ramchander rao
-
ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీ ఓటమికి కారణాలివే..
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు ఓటమికి అనేక కారణాలున్నాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాషాయ పార్టీకి ఉమ్మడి మహబూబ్‌నగర్ ఓట్లే దెబ్బతీశాయని తెలుస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఆ పార్టీ అభ్యర్థికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని.. మహబూబ్‌నగర్‌లో మాత్రం ఆశించిన మేరకు రాబట్టలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని భావించిన బీజేపీకి పట్టభద్రులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. నిరుద్యోగం, పీఆర్సీని ప్రధాన ఎజెండాగా చేసుకున్న ఆ పార్టీ నేతలు వాటినే ప్రధాన అంశాలు చేసుకుని ప్రచారం నిర్వహించారు. అంతే తప్పా తమ వైపున ఉన్న తప్పులను సరిదిద్దుకునే పని చేయలేదనే ఆవేదన బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపునకు కలిసివచ్చాయని గుర్తించారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఆమెకు కలిసొచ్చింది. ఈ సరళిని పరిశీలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కంటే పూర్వ పాలమూరులో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. 2015లో 55శాతం పోలింగ్ జరిగితే ఈసారి ఏకంగా 78.47శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెంపునకు అధికారుల అవగాహనతో పాటు టీఆర్ఎస్ కారణమని చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలూ ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో పట్టభద్రులను గుర్తించి వారికి ఓటు కోసం దరఖాస్తు చేశారు. అంతటితో ఆగకుండా వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ పోలింగ్ రోజున వారిని వెంట తీసుకెళ్లి వేయించడంలో కీలకంగా వ్యవహరించారు. పెరిగిన ధరల ప్రభావం ఇక బీజేపీ నేతలు మాత్రం పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ, వారితో ఓటు వేయించేలా చర్యలేవీ తీసుకోలేపోయారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఉండటం బీజేపీకి ప్రతికూలంగా మారింది. మరోవైపు 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాంచందర్‌రావు ఉమ్మడి జిల్లాలో అంతగా పర్యటించలేదనే అపవాదు ఉంది. ఇదీ ఈ ఎన్నికల్లో కాస్తా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి. పెరిగిన ధరలతో పట్టభద్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వద్దనుకున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించినట్టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గెలిపిస్తే పీఆర్సీ వరిస్తుందని ఉద్యోగులు నమ్మి ఆ పార్టీ అభ్యర్థి వాణీదేవికే ఓటేశారు. అన్నిటికంటే మించి ఉమ్మడి జిల్లాలో కాషాయ నేతల్లో కొరవడిన సమన్వయం, వర్గ విభేదాలూ రాంచందర్‌రావు ఓటమికి కారణాలే. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు అభ్యర్థి తరపున ప్రచారం విషయంలో అంటీముట్టినట్టుగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్నాళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సీనియర్, జూనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇటీవలే బట్టబయలయ్యాయి. దీంతో బీజేపీ క్యాడర్ సైతం ఊహించినంత ప్రచారం చేయలేదు. చదవండి: బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం ఇదే! ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం -
వాహ్ హైదరాబాద్... ఇదేనా విశ్వనగరం?
మాటలు కోటలు దాటుతున్నయ్; చేతలు మాత్రం గడప దాటని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామంటూ గత ఆరేళ్లుగా ఇచ్చిన హామీలెన్ని? వాటిలో అమలైనవెన్ని? నగరంలో రూ.67,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయా లను ఘనంగా పెంపొందించినట్లు కేటీఆర్ స్వయంగా రాష్ట్ర శాసనసభలో చెప్పారు. అంతగా అభివృద్ధి చేస్తే నగరంలో రోడ్లపైకి వర్షపు నీరు ఎందుకొచ్చింది? కాలనీలకు కాలనీలు ఎందుకు ముంపునకు గురయ్యాయి? గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సంవ త్సర కాలంలో లక్ష మంది పేదలకు రెండు పడకల ఇళ్ళు నిర్మించి ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా దసరా రోజున 11,000 ఇళ్లలో గృహప్రవేశం జరిపిం చారు. లక్ష ఇళ్ళెక్కడ? 11,000 ఎక్కడ? హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా, పాతబస్తీని ఇస్తాంబుల్ నగరంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ 2015లో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కై స్క్రాపర్లు, నగరం చుట్టూ గ్రీన్ కారిడార్, వేగంగా దూసుకు పోయే స్కైవేలు, నగరం శివారులో శాటిలైట్ టౌన్‌షిప్‌లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడేమైంది? గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిస్తే 100 రోజుల ప్రణాళికలతో నగరం రూపురేఖలనే మార్చివేస్తామని మునిసిపల్ మంత్రిగా కేటీఆర్ హడావుడి చేశారు. కనీసం రోడ్లలో గుంతలనైనా పూడ్చారా? సిటీలో ఎక్కడ గుంత చూపించినా వెయ్యి ఇస్తానని సవాల్ చేసిండు. కానీ నగరంలో ఎక్కడ చూసినా గుంతలే కన్పిస్తున్నాయి. మూసీనది అభివృద్ధి కోసం అంటూ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదే? రూ. 1,400 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా? నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం రూ 20,000 కోట్లతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అమలుపరుస్తున్నట్లు ప్రకటించారు. 20 ఫ్లైఓవర్లు, 5 స్కైవేలు, 11 మేజర్ కారిడార్లు, 5 గ్రేడ్ సెపరేట్లతో మొత్తం 2,000 కిలోమీటర్ల కొత్త రహదారులు వేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ అందులో నాలుగోవంతు కూడా వేయలేదు. ట్రాఫిక్ రద్దీ కోసం మూసీనదిపై 42 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రణాళిక కూడా చేయలేదు. మురికి నీటితో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను మంచినీటితో నింపుతాననీ, సాగర్ నీటిని కొబ్బరి నీటివలె చేస్తాననీ చెప్పిన కేసీఆర్ ఇప్పుడా విషయమే మరచిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పునాది పడిన మెట్రో రైలు తమ ఘనతగా చెప్పుకొంటున్న కేసీఆర్ పాతబస్తీ వరకు ఆ రైల్ ఎందుకు వెళ్లడం లేదో చెప్పగలరా? శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని చెప్పిన ఆయన ఎందుకు ఆ ఊసెత్తడం లేదు? హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పుకొం టున్న నేతలు 450 ఏళ్ళ నగర చరిత్రకు సాక్షిగా ఉన్న పలు వారసత్వ భవనాలను కూల్చివేస్తున్నారు. సచివాలయంలోని హెరిటేజ్ భవనంతో పాటు అమ్మవారి గుడి, మసీద్‌లను కూల్చివేసి, వాటి శిథిలాలపై కొత్త సచివాలయ నిర్మాణం చేప ట్టారు. చరిత్రాత్మక కట్టడాలైన అసెంబ్లీ భవనం, ఉస్మానియా ఆసుపత్రి, ఎర్రమంజిల్ ప్యాలెస్‌లను కూల్చేందుకు సిద్ధపడుతు న్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృష్ణా, గోదావరి జలాలను నిల్వచేసుకొనేందుకు రాచకొండ, శామీర్‌పేటల వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పి, డీపీఆర్‌లు కూడా సిద్ధమైనా ఒక తట్ట మట్టిని కూడా ఎత్తలేదు. గత ఎన్నికల ముందు 18,000 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం తిరిగి ఆ మాట ఎత్తడం లేదు. తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా నాలుగేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి, ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఒక్కరికైనా ఇచ్చిందా? నగర పరిధిలో మొదటి దశలో రూ.130 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు, 200 ఆదర్శ మార్కెట్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేవలం నాలుగు మార్కెట్లు మాత్రమే నిర్మించినా వాటిని కూడా అందుబాటులోకి తేలేదు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 200 నుండి 300 ఎకరాలలో 15 కొత్త డంప్‌యార్డ్‌లు అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. నగర ప్రజలను వరదల నుండి విముక్తి కలిగించడం కోసం సీవరేజీ డెవలప్ మెంట్ ప్లాన్ అమలుకు రూ 10,000 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోవడంతో నగర ప్రజలకు ముంపు బాధలు తప్పడం లేదు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో గప్పాలు కొట్టడం తప్ప హైద రాబాద్‌కు ఒరిగిందేమీ లేదు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద లతో కార్లు, వాహనాలు మునిగిపోయి ఎటు చూసినా బురద, వాసనతో ఉన్న నగరాన్ని చూసి ఇదేనా విశ్వనగరమంటే, ‘వాహ్... హైదరాబాద్?’ అని జనం నవ్వుకుంటున్నారు. వ్యాసకర్త: ఎన్. రామచంద్రరావు, తెలంగాణ బీజేపీ నేత, శాసనమండలి సభ్యుడు -
అది జరిగినప్పుడే అసలైన పల్లె ప్రగతి
సాక్షి, హైదరాబాద్: బెల్టు దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లెప్రగతి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. హోం, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలు కలిసి ఈ దుకాణాల మీద దాడులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు దుకాణాలు తీసివేయాలని.. మద్యాన్ని అరికట్టాలన్నారు. పల్లె ప్రగతి మంచి కార్యక్రమమని కొనియాడారు. కానీ, ప్రతి ఊరికి ట్రాక్టర్ అవసరం లేకపోవచ్చని, దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. (‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్) బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు మాట్లాడుతూ.. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా మరుగుదొడ్లు నియమించాలని కోరారు. నగరాలు, పట్టణాలకు వలస వచ్చినవారు తిరిగి గ్రామాలకు వెళ్లే పరిస్థితి తీసుకురావాలని పేర్కొన్నారు. కేంద్రం.. గ్రామాలకు అనేక పథకాల ద్వారా నిధులు ఇస్తుందని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతి రోజు పండగనే జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు నిధుల కేటాయింపు గతంలో రూ.13 వేల కోట్లు దాటలేదని, కానీ నేడు రూ.23 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. -
‘టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గెలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నా యని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, అవినీతి, కుంభకోణాలను రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు గుర్తుంచుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని గ్రహించకపోవడం వారి అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఆయన ఎద్దేశా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని, అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి, నాలుగో స్థానానికి పరిమితమైనప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన శాసనసభ్యులు పార్టీని నమ్మలేక టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాలుగు లోక్ సభ స్థానాల్లో ఘన విజయం సాధించడమే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నేల మట్టం చేసిందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మూడు సీట్లలో కాంగ్రెస్.. అతి తక్కువ మెజార్టీతో బయట పడిందని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా కొద్ది నెలల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు -
కమలం..కొత్త వ్యూహం!
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీనియర్లందరినీ బరిలోకి దించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను సనత్‌నగర్ శాసనసభకు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావును మల్కాజ్గిరి శాసనసభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టనుంది. ఈ ఇద్దరి పదవీ కాలం ఇంకా ఉన్నా, గెలుపే లక్ష్యంతో పని చేయటం..ఇతర నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉండడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. వీరితో పాటు సిట్టింగ్ స్థానాల్లో అంబర్‌పేట – కిషన్‌రెడ్డి, గోషామహల్ – రాజాసింగ్, ముషీరాబాద్ – డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ – రామచంద్రారెడ్డి, ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లే మళ్లీ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన చోట్ల కూడా సీనియర్లను, జనంతో సంబంధం ఉన్న నేతలనే రంగంలోకి దింపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌లో సతీష్‌గౌడ్, కార్వాన్లో దేవర కరుణాకర్, జూబ్లీహిల్స్ ఏపీకి చెందిన మాజీ మంత్రి కుమారుడి పేర్లను దాదాపు ఖరారు చేశారు. ఇదిలా ఉంటే నగరంతో పాటు శివారు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. టీడీపీ, టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌లోనూ ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉందని ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. అమిత్ షా సభతో సమరశంఖం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి, ఆ రోజు నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే దిశగా బీజేపీ నేతలు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వివిధ పార్టీల చోటా నేతలను పార్టీలో చేర్చుకుంటూ, అమిత్ షా సమక్షంలో ముఖ్యమైన నేతల చేరికలకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇన్చార్జులు అసెంబ్లీ స్థానాల వారిగా రోజు వారి సమీక్షలు, సభలు నిర్వహిస్తున్నారు. -
1,10,012 పోస్టులు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 83,048 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 52,724 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు జారీ అయ్యాయని, అందులో 28,116 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిందని పేర్కొంది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ఎన్.రాంచంద్రారావు, సభావత్ రాములు నాయక్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఖాళీ పోస్టులు, వాటి నియామకానికి తీసుకుంటున్న చర్యల్లో పురోగతి వివరాలు వెల్లడించింది. -
'చంద్రబాబు తగిన మూల్యం చెల్సించాల్సి వస్తుంది'
గన్నవరం : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎంపీ పి.మిథున్‌రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం కేసులు బనాయిండం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. దుట్టా రామచంద్రరావు అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరంలో డా.దుట్టా రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ... తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు బనాయిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును రామచంద్రరావు హెచ్చరించారు. -
సర్కార్‌కు ఢక్కా ఇద్దాం
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు కొల్లాపూర్: ఏడాది పాలనలోనే ప్రజలకు నియంతృత్వ పోకడలతో చుక్కలు చూపిస్తున్న కేసీఆర్‌కు ఢక్కా ఇచ్చేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కొ ల్లాపూర్‌లో పర్యటించారు. పట్టణంలోని బార్ కౌ న్సిల్‌లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. తనకు ఓటేయాలని న్యాయవాదులను కోరారు. అనంతరం ఉద్యోగులు, నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం బలపడాల్సిన అ వసరం ఉందన్నారు. అధికార పార్టీ సభ్యులను గెలిపిస్తే వా రు కేసీఆర్‌కు దాసోహమంటున్నారని, వారు ప్రజా సమస్య ల గూర్చి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ని యంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌కల్పిస్తూ విడుదలైన జీఓ వెబ్సైట్లో ఇ ప్పుడు ఎందుకు కనిపించడం లేదో వెల్లడించాలన్నారు. తె లంగాణ ఏర్పడ్డాక కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోవటం దారుణమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావ్ నామాజీ, జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, నరేందర్‌రావు, ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, న్యాయవాది మనోహర్ పాల్గొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులపై కేసులా..! అచ్చంపేట: తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు ఉద్యమం చేసిన తెలంగా ణ సాధించుకుంటే ముఖ్యమంత్రి వారి పై కేసులు పెట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మె ల్సీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఉదయం అచ్చం పేట శ్రీవాసవి కాన్యక పరమేశ్వరీ క ళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల అత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పోరాడి తెలంగాణ సాధిం చుకుంటే పోలీసులు గూుండాలచేత కొట్టిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన జ ర్నలిస్టులను సెక్రటేరియట్‌కు రానివ్వ డం లేదని.. దీనిబట్టి ఆ శించిన బంగా రు తెలంగాణ రాలేదన్నారు. బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామోజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుని సీఎం చేస్తాం..చేయకపోతే మెడమీద తలకాయ ఉండదని చె ప్పి కెసీఆర్ మా ట తప్పారని విమర్శిం చారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మంగ్యానాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మండికారి బాలాజీ, గౌరిశంకర్, నరేం దర్రావు, రవీందర్‌రెడ్డి, జేఏసీ నాయకులు వెంకటేశ్వరశర్మ పాల్గొన్నారు. -
మండలిలోనూ బలమైన ప్రతిపక్షం ఉండాలి
- బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి - పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్‌రావు నామినేషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే శాసనమండలిలోనూ బలమైన ప్రతిపక్షం అవసరమని, అందువల్ల మేధావులు, పట్టభద్రులు బీజేపీ, టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజీపీ అభ్యర్థిగా ఎన్.రాంచందర్‌రావు నామినేషన్ సందర్భంగా సోమవారం బర్కత్‌పురలోని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రజలు అండగా నిలబడాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ-టీడీపీ అభ్యర్థుల గెలుపుతో రాజకీయ సమీకరణాలు మారబోనున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల వాణిని మండలిలో వినిపించాలంటే రాంచందర్‌రావు సరైన అభ్యర్థి అని కిషన్‌రెడ్డి తెలిపారు. విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘నల్లగొండ’ నుంచి నలుగురు నామినేషన్లు నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం స్థానానికి సోమవారం నలుగురు అభ్యర్థులు నల్లగొండలో నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్రావు నాలుగుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న (చింతకుంట నవీన్‌కుమార్) నామినేషన్ వేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన నరాల సత్యనారాయణ, మైసా పాపయ్యలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.