
సాక్షి, భీమవరం: భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి. ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు. ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు
భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..:
- ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే
- ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే
- కనీసం భోజనాలకైనా పెట్టుకోపోతే ఎలా?
- ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం
- ఓట్లు కొనాలా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి
- 2019 ఎన్నికలకు జీరో బడ్జెట్ అని ఎప్పుడూ చెప్పలేదు
- నాయకులందరికీ మళ్లీ మళ్లీ చెబుతున్నా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే
- బాగా పని చేయండి
- అందమైన అబద్దంలో మనమంతా బతుకుతున్నాం
- అందరూ కోట్లు ఖర్చు పెడుతున్నారు, నేనేమో మాట్లాడొద్దా?
- అంతా ఫాల్స్ సొసైటీ అయిపోయింది
- నేను కూడా కామ్ అయిపోవాల్సి వస్తోంది
- సీట్లు త్యాగం చేసిన వారికి గుర్తింపు ఉంటుంది
- డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని ఎవరికీ చెప్పలేదు
- ఎన్నికల సంఘం అభ్యర్థి ఖర్చును 45 లక్షలకు పెంచింది
- రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే
- ఓట్లు కొనాలా వద్దా అనేది నేను చెప్పను
- వేల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు సైలెంట్‌గా కూర్చుంటున్నారు
- టిడిపి, జనసేన కూటమికి బీజేపీ ఆశీస్సులుండాలి
- పొత్తు ప్రతిపాదనను ఒప్పించడానికి ఎంత నలిగిపోయానో నాకు తెలుసు
- కూటమి కోసం జాతీయ నాయకుల దగ్గర ఎన్ని చీవాట్లు తిన్నానో మీకు తెలియదు
- నేను జనసేన పార్టీ ప్రయోజనాల కోసం నేను ప్రయత్నించలేదు
- కూటమి బలంగా నిలబడాలన్నది నా కోరిక
- మనలో మనకు ఇబ్బందులున్నాయి, మన పార్టీ నేతలు త్యాగాలు చేయాలి, తప్పవు
- త్యాగం చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఇస్తాం
- మీరంతా టిడిపికి ఓటేస్తే.. ఓటు బదిలీ అయితే అదే మీకు ప్రాతిపదిక అవుతుంది
- దాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గుర్తిస్తాం
- తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది
- జనసేన కూడా ఎన్నికల్లో ఓడిపోయి ఉంది
- ఓడిపోయిన మనం కష్టాల్లో ఉన్న టిడిపికి చేయి అందించాం
- మేమున్నాం అని టిడిపికి అండగా నిలిచాం
- నాయకులు అందరినీ నమ్మలేం
- మేము ఉన్నాం అని రెండు చోట్లా పోటిచేయించి నన్ను ఓడించి ఇప్పుడు పారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment