CITU dharna
-
ఆ ధర్నాలతో మాకు సంబంధం లేదు
పెదపూడి (అనపర్తి): సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు, 20వ తేదీన చలో విజయవాడలో భాగంగా నిర్వహించే ధర్నాకు ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ అసోసియేషన్ రాష్ట్ర కనీ్వనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తమకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని నవరత్నాల ఉద్యోగుల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ అసోసియేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు చేయడం లేదని, ఆ ధర్నాలకు దూరంగా ఉందని ఆయన తెలిపారు. -
పెద్దాస్పత్రిలో మరో వివాదం
ఖమ్మంవైద్యవిభాగం: పెద్దాసుపత్రిలో తరచు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరికలు చేస్తున్నా వివాదాలు మాత్రం ఆగడంలేదు. ఇటీవల కాలంలో ప్రసవ దృశ్యాలు చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడం, సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ పెట్టిన ఘటనలు వివాదాస్పదమైన విషయం విదితమే. తాజాగా ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయకుండా తిప్పి పంపటంతో మరో వివాదానికి తెరలేపారు ఇక్కడి వైద్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఇనపనూరి అశ్విని(20)కి పురుటి నొప్పులు రావడంతో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స ప్రారంభించిన డాక్టర్లు 5 గంటల సమయంలో ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి తర్వాత గర్భిణికి రక్తస్రావమైంది. ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగకపోవటంతో డాక్టర్లు ఆమెను వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. ఆందోళనకు గురైన అశ్విని తండ్రి పగడాల లక్ష్మయ్య(మున్సిపల్ వర్కర్) సీఐటీయూ నాయకులను సంప్రదించాడు. సీఐటీయు నాయకులు విష్ణు తదితరులు వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను డెలివరీ చేయాలని విజ్జప్తి చేశారు. చికిత్స అందించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చేసేది లేక కుటుంబ సభ్యులు గర్భిణిని 108 వాహనం ద్వారా వైరారోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించగా మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఆస్పత్రిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేయిస్తే రూ.30 వేలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు , ఆర్ఎంఓ కృపాఉషశ్రీ సముదాయించి ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పడంతో సీఐటీయు నాయకులు శాంతించారు. ఎంసీహెచ్ భవనం ఎదుట డాక్టర్ల ధర్నా సీఐటీయూ నాయకుడు విష్ణు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గైనిక్ సేవలందించే డాక్టర్లు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని, పెరుగుతున్న ఓపీ సేవలకు అనుగుణంగా గైనిక్ వైద్యులు నియమించాలని కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డాక్టర్ల ఆందోళనతో ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు వైద్య సేవలు లేక వెనుతిరిగారు. కాగా ఇరు వర్గాలు పరస్సరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. డాక్టర్లను ఇబ్బంది పెడితే వైద్య సేవలు ఎలా అందిస్తారు..? డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ఆస్పత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీ సేవలు నిలిపివేసి సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమైన డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. డాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తానని, కలెక్టర్‌కు కూడా లేఖ అందజేస్తామని తెలిపారు. - వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్. -
తపాలా ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం
అనకాపల్లిటౌన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పదహారు రోజులుగా తపాలా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని గ్రామీణ తపాలా ఉద్యోగుల జేఏసీ సంఘ ప్రతినిధి కె.మనోహర్ అన్నా రు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన రిలే నిరాహారదీక్షల్లో ఆయన మాట్లాడారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను తక్షణమే ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీ త్రీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, ఏఐజీడీఎస్ సంఘం డివిజన్ ఆర్గనైజర్ వి.ప్రకాశరావు, ఎఫ్‌ఎన్‌పీవో డివిజన్ కార్యదర్శి ఎ.లోవరాజు, అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ మద్దతు గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మళ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 22 నుంచి తపాలా ఉద్యోగులు సమ్మె చేపడతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం అన్నారు. వారు చేపడుతున్న ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సంఘ నాయకులు పి.ఎన్.వి.పరమేశ్వరరావు, దాకారపు శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మాజీ, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవరుకు హెల్మెట్ లేదని జరిమానా
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ వరకు సాగింది. అనంతరం అక్కడ వారు రోడ్డుపై బైటాయించి ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆర్టీఓ, పోలీసులు ఆటో కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆటోడ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా వేసిన ఘనత నెల్లూరు ట్రాఫిక్ పోలీసులకే దక్కుతుందన్నారు. ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నా ఓ ఆటోడ్రైవర్‌పై 5 నిమిషాల వ్యవధిలో 6 కేసులు రాయడం ఎంతవరకూ సమంజసమన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఓలా ట్యాక్సీలను నిర్వహిస్తుండడంతో ఆటోలను తిరగనీకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అధికారులు 700 రెట్లు చలానా పెంచి రూ.170 కోట్లు రాష్ట్ర ఖజానాకు పంపారన్నారు. కాగా దాదాపు రెండు గంటల సేపు నిరసన చేపట్టడంతో వాహనాలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సీఐ వేమారెడ్డి ఘటనాస్థలానికి వచ్చి ఆన్లైన్ ద్వారా ఈ–చలానా రావడంతో పొరపాట్లు జరిగాయని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి జి,నాగేశ్వరరావు ఆటోయూనియన్ జిల్లా కార్యదర్శి కె.సురేష్, నాయకులు మూలం ప్రసాద్, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ కాకినాడలో సీఐటీయు ధర్నా
-
279 జీవోను రద్దు చేయాలి: సీఐటీయూ
ఒంగోలు : 279 జీవోను రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు భద్రత కల్పించాలని, కాంట్రాక్టు , ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజలపై భారాలు వేసే యూజర్ ఛార్జీల విధానాన్ని విరమించాలని, జీవో 151 ప్రకారం పెరిగిన జీతాలను అమలు చేయాలని తదితర డిమాండ్లతో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. 279 GO, citu dharna, muncipal workers, 279 జీవో, మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ -
‘అల్‌కబీర్’పై చర్యలు తీసుకోవాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ: రుద్రారంలోని అల్‌కబీర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ మట్లాడుతూ పరిశ్రమలో వేతన ఒప్పద కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్నా యాజమాన్యం నూతన వేతన ఒప్పదం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా నిలిచాయని, ఈ నెల 4 నుంచి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ధర్నాకు దిగామన్నారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజే«శారు. ధర్నాలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. -
గుజరాత్ వద్దంటే కొవ్వాడకు తరలిస్తారా?
రణస్థలం: గుజరాత్ ప్రజలు తిరస్కరించిన అణు విద్యుత్ కేంద్రాన్ని కొవ్వాడకు తరలించడాన్ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడులు తీవ్రంగా ఖండించారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రణస్థలం-రామతీర్థం జంక్షన్ నుంచి జాతీయ రహదారిపై ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో సీఐటీయూ నేతలు గోవిందరావు, తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించా రు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ తమ భూములిచ్చి చావును కొనితెచ్చుకోలేమని గుజరాత్ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తే కొవ్వాడకు ప్లాంట్‌ను తరలించడం భావ్యం కాదన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు పచ్చి మోసగాళ్లని ధ్వజమెత్తారు. గతంలో అమెరికాతో అణువిద్యుత్ ఒప్పందాలను పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీలు నేడు అమెరికా ముందు మోకరిళ్లుతున్నాయని విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా లేదని గుర్తు చేశారు. అమెరికాలోని త్రీవాండ్, రష్యాలోని చెర్నోబిల్ తదితర ప్రాంతాల్లో అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల సంభవించిన నష్టాన్ని పాలకులు గుర్తెరగాలని హితవుపలికారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కళ్లు తెరిచి ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. లేకపోతే ప్రజల నుంచి నిరసన తప్పదన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అణుఒప్పందం చేసుకోవడానికే అమెరికా వెళ్లారని వారు ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ రణస్థలం డివిజన్ అధ్యక్షుడు ఎన్.వెంకటరమణ, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గురినాయుడు, మండల అధ్యక్షుడు బాలి శ్రీనివాసరావు, నాయకులు ఎస్.సీతారామరాజు, ఎం.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్‌కు రక్ష.. ఆంధ్రకు శిక్ష శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పెట్టాల్సిన అణువిద్యుత్ ప్లాంట్‌ను స్థానికుల వ్యతిరేకతతో కొవ్వాడకు తరలించారని, ఈ విషయంలో మోదీ, చంద్రబాబుల కుట్రలు దాగున్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద మంగళవారం అణువిద్యుత్ ప్రతిని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు మంచివారే కాని అమాయకులు కారని గుర్తెరగాలన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేద న్నారు. అణువిద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగే మొత్తం ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల వరకు ముప్పు ఉంటుందని చెప్పారు. ప్లాంట్ ప్రయత్నాలు విరమించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి కె.శ్రీనివాస్, వి.జి.కె మూర్తి, టి.తిరుపతిరావు, ఎం.ప్రభాకరరావు, ఎం.ఆదినారాయణమూర్తి, బి.సత్యంనాయుడు, కనకమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా చట్టాన్నివ్యతిరేకిస్తూ ధర్నా
విశాఖపట్టణం : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న రోడ్డు భద్రతా బిల్లు ను రద్దు చేయాలని విశాఖ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేసిన ఈ ధర్నాలో ఆటో రిక్షా కార్మిక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బిల్లు ద్వారా డ్రైవర్లు, మోటారు కార్మికులు ప్రమాదంలో పడతారని సీఐటీయూ ఆరోపించింది. జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, అందువల్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని ఆటో యూనియన్ సభ్యులు చెప్పారు. నగరంలో పెరుగుతున్న వాహనాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు విస్తరించాలని వారు డిమాండ్ చేశారు.