AnjiBabu: జంపింగ్‌ జపాంగ్‌ పార్టీలు మారడంలో దిట్ట | - | Sakshi
Sakshi News home page

AnjiBabu: జంపింగ్‌ జపాంగ్‌ పార్టీలు మారడంలో దిట్ట

Published Mon, May 6 2024 12:40 AM | Last Updated on Mon, May 6 2024 1:53 PM

-

ప్యారాచుట్‌ నేత అంజిబాబు

ఇప్పటికే కాంగ్రెస్‌, టీడీపీలకు ఝలక్‌

ఈసారి భీమవరం జనసేన అభ్యర్థిగా పోటీ

కేడర్‌ను పట్టించుకోని పులపర్తి

ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని జనసేన శ్రేణుల ఆందోళన

 అంటీముట్టనట్టుగా టీడీపీ, బీజేపీ నేతలు

గతంలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్‌ అవతారం

మున్సిపల్‌ స్థలంలో పార్కింగ్‌ ఫీజుల వసూళ్లు

కరోనా సమయంలో ప్రజలను కన్నెత్తి చూడని వైనం

సాక్షి, భీమవరం: పార్టీతో, కేడర్‌తో ఆయనకు పనుండదు.. అధికారమే పరమావధి.. పరాజయం చెందితే తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కంటికే కనిపించరు.. అందుకే ఆయన్ను ఏరుదాటాక తెప్ప తగలేసే రకమని కొందరు.. ప్యారాచూట్‌ నేతని మరికొందరు చెప్పుకుంటుంటారు. స్వతహాగా వ్యాపారంలో రాణించిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మరింత వెనకేసుకున్నారంటారు. చివరకు తన మల్టీఫ్లెక్స్‌ ఎదురుగా ఉన్న మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమించి కోట్లాది రూపాయల పార్కింగ్‌ ఫీజు రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ఘనుడిగా పేరొందారు భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు).

కండువాలు మారుస్తూ.. కృష్ణా జిల్లాకు చెందిన అంజిబాబు భీమవరంలో స్థి రపడ్డారు. వ్యాపారవేత్తగా ఉన్న ఆయన 2009లో దివంగత వైఎస్సార్‌ చలవతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌ కేడర్‌ ఆయన విజయానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడింది అంతంతమాత్రమే. ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్‌ ఆయనే. బినామీ పేర్లతో అన్ని పనులు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. కాంగ్రెస్‌ కేడర్‌ను గాలికొదిలేసి 2014 ఎన్నికల్లో పార్టీ ఫిరాయించారు. టీడీపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోగా ఆ పార్టీ శ్రేణులు ఆయన కోసం పనిచేశాయి. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అంజిబాబుకు వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో ఘోర పరాజయం తప్పలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై ఓటమి చెందిన పులపర్తి ఐదేళ్లుగా టీడీపీకి, ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూట మి పొత్తులో భాగంగా భీమవరం సీటు జనసేనకు రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కండువా కప్పుకుని మరోమారు తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

ప్రజలను పట్టించుకోలేదు : గత ఎన్నికల్లో ఓట మి అనంతరం టీడీపీ శ్రేణులకు, తనను నమ్ముకుని ఓటేసిన ప్రజలకు ముఖం చూపించకుండా చక్కగా తన వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అండగా కనీసం సేవా కార్యక్రమాలు నిర్వహించలేదు. మర లా ఎన్నికలు రావడంతో ఇప్పుడు గుర్తొచ్చామా అని పులపర్తిపై ప్రజలు మండిపడుతున్నారు.

మింగుడుపడని వైఖరి
పులపర్తి వైఖరి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌కు మింగుడుపడటం లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అంజిబాబు పార్టీ పటిష్టతకు, నాయకులు, కార్యకర్తల బాగోగులు గురించి పట్టించుకోరన్న పేరుంది. తన వెన్నంటి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలను కనీసం సంప్రదించకుండా ఆయన పార్టీ మారిపోతుంటారంటారు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే టీడీపీ నాయకులు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు పలువురు ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క జనసేన కేడర్‌ ఎన్నికల్లో తేడా వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఉన్నారంట.

వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం 
పదేళ్ల పాటు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబుకు తన వ్యాపార ప్రయోజనాలే ప్రధానమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్‌గా వందల కోట్లు వెనకేసుకున్నారంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీర ప్రాంత ప్రజలకు రక్షిత నీటిని అందించేందుకు సంకల్పించిన ప్రాజెక్టు విషయంలోనూ వ్యాపార ధోరణి చూపించారంటారు. ప్రాజెక్టు కోసమని భీమవరం రూరల్‌ మండలం చిన అమిరంలో సుమారు 50 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించి తన సొంతానికి వినియోగించుకున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. భీమవరంలోని తన మల్లీఫ్లెక్స్‌ వద్ద ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా పార్కింగ్‌ ఏర్పాటుచేసి పదేళ్ల పాటు కో ట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశా రు. 2019లో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికై న గ్రంధి శ్రీనివాస్‌ కన్నెర్రజేయడంతో పార్కింగ్‌ ఫీజు అక్రమ వసూళ్లకు తెరపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement