డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సీపీఐ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న నేపథ్యంలో కేంద్రం పై ఒత్తిడి తెచ్చి జాతీయ విపత్తు నిధుల నుంచి రూ.3 వేల కోట్ల నిధులు రాబట్టేందుకు సీఎం కేసీఆర్ కృషిచేయాలని సీపీఐ కోరింది. బడ్జెట్‌లో ముఖ్యమంత్రి నిధులకింద కేటాయించిన రూ.4,640 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు విడుదలచేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
3 బృందాలుగా వివిధ జిల్లాల్లోని కరువు పరిస్థితులను పరిశీలించి వచ్చిన సీపీఐ ప్రతినిధులు బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. అజీజ్‌బాషా, పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నర్సింహ తదితరులు డిప్యూటీ సీఎంను కలసినవారిలో ఉన్నారు. కాగా, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అందుబాటులో ఉన్న నిధులతో సహాయచర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశిస్తామని డిప్యూటీ సీఎం హామీనిచ్చినట్లు సీపీఐ నేతలు తెలిపారు.
కేంద్రం నుంచి కరువు నిధులు తీసుకురావాలి
Published Thu, Apr 21 2016 4:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement