
సాక్షి, నిజామబాద్: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. నిజామాబాద్‌కు చెందిన ఒకరు కరోనాతో మృతిచెందగా, మరొకరు అనారోగ్యంతో మరణించారు. గడిచిన రెండు రోజుల్లో ఐదుగురు మృతిచెందగా, వారిలో నలుగురు కరోనా బారినపడి మరణించారు. జిల్లాలో శనివారం కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు వైద్యులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 230కి చేరుకుంది. (కరోనాను జయించినా.. మరణం తప్పలేదు)
Comments
Please login to add a commentAdd a comment