hyderabad - bangalore
-
కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP — Naveena (@TheNaveena) October 6, 2023 -
BRS Party: మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలందర్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే సమ్మేళనాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రచారం కల్పించడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులను సమన్వయ పరిచేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజుతో కలిసి జిల్లాకు సమన్వయకర్తగా అధిష్టానం నియమించిన ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ప్రజల్లోకి పంపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో కార్యకర్తలందరిని భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని అధిష్టానం ఆదేశించింది. ఇందు కోసం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరిట గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో డివిజన్లు/వార్డుల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, రైతుబంధు కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్లతో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరితో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సంబంధిత నియోజకవర్గ ఇన్చార్జి ఉండే ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, ఇతర పదవులున్న నేతలందరినీ ఆహా్వనిస్తారు. పురపాలక సంఘాల్లో కార్పొరేటర్/కౌన్సిలర్, పార్టీ వార్డు అధ్యక్షుడు ఇతర కార్యవర్గాన్ని భాగస్వామ్యం చేస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు సమావేశాల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నెల రోజుల పాటు బీఆర్ఎస్ సమ్మేళనాలు గ్రామ కార్యకర్తల సమ్మేళనం ఏ తేదీన నిర్వహిస్తారో నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్ణయించాల్సి ఉంటుంది. వివరాలను పార్టీ జిల్లా ఇన్చార్జి లేదా సమన్వయకర్తకు అందజేస్తే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 24వ తేదీలోగా ఈ సమ్మేళనాలు పూర్తిచేయాలి. అనంతరం 25న గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేసి పండగ వాతావరణం తలపించేలా కార్యక్రమం చేపట్టాలని సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనుండటంతో జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల విజయవంతం కోసం పార్టీ జిల్లా సమన్వయ కర్త ఇక్కడకు చేరుకుని నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం పటిష్టపరచడం పైనా దృష్టిపెడుతారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఇందులో చేర్పించనున్నారు. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో జూన్ నెలలోనే విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విభేదాలు సమసి.. సమన్వయం జరిగేనా..! మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల మ ధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేధాలు.. త్వర లో జరిగే విస్కృత సమ్మేళనాలతో సమసి పోగలవా .. లేక మరింత ముదురుతాయన్న చర్చ పార్టీ వర్గాలను వేధిస్తోంది. మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లా పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తుమని, 5 ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా ప్రకటించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే.. ఉన్నాయి. అలాగే మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయరు బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు కేడర్‌లో చర్చ సాగుతోంది. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు తమ వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోకల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఉన్నప్పటికీ వారి మధ్యనే ఉన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. అయితే.. పార్టీ విస్తృత సమ్మేళనాలతో బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొని ఉన్న విభేదాలు సమసిపోతాయా.. లేక భగ్గుమంటాయా.. అన్న ఆందోళన కేడర్ నుంచి వ్యక్తమవుతుండగా, దీన్ని జిల్లా సమన్వయకర్త, పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బర్చగలదో వేచి చాడాల్సిందే మరి. సమ్మేళనాలు ఇలా... పది గ్రా మాలను కలిపి ఒక సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. పట్టణాల్లో 3 నుంచి 4 వార్డులను కలిపి ఓ సమ్మేళనం ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలకు అక్కడ చేపట్టిన అభివృద్ధిని గణాంకాలతో సహా వి వరిస్తారు. పథకాలతో లబ్దిపొందిన వారి జాబితాను అందిస్తారు. ఆ వివరాలతో కార్యకర్తలు కలసికట్టుగా పర్యటిస్తూ.. ప్రభుత్వం గ్రామానికి ఏం చేసింది? ఎన్ని నిధులతో పనులు జరిగాయి? ఎందరు లబ్ధి పొందారో వివరించి ప్రజలను ఆకట్టుకునేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. -
హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఆకాశ ఎయిర్ హైదరాబాద్ నుంచి సర్వీసులను నేటి (బుధవారం) నుండి ప్రారంభిస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–గోవా మధ్య ఇవి నడువనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రెండు సర్వీసులను ఫిబ్రవరి 15 నుంచి జోడించనున్నారు. విశాఖపట్నం సహా ప్రస్తుతం ఆకాశ ఎయిర్ దేశంలోని 13 నగరాలకు సేవలను అందిస్తోంది. ఈ ఏడాది మరో నాలుగైదు నగరాలు తోడవనున్నాయని కంపెనీ కో–ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థ వద్ద 14 విమానాలు ఉన్నాయని చెప్పారు. మార్చి నాటికి మరో నాలుగు వచ్చి చేరుతున్నాయని వెల్లడించారు. 2023 రెండవ అర్ధ భాగంలో అంతర్జాతీయ సర్వీసులు నడుపుతామని తెలిపారు. నాలుగేళ్లలో ఆకాశ ఎయిర్ ఖాతాలో 72 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయని కో–ఫౌండర్ బెల్సన్ కొటినో పేర్కొన్నారు. -
Hyderabad: స్వచ్ఛ సాగర్‌గా హుస్సేన్‌సాగర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు మార్చి నెల నుంచి మహానగరాభివృద్ధి సంస్థ, పీసీబీ సూచనలతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనుంది. ఏటా వేసవిలో ప్రధానంగా నాచు, నైట్రోజన్, పాస్పరస్‌లు భారీగా పెరిగి జలాల నుంచి దుర్గంధం పెద్ద ఎత్తున వెలువడుతుండడంతో స్థానికులు, వాహనదారులు, పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణమైన నాచు (ఆల్గే) ఉద్ధృతిని తగ్గించేందుకు జలాల్లో పర్యావరణహిత ఏరోబిక్ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా బయోరెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించనుంది. ఇందుకోసం ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. గతంలో కెనడాకు చెందిన ఓ సంస్థ ఈ ప్రక్రియ చేపట్టడంతో సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో తాజాగా మరోసారి బయో రెమిడియేషన్‌కు సిద్ధమవుతుండడం గమనార్హం. మార్చి నుంచి జూన్ వరకు.. ►వచ్చే నెల నుంచి వర్షాలు కురిసే జూన్ వరకు ఈ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా 4.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హుస్సేన్‌సాగర్ క్యాచ్మెంట్ పరిధి సుమారు 240 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ జలాశయంలోకి నాలుగు నాలాల నుంచి నీరు వచ్చి చేరుతోంది. ►ప్రధానంగా కూకట్పల్లి నాలాలో ప్రవహించే 400 మిలియన్ లీటర్ల రసాయనిక వ్యర్థ జలాలు సాగర్‌కు శాపంగా పరిణమించాయి. ఈ నీరు సాగర్‌లోకి చేరకుండా గతంలో డైవర్షన్ మెయిన్ ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ బల్క్‌డ్రగ్, ఫార్మా, రసాయనిక పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థజలాలు కూకట్పల్లి నాలా ద్వారా సింహభాగం సాగర్‌లో చేరుతున్నాయి. ►దీంతో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి కారణంగా ఏటా వేసవిలో నీరు ఆకుపచ్చగా మారి దుర్గంధం వెలువడుతోంది. బయో రెమిడియేషన్‌తో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదును ప్రతి లీటరుకు 4 మిల్లీ గ్రాములు, బీఓడీని 36 మిల్లీగ్రాముల మోతాదు ఉండేలా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో జలాల్లో వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ సాధ్యపడుతుందని చెబుతున్నారు. చదవండి: (ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి) అడుగున ఉన్న వ్యర్థాల శుద్ది ఎప్పుడో? సుమారు నాలుగు దశాబ్దాల పాటు పారిశ్రామిక వ్యర్థ జలాల చేరికతో సాగర గర్భంలో రసాయనిక వ్యర్థాలు టన్నుల మేర అట్టడుగున పేరుకుపోయాయి. ఈ వ్యర్థాలను ఇజ్రాయెల్,జర్మనీ దేశాల్లో ఉన్న సాంకేతికత ఆధారంగా తొలగించి.. ఈ వ్యర్థాలను మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ ఆనకట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా మిషన్ హుస్సేన్‌సాగర్‌కు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ స్వచ్ఛ సాగర్ ఇప్పటికీ సాకారం కాలేదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం. -
Hyderabad to Bengaluru: ఎన్‌హెచ్ 44 ఇక ‘సూపర్’ హైవే
సాక్షి, అనంతపురం: హైదరాబాద్ (తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు (కర్ణాటక)కు వెళ్లే జాతీయ రహదారి–44 సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారం డిజిటల్ బోర్డులపై ప్రదర్శించేలా ఈ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రస్తుతమున్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు. రహదారికి ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 251 కిలో మీటర్లు ఉంది. ఢిల్లీ –ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలోనే హైదరాబాద్ – బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. చదవండి: (Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..) సర్వే పనులు ప్రారంభించాం హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రోడ్డుగా మారుస్తున్నాం. ఈ జాతీయ రహదారి తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఆంధ్రప్రదేశ్‌లో 251 కిలో మీటర్లు ఉంది. ఇప్పటికే రహదారి విస్తరణకు సర్వే చేస్తున్నారు. త్వరలోనే రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానంతో సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. త్వరలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్య తీరనుంది. – జేఎల్ మీనా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
బెంగళూరు - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్... రైల్వే శాఖ కీలక నిర్ణయం
దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలో ఇప్పటికే ఎనిమిది కారిడార్లలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కాగా భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ని పరిగణలోకి తీసుకుని మరో నాలుగు కారిడార్లలో బుల్లెట్ ట్రైన్‌ని పరుగులు పెట్టించాలని నిర్ణయం తీసుకుంది. వాటి సరసన ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా విరాజిల్లుతున్నా బుల్లెట్ ట్రైన్ల పరంగా ఇండియా ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఆసియాలో బిగ్గెస్ట్ ఎకానమీలైన చైనా, జపాన్లలో ఇప్పటికే బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో బుల్లెట్ ట్రైన్ కలిగిన దేశాల సరసన ఇండియాను నిలపపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8 కారిడార్లలో బుల్లెట్ ట్రైన్ కలను సాకారం చేసేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా 8 రూట్లలో బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో ముంబై - సూరత్ - వడోదర - అహ్మదాబాద్, ఢిల్లీ - నోయిడా - ఆగ్రా - కాన్పూర్ - లక్నో - వారణాసి, ఢిల్లీ - జైపూర్ - ఉదయ్‌పూర్ - అహ్మదాబాద్, ముంబై - నాసిక్ - నాగ్‌పూర్, ముంబై - పూణే - హైదరాబాద్, చెన్నై - బెంగళూరు - మైసూర్, ఢిల్లీ - ఛండీగడ్ - లూథియానా - జలంధర్ - అమృత్సర్, వారణాసి - పాట్నా - హౌరా మార్గాలు ఉన్నాయి. నిర్మాణంలో మొదట ప్రతిపాదించిన 8 కారిడార్లలో ముంబై - అహ్మబాబాద్ రూట్లో 508 కిలోమీటర్ల నిడివితో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీని కోసం ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ పేరుతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు ముంబై - హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి సంబంధించి భూ సేకరణ పనులు షురూ అయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు రెడీ అయ్యాయి. కొత్తగా నాలుగు ప్రస్తుతం డీపీఆర్‌లు రెడీ అయిన ప్రాజెక్టులతో పాటు మరో నాలుగు మార్గాల్లో బుల్లెట్ రైలుని అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో బెంగళూరు - హైదరాబాద్ (618 కి.మీ), నాగ్‌పూర్ - వారణాసి (855 కి.మీ), పట్నా - గువహాటి (850 కి.మీ), అమృత్సర్ - పఠాన్‌కోట్ - జమ్ము (192 కి.మీ) మార్గాలను ఉన్నాయి. వీటిని ఇప్పటికే నేషనల్ రైల్ ప్లాన్ 2022లో చేర్చారు. త్వరలో ఈ మర్గాల్లో బుల్లెట్ రైల్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నారు. ఉత్తరాదికే ప్రాధాన్యం కేంద్రం అమలు చేస్తోన్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు గణనీయంగా లబ్ధి పొందనుండగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళా, ఆంధప్రదేశ్‌లతో పాటు ఒడిషా, ఝార్ఖండ్‌లను పూర్తిగా విస్మరించారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కంటితుడుపు చర్యలా బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు -
రాజధానిలో వరుస హత్యల కలకలం
నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. మూడు హత్యలు ఒకేరోజు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మైలార్‌దేవ్‌పల్లిలో పాత కక్షల కారణంగా ఐదుగురు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా నరికి చంపారు. చిక్కడపల్లిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా గొంతు కోసి చంపారు. హత్య చేసి శవాన్ని మాయం చేద్దామని భావించిన ఓవ్యక్తి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన జూబ్లీహిల్స్ కార్మీకనగర్లో చోటుచేసుకుంది. – మైలార్‌దేవ్‌పల్లి/చిక్కడపల్లి/బంజారాహిల్స్ రాజధాని నగరం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన, వెలుగులోకి వచ్చిన మూడు హత్యోందతాలతో రక్తచరిత్రను తలపించింది. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. మైలార్‌దేవ్‌పల్లి వట్టేపల్లిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను ఆటోలో వచ్చిన అయిదుగురు ఆగంతుకులు దారుణంగా హతమార్చారు. మరో ఘటనలో చిక్కడపల్లి సూర్యానగర్ ప్రాంతానికి చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు సద్‌నామ్‌సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్న ఈ దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో ఇంకో దారుణం బయటపడింది. హత్య చేసిన 36 గంటల తర్వాత గురువారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగు చూసింది. కూకట్‌పల్లిలో టైలరింగ్ చేసే మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్‌ను ఓ ఆగంతుకుడు కత్తితో పొడిచి చంపి మృతదేహం పైభాగాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము దాకా ఆ ఇంట్లోనే ఉన్నాడు. నగరంలో ఒకేరోజు మూడు హత్యలు వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల పుటేజీలతో నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మిట్ట మధ్యాహ్నం మర్డర్ మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని వట్టేపల్లి ప్రాంతం.. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలు.. అప్పటి వరకు తమ పనుల్లో నిమగ్నమైన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుల్లెట్ వాహనంపై వస్తున్న రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను ఆటోలో వచి్చన ఐదుగురు ఢీ కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీగలకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ అసద్‌ఖాన్ (48), శాస్త్రిపురం వాసి అంజద్ ఖాన్ సడ్డకులు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుటుంబ కలహాలు వీరిద్దరి మధ్యా వివాదాలకు దారి తీశాయి. వీటి నేపథ్యంలోనే 2018లో శా్రస్తిపురంలోని ఓ స్క్రాప్ దుకాణంలో అంజద్ ఖాన్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ ఖాన్ చాలాకాలం పాటు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతడిపై రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల్లో కొన్ని కేసులు ఉండటంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అసద్, అంజద్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో అసద్ ఖాన్ బుల్లెట్ వాహనంపై వట్టెపల్లి నైస్ హోటల్ సమీపంలోని ఇండియా ఫంక్షన్ హాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో వట్టెపల్లి వైపు నుంచి ఆటోలో ఎదురుగా వచ్చిన దాదాపు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అసద్ వాహనాన్ని ఢీ కొట్టారు. కిందపడిపోయిన అతడు తేరుకునే లోపే ఆటోలోని వ్యక్తులు వేట కత్తులతో కిందికి దిగారు. అదే వేగంతో అసద్‌పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లు సైతం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో కొన్ని నిమిషాల పాటు కత్తులతో నరుకుతూనే ఉన్నారు. మిగిలిన దుండగులు తమ కత్తులు అక్కడే పడేసి వెళ్లిపోగా... ఓ నిందితుడు మాత్రం కాస్త దూరం వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చాడు. అసద్ బతికి ఉన్నాడనే అనుమానంతో తన వద్ద ఉన్న కత్తితో అతడి తలపై మరో మూడు వేట్లు వేశాడు. ఆ సమయంలోనూ అసద్‌లో కదలికలు ఉన్నాయి. ఐదో వ్యక్తి కూడా తన కత్తిని అక్కడే పడేసి పరారయ్యాడు. కొద్దిసేపు కొన ఊపిరితో ఉన్న అసద్ ఆపై ఘటనాస్థలిలోనే కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంజద్ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగిందా? కుటుంబ కలహాలా? ఇతర కారణాలా? అనేవి ఆరా తీస్తున్నారు. గొంతు కోసి చంపాడు.. చిక్కడపల్లి సూర్యానగర్ ప్రాంతంలో నివసించే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్న ఈ ఉదంతం గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. హతుడి రూమ్‌లో ఉండే మరో వ్యక్తి ఆచూకీ లేక పోవడంతో అతడి ప్రమేయంపై పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన సద్నామ్సింగ్ (30) కొన్నాళ్ల క్రితం తన భార్య బల్జీత్ కౌర్‌తో కలిసి నగరానికి వలసవచ్చాడు. ఏడేళ్ల కుమారుడితో కలిసి వీళ్లు చిక్కడపల్లి సూర్యానగర్‌లో ఓ ఇంట్లో ఏడాదిన్నరగా అద్దెకు ఉంటున్నారు. సద్నామ్సింగ్ నారాయణగూడలోని జాహ్నవి కశాశాల వద్ద ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. బల్జీత్ కౌర్ తన కుమారుడితో కలిసి గత నెల 10 నుంచి అఫ్జల్‌గంజ్ గురుద్వార్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఆఖరుసారిగా తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. గురువారం తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. సాయంత్రం తన స్నేహితులతో కలిసి సూర్యానగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా... రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న భర్త కనిపించాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచి్చంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం స్థితిగతుల్ని బట్టి బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సహాయకుడిగా పని చేసేందుకు వీరి సమీప బంధువు నిషాంత్ సింగ్ 20 రోజుల క్రితం నగరానికి వచ్చి సద్‌నామ్‌సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. రాత్రి నుంచి అతడి ఆచూకీ లేకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతడి ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తూ ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సమీప బంధువైన నిషాంత్ సింగ్ వీరింటికి వచి్చన కొన్ని రోజులకే బల్జీత్‌కౌర్ తన కుమారుడితో గురుద్వారాకు వెళ్లిపోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. హత్య చేసి ఫ్రిజ్‌లో హత్య చేసి శవాన్ని మాయం చేద్దామని భావించాడు.. తన ఒక్కడితో సాధ్యం కాకపోవడంతో విరమించుకున్నాడు.. మృతదేహాన్ని వంటింటిలోని ఫ్రిజ్‌లో పెట్టడానికి యత్నించాడు. అది కుదరకపోవడంతో పై భాగం వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టి పరారయ్యాడు. జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో చోటు చేసుకున్న ఈ హత్య 36 గంటల తర్వాత గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో టైలరింగ్ చేసే మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్ (38) కారి్మకనగర్లోని విద్యాసాగర్ పాఠశాల సమీపంలోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి మూడేళ్లుగా అద్దెకుంటున్నాడు. మంగళవారం ఉదయం భార్య రుబీనా పిల్లల్ని తీసుకుని శ్రీరాంనగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి అహ్మద్ సైతం అక్కడికే వెళ్లి భోజనం చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. గురువారం సాయంత్రం తాళం వేసి ఉన్న సిద్దిఖ్ అహ్మద్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో యజమానికి అనుమానం వచ్చింది. ఆయనతో పాటు సమీపంలో నివసించే వారు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తాళం పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వంటింట్లోని ఫ్రిజ్‌లో తలభాగం, మిగిలిన సగభాగం నేలపై ఉన్న సిద్దిఖ్ అహ్మద్ మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించిన అధికారులు హత్యపై ఓ నిర్ధారణకు వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సిద్దిఖ్ అహ్మద్ అత్త వారింటి నుంచి తన ఇంటికి వచ్చే సమయానికే ఓ అగంతకుడు అక్కడ వేచి ఉన్నాడు. సిద్ధిఖీ వెనుకే ఇంట్లోకి వెళ్లిన అతగాడు కత్తితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై రక్తం కారు తుండటంతో సిద్దిఖ్ ధరించిన బనీను తీసి అతడి తలకు కట్టాడు. అనంతరం గదిలో పడిన రక్తం మరకలు శుభ్రం చేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు తలుపునకు ఉన్న కర్టెన్ తీసి అందులో చుట్టాడు. బయటకు తరలించేందుకు ప్రయతి్నంచినా సాధ్యం కాకపోవడంతో శవాన్ని రిఫ్రిజిరేటర్ వరకు లాక్కెళ్లాడు. దాన్ని రిఫ్రిజిరేటర్లో పెడితే కుళ్లిపోదనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు. ఇదీ విఫలం కావడంతో ఫ్రిజ్‌ను ఖాళీ చేసి తలవైపు భాగాన్ని లోపలకు పెట్టాడు. మిగిలిన శరీర భాగం బయటే వదిలేసి ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచేశాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4.45 గంటల వరకు నిందితుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆపై బయటకు వచ్చిన అతగాడు ఇంటికి తాళం వేసి పరారైనట్లు రికార్డు అయింది. దాదాపు 36 గంటల అనంతరం గురువారం సాయంత్రం ఈ హత్య వెలుగులోకి వచ్చిం. సిద్దిఖ్ అహ్మద్‌కు నలుగురు అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయాన్ని హతుడి భార్య పోలీసులకు వివరించింది. జహీరాబాద్ సమీపంలోని స్థలానికి సంబంధించి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని వెల్లడించింది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి దాదాపు 30 ఏళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిద్దిఖ్ కదలికలపై స్పష్టమైన సమాచారం ఉన్న వ్యక్తే హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫ్రిజ్ ముందు పడిఉన్న సిద్దిఖ్ అహ్మద్ మృతదేహం చదవండి: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం.. -
హైదరాబాద్: పాఠశాలలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో స్కూల్లో 50 మంది విద్యార్థులు పాఠశాలలో ఉండగా, వారందరూ.. సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. (చదవండి: ప్రేమికులు రోజు బహుమతంటూ వల వేస్తారు..) -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ పంజా
సాక్షి, సిటీబ్యూరో: ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌లో ఎంతో కీలకంగా వ్యవహరించే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కన్పించని శత్రువుతో పోరాడుతున్న వారిలో వైద్య సిబ్బంది ముందుంటున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన బాధితులకు ఆరోగ్యాన్ని పంచాల్సిన వారే.. ప్రస్తుతం ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. 200 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్లో ఉండగా.. వీరిలో 72 మంది వైద్యులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా నిమ్స్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా, కొండాపూర్ ఏరియా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది ఎక్కువగా వైరస్ బారినపడటం గమనార్హం. వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడుతుండటం, వారితో పాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారు కూడా క్వారంటైన్లో ఉండాల్సి రావడంతో ఆయా ఆస్పత్రుల్లోవైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్య సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలు అందక అనేక మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. కేవలం ఒక్క ఉస్మానియాలోనే రోజుకు కనీసం 15 మంది చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే ప్రకటిస్తున్నాయి. కళ్లముందు రోగుల ప్రాణాలు పోతున్నా వైద్యులుగా తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉన్నట్లు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యాలయంలో ఎంత మందికి.. ♦ పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 11 మంది సిబ్బంది వైరస్ బారిన పడటంతో ఇప్పటికే ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ♦ కరోనా హై లెవల్ కమిటీలోని కీలకమైన ఇద్దరు వైద్యులకు ఇటీవల వైరస్ సోకింది. దీంతో వారికి సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్, ఇతర అధికారుల్లో ఆందోళన మొదలైంది. ♦ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకింది. ♦ ప్రతిష్టాత్మక నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో మొత్తం 67 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్ సిబ్బంది. దీంతో నెఫ్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. డయాలసిస్ సేవలను కూడా రెండు రోజుల క్రితమే పునరుద్ధరించారు. ♦ ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 64 మంది పీజీలు, సీనియర్ వైద్యులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఒక్క పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోనే 33 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. వీరిలో ఒక అటెండర్ కూడా మృతి చెందారు. ♦ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 మంది పీజీలు , నిలోఫర్‌లో నలుగురు పీజీలు, ఛాతీ ఆస్పత్రిలో ఇద్దరు సీనియర్లు, కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆరుగురు పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ♦ కోఠి ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటిండెంట్ సహా పలువురు వైద్య సిబ్బందికి పాజిటివ్ లక్షణలు బయటపడ్డాయి. ♦ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు సహా మరో ఎనిమిది మంది పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకింది. ♦ సరూర్‌నగర్ పీహెచ్సీ డాక్టర్ సహా పాతబస్తీలోని ఓ డాక్టర్‌తో పాటు నలుగురు ఏఎన్ఎంలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ♦ హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరికి సన్నిహితంగా మెలిగిన జిల్లా అధికారి సహా ఇతర సీనియర్ వైద్యులు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. -
ఎవరు చెప్పినా ఆగని సెంటిమెంట్ ప్రయాణాలు
సాక్షి, సిటీబ్యూరో: ఉన్నఊరు.. కన్నవారు.. ఆ గాలి.. ఆ నేల..ఆ ఆత్మీయ అనుబంధాలు మదిలో మెదిలాయి.. నగరంలో నరకం అనుభవించే కంటే ఓసారి ఊరికి పోయొస్తే తప్ప ప్రాణం కుదుట పడదంటూ స్వగ్రామాలకు వెళ్తున్న వలసకూలీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉపాధి కల్పించలేక నగరాలకు పోమ్మన్న ఊరు సైతం.. ఇప్పుడు కరోనా బారినపడకుండా కలో..గంజో తాగి జీవిద్దాం తిరిగి రమ్మంటోంది.వలస కార్మికులకు కూడాసొంతూరు వెళ్లడం సెంటిమెంట్‌గా తయారైంది. లాక్డౌన్ మినహాయింపులతో వివిధరంగాల పనులు మొదలైనా.. వలస కార్మికుల అడుగులు మాత్రం సొంతూళ్ల వైపు పడుతున్నాయి. ఇప్పటికే కాలినడక, సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు,బస్సులు, లారీలు, గూడ్స్ వాహనాలు, శ్రామిక రైళ్లు, తదితర మార్గాల్లో సుమారు 10 లక్షల మందికి పైగా వలస కార్మికులు హైదరాబాద్ నగరం దాటేశారు. మరో సుమారు 2 లక్షల వరకు సొంతూళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నాలు సాగుతున్నా.. ఒక్కసారి చూసి వస్తామంటూ స్వస్థలాల బాట పడుతున్నారు. మూటా ముల్లే సర్దుకుని.. లాక్‌డౌన్‌తో లక్షలాది మంది వలస జీవులు చేతిలో పనులు లేక.. పూట గడవడం కష్టమై ఇప్పటికే మూటా ముల్లే సర్దుకున్నారు. నెలన్నర రోజులుగా సొంతూళ్లకు వలస కొనసాగుతూనే ఉంది. అప్పట్లో లాక్డౌన్ ఎప్పుడేత్తేసారో తెలియక.. ఉపాధిపై భరోసా లేక కాలినడకన స్వస్థలాల బాటపట్టగా, ఆ తర్వాత ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్‌తో బస్సులు, రైళ్లలో ప్రయాణమవుతున్నారు. రైళ్లలో మాత్రం స్వస్థలం దగ్గర వరకు గమ్యం చేరుకుంటున్నా.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సులు మాత్రం రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే రాకపోకలకు పరిమితమవుతున్నాయి. ఇప్పటికే 70 శాతం వలస కార్మికుల స్వస్థలాలకు చేరుకోగా, మరికొంత మంది ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ముందుకు సాగని భవన నిర్మాణ పనులు.. లాక్డౌన్లో మినహాయింపు లభించిన భవన నిర్మాణ రంగం పనులు ముందుకు సాగడం లేదు. కూలీ కొరతతో çపది శాతం పనులు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. నిపుణులైన కార్మికులు అందుబాటులో లేక పరిశ్రమల ఉత్పత్తి పరిస్థితి అంతంత మాత్రంగా తయారైంది. భవన నిర్మాణ రంగం కూలీలు క్యాంపులన్నీ ఖాళీ అయ్యాయి. సుమారు 1500కుపైగా ప్రాంతాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అత్యధికంగా భవన నిర్మాణ రంగం కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. ఇప్పటికే 70 శాతానికి పైగా వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కూలీలను ఆపడంతో పాటు వెళ్లిపోయిన కూలీలను సైతం తిరిగి రప్పించేందుకు భవన నిర్మాణ రంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శ్రామిక్ రైళ్లలో రెండు లక్షల మందికిపైనే.. శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో సుమారు రెండు లక్షల మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 1 నుంచి శ్రామిక ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, శివారు ప్రాంతాల్లోని లింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, ఘట్కేసర్, బీబీనగర్, చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్ల నుంచి ఇప్పటి వరకు 198 శ్రామిక్ రైళ్లు బిహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. మరో రెండు శ్రామిక రైళ్లు శుక్రవారం బయలుదేరనున్నాయి. కొనసాగుతున్న తాకిడి.. వలస కార్మికులు సొంతూళ్ల వెళ్లేందుకు సుమారు ఐదు లక్షలకుపైగా అధికారికంగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలన్నర రోజులుగా పోలీస్టేషన్లకు వలస కార్మికుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మహానగర పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 5.20 లక్షల మంది వలస కూలీలు, కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో రైలు మార్గం ద్వారా రెండు లక్షల మంది ప్రయాణం కాగా, మరో 3.20 లక్షల మంది బస్సులు, వాహనాలు, ఇతరత్రా మార్గాల ద్వారా రాష్ట్ర సరిహద్దు దాటేశారు. అధికారిక లెక్కల్లో లేని సుమారు రెండు లక్షలకుపైగా కార్మికులు కాలినడకన, మరో మూడు లక్షల వరకు సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు, గూడ్స్ వాహనాల ద్వారా సొంతూళ్ల బాట పట్టారు. సెంటిమెంట్ ప్రయాణాలవీ.. లాక్డౌన్లో భవన నిర్మాణ రంగానికి మినహాయింపుతో పనులు ప్రారంభమైనా.. వలస కార్మికులు ఆగడం లేదు. సొంతూళ్లకు వెళ్లి వస్తామంటున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో సొంతూళ్లకు వెళ్లాలన్న సెంటిమెంట్ పెరిగింది. అక్కడికి వెళ్లి వస్తే కానీ వారు కుదుట పడే పరిస్థితి కనిపించడం లేదు. వెళ్తామన్న వారిని పంపిస్తున్నాం. మళ్లీ వస్తామంటున్నారు. అందుబాటులో ఉన్న వారితో పనులు చేయిస్తున్నాం. – రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్, హైదరాబా ప్రయాణాలు ఆగడం లేదు.. వలస కార్మికుల ప్రయాణాలు ఆగడం లేదు. స్వస్థలాలకు రైళ్లు, ప్రత్యేక బస్సులో వెళ్లేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కేవలం మేడ్చల్ క్యాంప్ నుంచే సుమారు రెండున్నర లక్షల మంది వరకు వలస కార్మికులను స్వస్థలాలకు తరలి వెళ్లారు. క్యాంప్ ఎత్తివేసినా.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అక్కడికి వస్తూనే ఉన్నారు. వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం.– డేవిడ్ సుధాకర్,సోషల్ వర్కర్, మేడ్చల్ -
తెలంగాణ లాక్డౌన్ ఫోటోలు
-
అంబరాన...సంబరం
-
వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర
-
నేడు బెంగళూరులో ‘హైదరాబాద్’ రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు దేశంలోని ముఖ్య నగరాల్లో ‘హైదరాబాద్- సరికొత్త అవకాశాలు’ పేరిట రోడ్‌షోలు నిర్వహించాలని సంకల్పించింది. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఇన్వెస్టర్లకు రోడ్‌షోల ద్వారా వివరించనున్నారు. బుధవారం బెంగళూరులో జరగనున్న రోడ్‌షోకు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ‘పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రం హైదరాబాద్’ అంశంపై కేటీఆర్ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. కేటీఆర్‌ను కలిసిన టాటా గ్రూప్ ప్రతినిధులు టాటా గ్రూప్ ప్రతినిధులు మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పా టు చేయబోయే 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుపై చర్చించారు. బయోమాస్ విద్యుత్ప్లాం ట్లను నెలకొల్పేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం పరిశ్రమ వర్గాలతో స్పందిస్తున్న తీరుపట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. టీ-హబ్‌లో భాగస్వామ్యంపై చర్చించేందుకు త్వరలోనే టాటా గ్రూప్ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారని తెలిపారు. కాగా, సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తికి సిద్ధంగా ఉన్నామని టాటా ప్రతినిధులు మంత్రికి తెలిపారు.