ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఉన్నట్టుండి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా ఎన్సీపీలో నాయకత్వ మార్పుపై అసంతృప్తిగా ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలిపారు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి గవర్నరుని కలవడం, సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా ఆగమేఘాలమీద జరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియా సూలే తోపాటు నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఈ సందర్బంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ చేరికతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే అజిత్ పవర్ తో చేతులు కలిపాము. ఇందులో మా ప్రోద్బలం ఏమీ లేదు. ఆయనంతట ఆయనే వచ్చి మాతో చేతులు కలిపారని తెలిపారు.
ఆయనతోపాటు ఎన్డీయేలో చేరిన మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఛగన్ భుజబల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావు బాబా ఆత్రం, అదితి తాత్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలోపేతమైంది.
ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి..
Comments
Please login to add a commentAdd a comment