legislative councils
-
‘మండలి’ చరిత్రలో ఎన్నో మలుపులు
భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని పశ్చిమబెంగాల్లో మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చికాకు తప్పదు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తేలిపోయింది. ఎప్పుడో 52 సంవత్సరాల క్రితం రద్దయిన పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పునరుద్ధ రణకు మమతా బెన ర్జీ కేబినెట్ మే 17న నిర్ణయించింది. కౌన్సిల్ ఏర్పాటుకు రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం ఇక లాంఛనమే. కేంద్ర ప్రభుత్వం చొరవతో బెంగాల్లో కౌన్సిల్ ఏర్పాటుకు పార్లమెంటు ఉభయసభల్లో తీర్మానించాకే రాష్ట్ర అసెంబ్లీ కోరిక నెరవేరుతుంది. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ రద్దుకు లేదా మండలి పునరుద్ధరణకు అసెంబ్లీ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానాలపై కేంద్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందిం చవు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉన్నా విపరీత జాప్యం సర్వసాధారణం. ఒక్కోసారి ఒక రాష్ట్రంలో మండలి పునరుద్ధ రణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, పాతిక ముప్పయి ఏళ్లయినా ఆ పని జరగదు. తమిళనాడులో శాసనమండలి పునరుద్ధరణకు 1989లో అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇంత వరకూ అతీగతీ లేదు. అయినా, రాష్ట్రాలను పరిపాలించే పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగానో, ఆచరణలో కౌన్సిల్ వల్ల అవరోధాల వల్లనో విధాన పరిషత్ రద్దుకు తీర్మానాలు ఆమోదించి పంపడం గత 30 ఏళ్లుగా జరుగున్న పనే. కేంద్రంలో తమకు అనుకూల ప్రభుత్వం ఉందా? వ్యతిరేక ప్రభుత్వం ఉందా? కేంద్రం పట్టించుకోకపోతే తమ తీర్మానం వృ«థా ప్రయాసేనా? అని ప్రజాతంత్ర రాజకీయ పార్టీలు ఆలోచిం చవు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో తనను బద్ధ శత్రువుగా భావించే బీజేపీ అధికారంలో ఉన్నా తాను ముందే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా, తన తక్షణ అవసరాలకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్లో కౌన్సిల్ పునరుద్ధరణకు తీర్మానం పంపాలనే కృత నిశ్చయంతో తృణమూల్ ప్రభుత్వం ఉంది. కౌన్సిల్ అవసరం ఏమొచ్చింది? తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2011 లోనే కౌన్సిల్ మళ్లీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటిం చింది. అప్పటికి 34 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సింగూరు, నందిగ్రామ్ భూపోరాటాల్లో మమతకు బాసటగా నిలిచిన మేధావులు, విశిష్ట వ్యక్తులకు చట్టసభలో స్థానం కల్పించడానికి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిపై మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లు పట్టింది. మండలి మళ్లీ ఏర్పాటు ఆలోచన ఇన్నాళ్లకు కొద్దిగానైనా ముందుకు సాగడానికి ఈ అంశాన్ని నిన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా విడుదల చేసిన తృణమూల్ ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ఒక్కటే కారణం కాదు. సీఎం మమత, ఆర్థిక మంత్రి మదన్ మిత్రా ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు. నందిగ్రామ్‌లో ఓడిన మమత తన పాత స్థానం భబానీపూర్ నుంచి ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమౌతున్న మాట వాస్తవమే. ఆమెకైతే సీఎంగా కొనసాగడానికి తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చీకాకు తప్పదు. మొత్తం 294 సీట్లలో మమత తన పూర్వ అనుచరుడు సువేందు అధికారిపై పోటీచేసిన నందిగ్రామ్‌పై దేశ ప్రజలందరి దృష్టి నిలిచింది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీ యాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవ సరం లేదని తేలిపోయింది. అందుకే, మహారాష్ట్ర, యూపీ, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని నేటి ముఖ్యమంత్రులు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. 2019 నవంబర్‌లో అనూహ్య పరిస్థితుల్లో మహారాష్ట్ర సీఎం అయిన శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తర్వాత శాసన మండలికి ఎన్నికయ్యారు. బిహార్‌లో సీఎం పదవి చేపట్టిన నేతల్లో లాలూ, రబ్రీ, నితీశ్! బిహార్‌లో ఇప్పటికి 23 మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టగా వారిలో ఏడుగురు ఎమ్మెల్సీలే. ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కూటమి(జేడీయూ–బీజేపీ) మెజారిటీ సాధించడంతో 2005లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. అప్పటి నుంచీ ఆయన కౌన్సిల్ సభ్యునిగానే సీఎం పదవిలో కొనసాగుతున్నారు. 1990లో లోక్‌సభ ఎంపీగా ఉన్న లాలూ ప్రసాద్ తొలిసారి సీఎం పదవి చేపట్టాక రాష్ట్ర శాసన మండలికి ఎన్నికై ఐదేళ్లూ సీఎంగా ఉన్నారు.1995 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రెండేళ్లు సీఎం పదవిలో కొనసాగి రాజీనామా చేశారు. 1997లో ఆయన భార్య రబ్రీదేవి తన భర్త ఖాళీచేసిన పదవిని చేపట్టాక ఎమ్మెల్సీగా ఎన్నికై 2000 ఎన్నికల్లో మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్‌లో యాదవవర్గం నుంచి తొలి సీఎం అయిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయిన తొలి నేత. ఆయన పదవిలో ఉన్నది 51 రోజులేగాని రెండో బీసీ కమిషన్ (మండల్ కమిషన్) చైర్మన్‌గా దేశ ప్రజలందరికీ పరిచయమయ్యారు. సీఎం పదవి దక్కాక కౌన్సిల్‌కు ఎన్నికవడం కొత్త ఆనవాయితీ! గత 14 సంవత్సరాలకు పైగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రి పదవులో కొనసాగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం 1952 నుంచి 1999 వరకూ సీఎం పదవిలో ఎమ్మెల్యేలే ఉన్నారు. 1999 నవంబర్ 2000 అక్టోబర్ మధ్య సీఎం పీఠంపై ఉన్న రామ్‌ప్రకాశ్ గుప్తా(బీజేపీ) యూపీలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ. బీఎస్పీ అధినేత్రి మాయా వతి 2007 ఎన్నికల్లో తన పార్టీ తొలిసారి మెజారిటీ సాధించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టి మండలికి ఎన్నికై పదవిలో కొనసాగారు. 2002 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నిక ల్లోనూ అసెంబ్లీకి ఆమె పోటీ చేయలేదు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఎస్పీకి అప్పుడు మెజారిటీ రావడంతో ఆయన సీఎం అయ్యాక కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. తర్వాత 2017 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. తర్వాత కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మొదట సీఎం అయ్యాక కౌన్సిల్ సభ్యుడైన తొలి నేత రాజాజీ 1952 మద్రాసు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాలేదు. దాంతో సీఎం పదవి చేపట్టాలని సి.రాజగోపాలాచారిని నెహ్రూ ఒప్పించారు. రాజాజీని గవర్నర్ శ్రీప్రకాశ కౌన్సిల్‌కు నామి నేట్ చేశాక సీఎంగా ప్రమాణం చేయించారు. దేశంలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ రాజాజీయే. మళ్లీ బెంగాల్ విషయానికొస్తే, 1967 ఎన్నికల్లో కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అజయ్‌ముఖర్జీ నాయక త్వాన తొలి కాంగ్రెసేతర (యునైటెడ్ ఫ్రంట్) సర్కారు ఏర్పడింది. జ్యోతిబసు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని 8 నెలలకే గవర్నర్ ధర్మవీర బర్తరఫ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ మద్దతున్న పీసీ ఘోష్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని అసెంబ్లీ స్పీకర్ ఖండించారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న కౌన్సిల్లో ఘోష్ సర్కారుపై విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. 1969 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ వెంటనే కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానించి పంపగా, ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో దానికి ఆమోద ముద్ర వేయించారు. ఇందిర చొరవతో రద్దయిన మండలి మమత పట్టుదలతో ఎప్పుడు ప్రాణం పోసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. వ్యాసకర్త : నాంచారయ్య మెరుగుమాల సీనియర్ జర్నలిస్ట్ -
‘ముస్లింల గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’
సాక్షి, తాడేపల్లి : శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ నాయకుడిగా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారని.. పెద్దల సభలు సలహాలు, సూచనలు ఇవ్వాలే కానీ, బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71ను తీసుకు వచ్చారన్నారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సభలో మండలి ఛైర్మన్ అనైతికంగా వ్యవహరించారని, ఆయన చైర్‌ను గౌరవించలేదని విమర్శించారు. సభలో నిబంధనలను అతిక్రమించారని, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేశారన్నారు. ఛైర్మన్ తీరుపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు.సభ నిబంధనలకు విరుద్ధంగా సభలో వీడియోలు తీశారని, చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. కాలయాపన చేయడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సభలో టీడీపీ సభ్యులు గూండాలు, రౌడీలుగా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని శెభాష్ అని మెచ్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించినవారు దేశంలో మరొకరు ఉండరని అన్నారు. ఛైర్మన్‌ను మంత్రులు కులంపేరుతో తిట్టారని టీడీపీ నేతలు అంటుంటే... ఛైర్మనే స్వయంగా తనను ఎవరూ తిట్టలేదని చెబుతున్నారన్నారు. టీడీపీ నేతలు కావాలనే మతం, కులంతో రాజకీయాలు చూస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఈ సందర్భంగా తనను మంత్రులు తిట్టలేదని శాసనమండలి ఛైర్మన్ చెప్పిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని, ఆ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు అని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు... కనీసం సీమలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. -
చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!
సాక్షి, అమరావతి: శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని బిల్లులు చట్టరూపం దాల్చకుండా తాత్కాలికంగా అడ్డుకుని.. తమ పదవులకే ఎసరు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు. (చదవండి: అప్రజాస్వామికం) మండలి రద్దయితే టీడీపీకి తీరనినష్టం మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 32 కాగా.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఆ పార్టీకి చెందిన వారే. మండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. మండలిలో ఈ రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు బాబు, లోకేష్, యనమల మంత్రాంగం నడుపుతున్న సమయంలోనే పలువురు టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులను కొద్దిరోజులు అడ్డుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చిందని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. (చదవండి: వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) ఈ క్రమంలోనే పార్టీ విప్‌ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథరెడ్డిలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కొందరు యనమల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు, లోకేశ్ రాజకీయాల వల్ల పైకి మాట్లాడలేక పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తమ భవిష్యత్తును పణంగా పెట్టారని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తమ పదవులకు ఎసరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారని మరికొందరు వాపోతున్నారు. శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితి వస్తుందని చెప్పినా వినలేదు: పీడీఎఫ్ చంద్రబాబు, లోకేశ్ తీరు వల్లే శాసన మండలి ఉనికే లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందని పీడీఎఫ్ సభ్యులు, పలువురు ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం కావాలని తాము మొదటి నుంచి టీడీపీ సభ్యులకు చెబుతున్నా స్వప్రయోజనాలు చూసుకున్నారని, వారి స్వార్థానికి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. టీడీపీ తీరుపై పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం మండలిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బిల్లులు అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత చైర్మన్‌తో జరిగిన చర్చల్లోనూ.. నిబంధనల ప్రకారం వ్యవహరించి బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలని కోరారు. (చదవండి:ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) చైర్మన్‌తో చంద్రబాబు తప్పు చేయించి అందరినీ బలి చేస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలికి ఎలాంటి అధికారాలు, విధులు లేవని.. అనవసరంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని స్వతంత్య్ర సభ్యుడు కంతేటి సత్యనారాయణరాజు టీడీపీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల అనంతరం వైఎస్ హయాంలో మండలిని పునరుద్ధరించుకుంటే.. ఇప్పుడు దాన్ని లేకుండా చేయొద్దని హితవు పలికినా చంద్రబాబు అండ్ కో పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయం వల్ల సొంత పారీ్టకి చెందిన సభ్యులతోపాటు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రతినిధులుగా మండలిలో అడుగుపెట్టిన మేధావులకు సైతం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని సభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. (గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?) -
గుంటూరు కేంద్రంగా నకిలీ దందా
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అనే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గుంటూరు కేంద్రంగా నకిలీ దందా నడుస్తోందని, దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ చేసిన దాడుల్లో రూ. 5.46 కోట్ల విలువైన కల్తీ యూరియాను సీజ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. 1455 నమూనాలను పరీక్షించగా 35 నమూనాలు నాసిరకంగా తేలాయని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకున్నామని సభకు వివరించారు. ‘ఇకపై ప్రభుత్వ ల్యాబ్ లో నిర్ధారించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకే అనుమతి ఇస్తాం. ఆయా విక్రయ సంస్థలు ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల వద్దే అగ్రీ ఇన్ పుట్ షాప్ లను ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లు అంశంపై రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. అన్నా క్యాంటీన్లను టీడీపీ కార్యకర్తల కోసమే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా వుందన్నారు. ‘ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే... అక్కడ క్యాంటీన్లు పెట్టారు. సబ్సిడీపై ఇచ్చే ఆహారం సామాన్యులకు, పేద ప్రజలకు దక్కలేదు. వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే 15 జిల్లా ఆసుపత్రులు, 28 ఏరియా ఆసుపత్రులు, 11 టీచింగ్ ఆసుపత్రుల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం’ అని అన్నారు. -
వ్యూహాత్మకంగా... ఆఖర్లో ఖరారు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో పూర్తి ఆధిపత్యంతో ఉన్న టీఆర్ఎస్... ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోనూ కచ్చితంగా గెలుపు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దించాలని నిర్ణయించింది. 2015లో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడు నల్ల గొండ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఫలితానికి ఆస్కారం ఇవ్వకూడదని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు స్థానాలను గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ అవకాశాలు ఉండే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా.. టీఆర్ఎస్ టికెట్ కోసం ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోని పలువురు నేతలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును కలిసే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆశావహులకు సమాచారం పంపించారు. కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ దగ్గరికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చాకే అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు 14తో ముగుస్తోంది. దానికి ఒకటిరెండు రోజుల ముందు మాత్రమే అభ్యర్థుల ప్రకటనకు అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి... వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి... రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.నల్లగొండ స్థానానికి ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కె.నవీన్‌రావును ప్రకటించే అంశాన్నీ పరిశీలిస్తోంది. సీఎం కేసీఆర్‌తో కేటీఆర్... దేవాలయాల సందర్శన కోసం కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ బృందంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరారు. కేటీఆర్ సతీసమేతంగా బుధవారం కేరళకు వెళ్లారు. సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్ ఈ పర్యటనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి వెళ్లిన కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్... కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో భేటీ అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
మండలి ఓటర్లలో మహిళల వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్యలో అసాధారణ వ్యత్యాసం నెలకొంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన కొత్త ఓటర్ల జాబితాల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2018 నవంబర్ 1 అర్హత తేదీగా కొత్త ఓటర్ల జాబితాను రూ పొందించారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం.. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 1,30,957 మం ది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 59,099 మంది మాత్రమే ఉన్నారు. ఇక మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15,407 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 7,068 మంది మాత్రమే ఉన్నారు. వరంగల్–ఖమ్మం–నల్ల గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 13,476 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 7,106 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంవల్లే భారీ వ్యత్యాసం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
16 మంది కొత్త ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీ అయిన, పదవీ కాలం పూర్తవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. ఒకేసారి 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో టీఆర్ఎస్లోని చాలా మంది అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని వారు తమకు ఇవ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరుతున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నా రు. రాష్ట్ర శాసనమండలిలో ఉన్న 40 స్థానాల్లో ఒకేసారి 16 ఖాళీ అవుతున్నా యి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల తర్వాత పదవికి రాజీనామా చేశారు. ఇలా 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆర్.భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, ఎస్.రాములునాయక్‌లపై అనర్హత వేట కారణంగా మరో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి ఆఖరుకు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ (టీఆర్ఎస్), మహమ్మద్ సలీం (టీఆర్ఎస్), టి.సంతోష్‌కుమార్ (టీఆర్ఎస్), షబ్బీ ర్‌అలీ (కాంగ్రెస్). పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్), హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు (టీఆర్ఎస్), కరీంనగర్, మెదక్, ఆదిలాబా ద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ (టీఆర్ఎస్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి (టీఆర్ఎస్), వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్ (స్వతంత్ర) పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. టీఆర్ఎస్ అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు జాబితా సిద్ధం చేస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉం ది. షెడ్యూల్ విడుదలవగానే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనుంది. -
సమావేశాల్లోపే ఆ ముగ్గురిపై వేటు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ఖాయంగా కనిపిస్తోంది. సమావేశాలు మొదలయ్యేలోపే దీనిపై చైర్మన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జనవరి 19న శాసనçసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్. భూపతిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. రాములు నాయక్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యింది. కె.యాదవరెడ్డి, ఆర్.భూపతిరెడ్డి తరఫున న్యాయవాదులు శనివారం శాసనమండలికి వచ్చా రు. చైర్మన్ వి.స్వామిగౌడ్ వద్ద జరిగిన విచారణలో వాదనలు వినిపించారు. వాటిని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను నమోదు చేసుకున్న చైర్మన్ స్వామిగౌడ్ తీర్పులను రిజర్వులో పెట్టారు. నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: పల్లా టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిం చాలని ఫిర్యాదు చేశామని, చైర్మన్ తీర్పు కోసం వేచి చూస్తున్నామని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీలపై విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాం గ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్‌కు ఫిర్యాదుచేశాం. కొండా మురళీధర్‌రావు రాజీనామా చేశారు. రాములునాయ క్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిల అనర్హత పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. వారిపై చట్ట ప్రకారం చర్య లు తీసుకోవాలని చైర్మన్‌ను కోరాం’ అని చెప్పారు. -
1,10,012 పోస్టులు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 83,048 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 52,724 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు జారీ అయ్యాయని, అందులో 28,116 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిందని పేర్కొంది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ఎన్.రాంచంద్రారావు, సభావత్ రాములు నాయక్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఖాళీ పోస్టులు, వాటి నియామకానికి తీసుకుంటున్న చర్యల్లో పురోగతి వివరాలు వెల్లడించింది. -
‘దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు మిగతా ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిందని.. మండలి సభ్యత్వం రద్దు చేస్తానంటున్నదని విమర్శించారు. అంతేకాకుండా బుధవారం ఉదయం నుంచే కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తన ఇంటి ముందు కూడా పోలీసులు చక్కర్లు కొడుతున్నారని షబ్బీరు వివరించారు. పార్టీ ఆఫీస్‌లో నిరసన కార్యక్రమం చేసుకోవద్దంటే ఎలా? పార్టీ ఆఫీసుల వద్దకు రావద్దని షబ్బీర్ పోలీసులను హెచ్చరించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. -
కదం తొక్కిన బీసీలు
కర్నూలు(న్యూసిటీ): చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య పిలుపు మేరకు బీసీ నాయకులు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా స్థానిక బిర్లాగేట్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి గాయత్రీ ఎస్టేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ కులాలు రాజకీయంగా వెనుకబడిపోయాయన్నారు. తమకు చట్టసభల్లో సరైన ప్రాధాన్యం లేకుండాపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టెలా కేంద్రంపై వత్తిడి తీసుకోరావాలని కోరారు. పట్టించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేయడంతో పాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భావసార క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అయ్యరావు, ఏపీఎస్ఆర్టీసీ బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి హెచ్ఆర్ఎస్ రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాల వెంకటేశ్వర్లు, నాయకులు లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, రాయలసీమ యువజన సంఘం అధ్యక్షుడు జి.రాజు, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ముడుపుల బాగోతం!
సంపాదకీయం ఈమధ్యే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మన చట్టసభలు చట్టుబండలవుతున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. వాటి నాణ్యతాప్రమాణాలు నానాటికీ దెబ్బతింటున్నాయని ఆందోళనపడ్డారు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అందరూ సమష్టిగా కృషిచేయాలని కోరారు. నిజమే. చట్టసభల్లో ప్రజలకు పనికొచ్చే అంశాలు చర్చకు రావడం అరుదుగా మారింది. అరుపులు, కేకలు, కొట్లాటలు, వాయిదాలు, వాకౌట్లతోనే వాటి కాలం పూర్తవుతోంది. దీన్ని చక్కదిద్దడానికి ఏంచేయాలో తెలియక అందరూ తలలు పట్టుకుంటుంటే చట్టసభల సభ్యుల్లో కొందరు అవినీతి మకిలి అంటించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వెబ్ పోర్టల్ కోబ్రా పోస్ట్ రహస్య కెమెరాలకు 11 మంది ఎంపీలు తాజాగా దొరికిన ఉదంతం మన చట్టసభల ప్రమాణాలపై ప్రథమ పౌరుడు వ్యక్తంచేసిన ఆందోళనకు అద్దం పడుతోంది. దళారీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకున్న వైనాన్ని వెల్లడిస్తోంది. తాజా స్టింగ్ ఆపరేషన్‌కు దొరికిపోయినవారిలో అన్ని పార్టీలవారూ ఉన్నారు. కనుక దీన్ని ప్రత్యర్థి పార్టీ కుట్రగా కొట్టిపారేయడానికి ఏపార్టీకీ చాన్స్‌లేదు. ఈ ఎంపీల్లో ఆరుగురు ముడుపులు తీసుకుని సిఫార్సు లేఖలు రాస్తే, మరికొందరు మరింత భారీ మొత్తం ఇస్తేనే లేఖలు అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు కె మెరాకు చిక్కిన ఎంపీల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యూ), అన్నా డీఎంకే, బీఎస్పీ పక్షాలవారున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న మెడిటెరేనియన్ చమురు సంస్థ ప్రతినిధిగా చెప్పుకుని, తమకు ఈశాన్య ప్రాంతంలో చమురు వెలికితీతకు అవకాశం కల్పించేలా సిఫార్సుచేయమంటే ఆ సంస్థ అసలుదా, నకిలీదా అని ఈ ఎంపీలెవరూ ఆలోచించలేదు. వచ్చినవారెవరో, వారి నేపథ్యం ఎలాంటిదో తెలుసుకోకుండా సిఫార్సు చేయడమే కాదు... వారి తరఫున చమురు మంత్రిత్వ శాఖలో లాబీయింగ్ నెరపేందుకు కూడా సిద్ధపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచే యూపీఏ ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిప్పులు చెరుగుతున్న సమయంలోనే ఈ నకిలీ విదేశీ సంస్థ కోసం లాబీయింగ్ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు వెనకాడలేదు. వల్లించే విధానాలకూ, చేసే పనులకూ సంబంధంలేదని వారు నిరూపించారు. 1951లో హెచ్.జి. ముద్గల్ అనే ఎంపీ కొందరు పారిశ్రామికవేత్తల తరఫున లోక్‌సభలో ప్రశ్నలు వేయడానికి ముడుపులు తీసుకున్నారని మీడియా వెల్లడించినప్పుడు దేశంలో కలకలం రేగింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ సభ్యుణ్ణి బహిష్కరించే తీర్మానాన్ని ప్రతిపాదించాక ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కోబ్రాపోస్టు ముడుపుల వ్యవహారాన్ని బయటపెట్టి గంటలు గడిచినా నిందపడిన ఎంపీలు బయటకొచ్చి తమ వాదనేమిటో చెప్పలేదు. ఆయా పార్టీలూ సంజాయిషీ ఇవ్వలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ఉభయసభల్లో ఈ సంగతి ప్రస్తావనకే రాలేదు. ఆరున్నర దశాబ్దాలు గడిచేసరికి అవినీతి విషయంలో మనం చాలా బండబారిపోయామని ఉలకని పలకని మన చట్టసభలు, ఎంపీలు, పార్టీల తీరే చెబుతోంది. ‘ముడుపులిస్తే సిఫార్సు చేశాననడం నిజంకాదు. ఆ ప్రాజెక్టువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని భావించాన’ని బీజేపీ ఎంపీ చెబుతున్నారు. మిగిలిన ఎంపీలు కూడా రేపో, మాపో ఆ మాదిరిగానే చెప్పవచ్చు. అయితే, అలాంటి సమర్ధనలు ఎందుకూ కొరగావు. ఇక్కడ వెల్లడైంది ఎంపీల అవినీతి వ్యవహారం మాత్రమే కాదు. ఢిల్లీలో వేళ్లూనుకున్న దళారీ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నదో అది బయటపెట్టింది. మూడేళ ్లక్రితం కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా ఫోన్ సంభాషణలు మీడియాలో వెల్లడై అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ సంభాషణల్లో ఆమె ఎవరెవరి ద్వారా ఏ పని చేయించుకోవచ్చునో పూసగుచ్చినట్టు చెప్పారు. దళారుల ఆనుపానులన్నీ తెలియ జేశారు. ఆ ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తు జరిపి, దోషులెవరో తేల్చాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది కూడా. ఇంకా వెనక్కి వెళ్తే 2005లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకుని ఇప్పటిలాగే 11 మంది ఎంపీలు దొరికి పోయారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌ను కూడా కోబ్రా పోస్టు పోర్టల్ మరో హిందీ న్యూస్ చానెల్‌తో కలిసి చేసింది. డబ్బులిస్తామనేసరికల్లా సంస్థ ఎలాంటిదో, దాని కార్య కలాపాలు ఎంతవరకూ సరైనవో తెలుసుకోకుండా ప్రశ్నలు అడగటానికి వారంతా సిద్ధపడ్డారు. ఆ ఉదంతంపై నిజానిజాలు నిగ్గుదేల్చడానికి అప్పట్లో పార్లమెంటరీ కమిటీని నియమించి ఆ ఎంపీలందరినీ పార్లమెంటు నుంచి బహిష్కరించారు. ఎన్డీఏ అధికారంలో ఉండగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, సమతా పార్టీ అధ్యక్షురాలు జయాజైట్లీవంటివారు ముడుపులు తీసు కుంటూ కెమెరాలకు చిక్కారు. ఈ ఉదంతాలన్నీ మన దేశంలో దళారీ వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో వెల్లడిస్తున్నాయి. ఎవరైనా చొరవచేసి స్టింగ్ ఆపరేషన్ చేస్తేనో, అనర్హులకు మరేదో కట్టబెట్టారని మీడియాలో కథనం వస్తేనో చర్యలు తీసుకుంటున్నట్టు కనబడుతున్నా... మొత్తంగా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు జరగడంలేదని ఈ వరస ఉదంతాలవల్ల అర్ధమవు తోంది. తమది విపక్షమైనా, స్వపక్షమైనా అడ్డగోలుగా పనులు చేయించుకోవడం లో, దళారులుగా వ్యవహరించడంలో ఎవరూ ఎవరికీ తీసిపోరని తాజా ఉదంతం వెల్లడిస్తోంది. ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన ఎంపీలపై చర్య తీసుకోవ డంతో సరిపెట్టకూడదు. మొక్కుబడి ప్రయత్నాలతో అయిందనిపించకూడదు. ఇలాంటివి పదే పదే ఎందుకు పునరావృతమవుతున్నాయో గ్రహించాలి. తమ నిష్క్రియాపరత్వం దేశాన్ని ఎటు తీసుకుపోతున్నదో గుర్తించాలి. దళారీ వ్యవస్థను సంపూర్ణంగా తొలగించేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం సిద్ధం కావాలి. దేన్నయినా పారదర్శకంగా చేసే పరిస్థితులుంటే దళారీ వ్యవస్థ వేళ్లూనుకోవడం సాధ్యంకాదు. అలా లేకపోవడంవల్లే అరాచకం తాండవిస్తున్నదని తెలుసుకోవాలి.