సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్యలో అసాధారణ వ్యత్యాసం నెలకొంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన కొత్త ఓటర్ల జాబితాల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2018 నవంబర్ 1 అర్హత తేదీగా కొత్త ఓటర్ల జాబితాను రూ పొందించారు.
కొత్త ఓటర్ల జాబితా ప్రకారం.. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 1,30,957 మం ది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 59,099 మంది మాత్రమే ఉన్నారు. ఇక మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15,407 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 7,068 మంది మాత్రమే ఉన్నారు. వరంగల్–ఖమ్మం–నల్ల గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 13,476 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 7,106 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంవల్లే భారీ వ్యత్యాసం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment