‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్‌ | Kanpur Mayor Pramila Pandey Gets Angry, Throws File At Officer; Video Viral | Sakshi
Sakshi News home page

‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్‌

Published Fri, Jun 14 2024 3:39 PM | Last Updated on Fri, Jun 14 2024 3:57 PM

Kanpur Mayor Pramila Pandey Throws File At Office During Meeting

ఓ నగర మేయర్‌ మున్సిపల్‌ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అంటూ సదరు అధికారిపై ఫైల్‌ను విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి.

కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే సమావేశంలో ఓ అధికారిపై ఫైలు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో 
ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక జోన్-3 జోనల్ ఇంజనీర్ నుల్లా శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో ప్రమీలా పాండే సదరు అధికారిపై మండిపడినట్లు సమాచారం.  

ఇంజనీర్ తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.  అయితే  ఇదే విషయంలో మేయర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచేయబోయారు. చేతిలో ఫైల్‌ని సదరు అధికారిపై విసిరేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా..పలువురు నెటిజన్లు మేయర్‌కు అండగా నిలుస్తోన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement