సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు దేశంలోని ముఖ్య నగరాల్లో ‘హైదరాబాద్- సరికొత్త అవకాశాలు’ పేరిట రోడ్‌షోలు నిర్వహించాలని సంకల్పించింది. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఇన్వెస్టర్లకు రోడ్‌షోల ద్వారా వివరించనున్నారు. బుధవారం బెంగళూరులో జరగనున్న రోడ్‌షోకు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ‘పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రం హైదరాబాద్’ అంశంపై కేటీఆర్ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.
కేటీఆర్‌ను కలిసిన టాటా గ్రూప్ ప్రతినిధులు
టాటా గ్రూప్ ప్రతినిధులు మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పా టు చేయబోయే 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుపై చర్చించారు. బయోమాస్ విద్యుత్‌ప్లాం ట్లను నెలకొల్పేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం పరిశ్రమ వర్గాలతో స్పందిస్తున్న తీరుపట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. టీ-హబ్‌లో భాగస్వామ్యంపై చర్చించేందుకు త్వరలోనే టాటా గ్రూప్ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారని తెలిపారు. కాగా, సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తికి సిద్ధంగా ఉన్నామని టాటా ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
నేడు బెంగళూరులో ‘హైదరాబాద్’ రోడ్ షో
Published Wed, Feb 25 2015 3:10 AM | Last Updated on Thu, Aug 30 2018 5:38 PM
Advertisement