College Girls Wrestle In Public Over Ram Charan In Viral Video - Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై కొట్టుకున్న రామ్‌చరణ్‌ లేడీ ఫ్యాన్స్‌.. వైరలవుతోన్న వీడియో

Published Sat, Apr 1 2023 4:34 PM | Last Updated on Sat, Apr 1 2023 6:32 PM

College Girls Wrestle In Public Over Ram Charan In Viral Video - Sakshi

సినిమా స్టార్స్‌కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉంటుంది. నటీనటులను ఫాన్స్‌ తమ దేవుళ్లుగా భావిస్తుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు హడావిడీ చేస్తుంటారు ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువకులతోపాటు అమ్మాయిలు కూడా హీరోలంటే పడిచచ్చిపోతారు. గర్ల్‌ఫ్యాన్‌ పేరుతో సోషల్‌ మీడియా పేజ్‌లు తెరిచి అభిమానాన్ని చాటుకుంటారు. అమ్మాయిల ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న హీరోల్లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒకరు.

తాజాగా ఓ ఇద్దరు  రామ్‌ చరణ్‌ మహిళా అభిమానులు ఘర్షణ పడ్డారు. గొడవ ఎందుకు మొదలైందో తెలియదు కానీ హీరో విషయంలోనే ఇలా కొట్టుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ లేడీ ఫ్యాన్స్‌ వార్‌’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన ఇద్దరు యువతులు నడిరోడ్డుపై అందరిముందే పిచ్చిపిచ్చిగా తనుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్లు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టుకున్నారు.

చుట్టూ మిగతా విద్యార్థులు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా రెచ్చిపోయి గొడవ పడ్డారు. విద్యార్థినిలు కొట్టుకుంటుంటే అక్కడున్న వారంతా నవ్వుతూ, అరుస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. చివరికి అబ్బాయిలు జోక్యం చేసుకొని ఈ గొడవను ఆపేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ యువతులు తెలుగులో మాట్లాడుకోవడం ద్వారా ఏపీలో ఎక్కడో జరిగిందని భావిస్తున్నారు. అంతేగాక అసలు ఇద్దరు యువతులు నిజంగానే రామ్‌చరణ్‌ విషయంలో గొడవపడ్డారనేదానిపై స్పష్టత లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement