279 జీవోను రద్దు చేయాలి: సీఐటీయూ
Published Wed, Dec 7 2016 1:09 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
ఒంగోలు : 279 జీవోను రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు భద్రత కల్పించాలని, కాంట్రాక్టు , ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజలపై భారాలు వేసే యూజర్ ఛార్జీల విధానాన్ని విరమించాలని, జీవో 151 ప్రకారం పెరిగిన జీతాలను అమలు చేయాలని తదితర డిమాండ్లతో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు.
279 GO, citu dharna, muncipal workers, 279 జీవో, మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ
Advertisement
Advertisement