Association leaders
-
ఆ ధర్నాలతో మాకు సంబంధం లేదు
పెదపూడి (అనపర్తి): సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు, 20వ తేదీన చలో విజయవాడలో భాగంగా నిర్వహించే ధర్నాకు ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ అసోసియేషన్ రాష్ట్ర కనీ్వనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తమకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని నవరత్నాల ఉద్యోగుల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ అసోసియేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు చేయడం లేదని, ఆ ధర్నాలకు దూరంగా ఉందని ఆయన తెలిపారు. -
లారీల సమ్మె ఉధృతం
ప్రొద్దుటూరు క్రైం (వైస్పార్ కడప) : ఐదు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె మరింత ఉధృతమైంది. తమ డిమాండ్లపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సమ్మెను ఉధృతం చేయాలని లారీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను నిలిపి వేయాలని, టోల్ విధానంలో పారదర్శకత పాటించాలని, థర్డ్‌పార్టీ ప్రీమియం పెంపును నిలుపుదల చేసి మళ్లీ సమీక్షించాలని, నేషనల్ పర్మిట్ కలిగిన గూడ్స్ వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా లారీల యజమానులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో నిత్యావసర సరుకుల రవాణా లారీలకు మినహాయించారు. ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. దీంతో నిత్యాసర సరుకులను రవాణా చేసే లారీలను కూడా నిలిపేయాలని అసోసియేషన్ ప్రతినిధులు, లారీల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య పట్టణంగా పేరు పొందిన ప్రొద్దుటూరుకు అన్ని రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు రోజూ వందలాది లారీల్లో దిగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఉన్న మండీ మర్చంట్‌కు రాయలసీమలోనే మంచి పేరుంది. రాయలసీమ జిల్లాలకే గాక తెలంగాణా జిల్లాలకు ప్రొద్దుటూరు నుంచి నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు. ప్రొద్దుటూరులో ఉన్న వస్త్రభారతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దుస్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. లారీల సమ్మెతో మండీ మర్చంట్, వస్త్ర వ్యాపారంతోపాటు నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 రోజుల్లో రూ.10 కోట్ల మేర నష్టం ప్రొద్దుటూరులోని లారీ అసోసియేషన్‌లో సుమారు 500కు పైగా లారీలు ఉన్నాయి. దాదాపు 3 వేల కుటుంబాలు లారీలపై ఆధారపడి జీవిస్తున్నాయి. రోజూ 300లకు పైగా లారీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న బంద్ కారణంగా లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె కారణంగా జిల్లా మొత్తం సుమారు రూ. 10 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. రోజూ లారీకి వెళ్తేనే పూట గడుస్తుందని, ఐదు రోజులుగా పని లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు, ఇతర కార్మికులు అంటున్నారు. కాగా లారీల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ప్రొద్దుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డ్రైవర్లకు, క్లీనర్లు, ఇతర కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. పనులు లేకపోవడంతో కార్మికులు అసోసియేషన్ కార్యాలయాలు, బ్రోకర్ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆల్ఇండియా నిరవధిక బంద్ కొనసాగుతున్నా రాత్రి వేళల్లో కొన్ని రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరుకు, ప్రొద్దుటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు లారీలు వెళ్తున్నాయి. వీటిని ఆపేందుకు స్థానిక అసోసియేషన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బంద్ ఉపసంహరించే వరకు లారీలను నడిపేది లేదని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసరాల బంద్‌తో ఆందోళన మంగళవారం నుంచి నిత్యావసర సరుకుల రవాణాను కూడా నిలిపేయడంతో ప్రజలతోపాటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్ చేపట్టడంతో నిత్యావసర సరుకులపై లారీల బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాకు గుజరాత్, బీజాపూర్, కాశ్మీర్, కలకత్తా, ఢిల్లీ, తదితర రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు దిగుమతి అవుతాయి. లారీల సమ్మెతో వీటి దిగుమతి ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తు రవాణా లారీలు రాత్రి వేళల్లో నడుస్తాయి. ఇకపై రాత్రి సమయాల్లో నడిచే లారీలను ఎక్కడికక్కడే ఆపేస్తామని లారీ యజమానులు తెలిపారు. బలవంతంగా ఆపితే చర్యలు లారీలను బలవంతంగా ఎక్కడైనా ఆపితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు మీదుగా వెళ్తున్న రెండు లారీలను స్థానికంగా ఉన్న లారీ యజమానులు కొందరు ఆపారు. విషయం తెలియడంతో రూరల్ సీఐ ఓబులేసు అసోసియేషన్ ప్రతినిధులను, లారీ యజమానులను పిలిపించారు. స్వచ్ఛందంగా లారీల బంద్ నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, బలవంతంగా ఒక్క లారీని కూడా ఆపరాదన్నారు. లారీలను ఆపిన కారణంగా వాటి యజమానులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ అన్నారు. సమ్మె అందరి కోసం చేస్తున్నామని, అందరూ అర్థం చేసుకొని సహరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఒక వేళ దారిలో ఎవరైనా లారీలను ఆపితే తమకు సంబంధం లేదని వారు అన్నారు. -
కదలని చక్రం
నెల్లూరు(టౌన్): రవాణా రంగంలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల బంద్‌తో లారీలు పార్కింగ్‌లకే పరిమితమయ్యాయి. తొలిరోజు శుక్రవారం 70 శాతం లారీలు తిరగలేదు. శనివారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం 30శాతం లారీలు లోడుతో జాతీయ రహదారిపై రాకపోకలు సాగాయి. అయితే ఈ లారీలు రెండు మూడు రోజులు ముందుగా లోడింగ్ చేసుకోవడంతో సంబంధిత ప్రాంతాలకు చేరుకునేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. అలాంటి లారీలకు కొంత వెసులుబాటు కల్పించారు. శనివారం స్థానిక ఎస్వీజీఎస్ కళాశాల జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించాలని జిల్లా లారీ అసోసియేషన్ నాయకులు నిర్ణయించారు. ఆదివారానికి పూర్తిగా లారీలు నిలచిపోతాయని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. తొలిరోజు పాలు, గుడ్లు లాంటి వస్తువులను ఆర్టీసీ బస్సుల్లో ఆయా ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. డీజిల్‌కు మరో రెండు రోజులు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. యార్డుకే పరిమితం కోవూరు: లారీల బంద్ పిలుపుమేరకు శుక్రవారం ఉదయం నుంచి పడుగుపాడు లారీ యార్డులో లారీలు నిలిచిపోయాయి. ఆలిండియా ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు లారీ ఓనర్స్ అసోసియేషన్, ఇతర యూనియన్లు ఈ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ప్రజలు అర్థం చేసుకొని బంద్‌కు సహకరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నారెడ్డి, పి.ఎల్.నారాయణ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సమస్యలపై ఇది వరకే చర్చించామని, వారు సమస్యల్ని పరిష్కరించడంలో చొరవ చూపలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. -
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ కమిటీ భేటీ
-
సగం ఇచ్చారు.. సగం మింగారు..
విత్తన కంపెనీ పంపిన డబ్బును కాజేసిన ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు మహబూబాబాద్ : నాసిరకం విత్తనాలతో తాను నష్టపోయానని, కంపెనీ నుంచి నష్టపరిహారం మంజూరైనప్పటికీ గత అసోసియేషన్ నాయకులు నొక్కేశారని మానుకోట శివారు సాలార్‌తండాకు ఓ రైతు ఆరోపించాడు. బాధిత రైతు కథనం ప్రకారం.. సాలార్‌తండాకు చెందిన దారావత్ బాలాజీ 5 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నాడు. అందులో 2 ఎకరాలు కూరగాయలు సాగు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం మానుకోటలోని ఓ ఫెస్టిసైడ్ షాపులో ప్యాకెట్ రూ.300 చొప్పున 5 టమాట పంటకు సంబంధించిన విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. పూత రాకపోవడంతో ఆ పంట మొత్తం దెబ్బతింది. ఆ సమయంలో టమాట కేజీ 100 రూపాయలపైనే ఉంది. ఈ విషయాన్ని బాధిత రైతు డీలర్ వద్ద మొరపెట్టుకోగా కంపెనీ ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించి వెళ్లారు. రూ.లక్ష పరిహారం ఇవ్వాలని రైతు డిమాండ్ చేయగా రూ.50 వేలు ఇచ్చేటట్లు అంగీకరించారు. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ మానుకోట శాఖ నాయకులకు ఆ కంపెనీకి చెందిన వారు అప్పట్లో రూ.50 వేలు పంపారు. కానీ ఆ రైతుకు కేవలం 25 వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయై సంబంధిత డీలర్‌తో, నాయకులతో గత కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. కంపెనీకి సంబంధించిన వారికి ఫోన్ చేస్తే అసోసియేషన్‌కు డబ్బులు పంపడం జరిగిందని వారు చెప్పారని బాధిత రైతు వాపోయాడు. ఇటీవల అదే డీలర్ వద్ద నకిలీ విత్తనాల విషయంలో గొడవ జరుగగా పంచాయితీ చేసి రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు అందజేశారు. ఇటీవల మానుకోట మండలంలోని పర్వతగిరి రైతులు సుమారు 100 మంది ఖమ్మంకు సంబంధించిన ఓ వ్యాపారి వద్ద మిర్చి విత్తనాలు కొనుగోలు చేయగా ఎదుగుదలలేక నష్టపోయారు. కంపెనీ ప్రతినిధులు పంటలను పరిశీలించి తప్పిదం జరిగిందని ఎకరానికి సుమారు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని అందుకు గడువు కావాలని వారు కోరినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. ఏదేమైనా మానుకోటలో నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. సంబంధిత అధికారులు వ్యాపారులకు పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారని, వారు మాముళ్లు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
రేపటి నుంచి రైతులతో కలిసి సమైక్య ఉద్యమం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 16 నుంచి రైతులతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటామని వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు నిర్ణయించారు. బుధవారం స్థానిక రైతుబజార్ సమీపంలోని కృషిభవన్‌లో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, పశుసంవర్ధకశాఖ అధికారులు, అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతంలో సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజల స్థితిగతులు దారుణంగా దెబ్బతింటాయన్నారు. 15 రోజులుగా ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలుస్తామని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. 16న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎన్జీఓ సమ్మెలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో తమ శాఖల అధికారులు పాల్గొనేలా తమ వంతు చర్యలు తీసుకుంటామని నేతలు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ కె.సాంబశివరావు, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ రంగస్వామి, ఉద్యానశాఖ ఏడీ బీవీ రమణ, పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ జయకుమార్, ఆయా శాఖల అధికారులు వాసుప్రకాశ్, వెంకటప్రసాద్‌యాదవ్, చెన్నవీరాస్వామి, శ్రావణ్, చంద్రశేఖర్ హాజరయ్యారు.