
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.
స్కానింగ్ సెంటర్‌లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు.
నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్‌ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్.

Comments
Please login to add a commentAdd a comment