
శ్రీనివాసరావు
పెదపూడి (అనపర్తి): సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు, 20వ తేదీన చలో విజయవాడలో భాగంగా నిర్వహించే ధర్నాకు ఏపీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అసోసియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ అసోసియేషన్ రాష్ట్ర కనీ్వనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై తమకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తామని నవరత్నాల ఉద్యోగుల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ అసోసియేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు చేయడం లేదని, ఆ ధర్నాలకు దూరంగా ఉందని ఆయన తెలిపారు.