
సాక్షి, భీమవరం: నూతన వధూవరులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనువడు సాయిశ్రీకర వర్మ–కోమలి దుర్గసాహితిల వివాహం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీవీఎస్ గార్డెన్స్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయల్దేరారు. కాగా అంతకు ముందు ముఖ్యమంత్రికి హెలీప్యాడ్ వద్ద జిల్లా మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎంపీ రఘురామకృష్ణమరాజు, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment