కానిస్టేబుల్‌ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్‌ అలీ | Telangana Home Minister Mohammed Ali Slaps Constable At Talasari Birthday Program; Video Viral - Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్‌ అలీ

Published Fri, Oct 6 2023 1:28 PM | Last Updated on Fri, Oct 6 2023 2:49 PM

Home Minister Mohammed ali Slaps Constable at Talasari Birthday Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్‌ అయిన కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు  మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. 

ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే  బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన  హోంమంత్రి మహమూద్ అలీ  కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్‌ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. 

ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement