
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు.
కాగా, తన తండ్రి మరణంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా అర్వింద్ తన తండ్రిని తలుచుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు.
ఈ క్రమంలో అర్వింద్ సోషల్ మీడియా వేదికగా..
‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు.
నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే.
పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే.
ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు.
నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

