
తమిళనాడు తరహాలో ముస్లిం రిజర్వేషన్లు
► శాసనమండలిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
► 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ముస్లిం వర్గాలకు ఇప్పుడున్న 4% రిజర్వేషన్ల నుంచి 12%కి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడించారు. రిజర్వేషన్లు 50%కి మించ రాదని, సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ల తీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 50%మించొద్దని రాజ్యాంగంలో లేదని, సుప్రీం కోర్టు మాత్రమే చెప్పిందని పేర్కొన్నారు. బుధ వారం శాసనమండలిలో మైనారిటీల సంక్షే మంపై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు.
తమిళనాడు తరహాలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచేందుకు ప్రభుత్వం సుము ఖంగా ఉందని, ముస్లింల సామాజిక, ఆర్థికస్థితిగతులపై అధ్యయనం చేసి సుధీర్ కమిషన్ తన నివేదిక సమర్పించిందని, అయితే బీసీ కమిషన్ ద్వారా ఆయా అంశాలను అధ్యయనం చేయించాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుం దన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఒకప్పుడు మంచిస్థితిలో ఉన్న ముస్లింలలో కొన్ని వర్గాలు దళితుల కన్నా దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయన్నారు.
మసీదుల్లోని ఇమాం, మౌజంల గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.1,500కు పెంచుతున్నట్లు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. వచ్చే సమావేశాల్లో వక్ఫ్ బోర్డుకు జ్యుడీషి యల్ అధికారాలు కల్పించే బిల్లును ఆమోది స్తామని, వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని రూ.6 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెంచుతామన్నారు. పాతబస్తీలోని రేస్ కోర్సును తరలించి ఐటీ, ఎడ్యుకేషన్ సెంటర్ల ను నిర్మిస్తామని, చంచల్‌గూడ జైలును వికారా బాద్‌కు తరలించి బాలికల కోసం మదర్సాను నిర్మిస్తామన్నారు. మైనారిటీ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల భర్తీ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
హామీలు, ప్రకటనలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిమితం కాకుండా ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మైనా రిటీలకు సామాజిక సమానత్వం కల్పించేందు కే ఈ రిజర్వేషన్లు అని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న చొరవతోనే ముస్లిం లకు 4% రిజర్వేషన్లు అమలు కావడం తో ఎంతోమంది డాక్టర్లు, ఉన్నత విద్యావం తుల య్యారని చెప్పారు.
మత రిజర్వేషన్లకు వ్యతిరేకం: రామచంద్రరావు
మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పనకు తాము వ్యతిరేకమని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామ చంద్రరావు అన్నారు. వెనుకబడిన మైనారిటీల సంక్షేమానికి ఎంత డబ్బు ఖర్చు చేసినా అభ్యంతరం లేదన్నారు. మైనారిటీలకు బీసీ కోటాలో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలు నష్టపోతున్నారని, మైనారిటీ రిజర్వేషన్లతో ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు.