బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు
కొల్లాపూర్: ఏడాది పాలనలోనే ప్రజలకు నియంతృత్వ పోకడలతో చుక్కలు చూపిస్తున్న కేసీఆర్‌కు ఢక్కా ఇచ్చేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కొ ల్లాపూర్‌లో పర్యటించారు. పట్టణంలోని బార్ కౌ న్సిల్‌లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. తనకు ఓటేయాలని న్యాయవాదులను కోరారు. అనంతరం ఉద్యోగులు, నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం బలపడాల్సిన అ వసరం ఉందన్నారు. అధికార పార్టీ సభ్యులను గెలిపిస్తే వా రు కేసీఆర్‌కు దాసోహమంటున్నారని, వారు ప్రజా సమస్య ల గూర్చి పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ ని యంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌కల్పిస్తూ విడుదలైన జీఓ వెబ్‌సైట్‌లో ఇ ప్పుడు ఎందుకు కనిపించడం లేదో వెల్లడించాలన్నారు. తె లంగాణ ఏర్పడ్డాక కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోవటం దారుణమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావ్ నామాజీ, జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, నరేందర్‌రావు, ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, న్యాయవాది మనోహర్ పాల్గొన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన
విద్యార్థులపై కేసులా..!
అచ్చంపేట: తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు ఉద్యమం చేసిన తెలంగా ణ సాధించుకుంటే ముఖ్యమంత్రి వారి పై కేసులు పెట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మె ల్సీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఉదయం అచ్చం పేట శ్రీవాసవి కాన్యక పరమేశ్వరీ క ళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల అత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పోరాడి తెలంగాణ సాధిం చుకుంటే పోలీసులు గూుండాలచేత కొట్టిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన జ ర్నలిస్టులను సెక్రటేరియట్‌కు రానివ్వ డం లేదని.. దీనిబట్టి ఆ శించిన బంగా రు తెలంగాణ రాలేదన్నారు.
బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామోజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుని సీఎం చేస్తాం..చేయకపోతే మెడమీద తలకాయ ఉండదని చె ప్పి కెసీఆర్ మా ట తప్పారని విమర్శిం చారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మంగ్యానాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మండికారి బాలాజీ, గౌరిశంకర్, నరేం దర్‌రావు, రవీందర్‌రెడ్డి, జేఏసీ నాయకులు వెంకటేశ్వరశర్మ పాల్గొన్నారు.
సర్కార్‌కు ఢక్కా ఇద్దాం
Published Sat, Mar 7 2015 1:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement