
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 83,048 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 52,724 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు జారీ అయ్యాయని, అందులో 28,116 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిందని పేర్కొంది.
గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ఎన్.రాంచంద్రారావు, సభావత్ రాములు నాయక్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఖాళీ పోస్టులు, వాటి నియామకానికి తీసుకుంటున్న చర్యల్లో పురోగతి వివరాలు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment