విశాఖపట్టణం : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న రోడ్డు భద్రతా బిల్లు ను రద్దు చేయాలని విశాఖ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేసిన ఈ ధర్నాలో ఆటో రిక్షా కార్మిక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బిల్లు ద్వారా డ్రైవర్లు, మోటారు కార్మికులు ప్రమాదంలో పడతారని సీఐటీయూ ఆరోపించింది.
జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, అందువల్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని ఆటో యూనియన్ సభ్యులు చెప్పారు. నగరంలో పెరుగుతున్న వాహనాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు విస్తరించాలని వారు డిమాండ్ చేశారు.