Friends Attack On Btech Student In Bhimavaram SRKR College Hostel Room, Video Viral - Sakshi
Sakshi News home page

భీమవరం కాలేజీ హాస్టల్‌లో దారుణం.. 

Published Fri, Nov 4 2022 4:21 PM | Last Updated on Fri, Nov 4 2022 5:07 PM

Friends Attack On Student In Bhimavaram SRKR College - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంకిత్‌ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఐరన్‌ బాక్స్‌లో అంకిత్‌ ఛాతిపై వాతలు పెట్టారు. 

రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లీజ్‌ అని వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement