫ్రెండే. నా వెనకాల గోతులు తీసినా, నా గురించి తప్పుగా మాట్లాడినా ఎప్పటికీ స్నేహితురాలిగానే భావిస్తా. ఫ్రెండ్‌షిప్‌కు నేనెప్పుడూ సపోర్ట్‌ చేస్తాను. ఇనయ ఫైటర్‌.. ఈ సీజన్‌లో ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో ఫైమా, రాజ్‌, ఇనయ, కీర్తి నా స్నేహితులు' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. నిన్నటి గేమ్‌ గురించి మాట్లాడుతూ.. ఫైమా, ఇనయలను కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కెప్టెన్‌ దగ్గరి వరకు వచ్చి ఆగిపోయారు అని స్టోరీలో పేర్కొన్నాడు.

చదవండి: బిగ్‌బాస్‌: ఈ వారం గీతక్క ఎలిమినేట్‌!
ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త, కారణమేంటంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement