
మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తనతో పాటు మిగతా ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిందని.. మండలి సభ్యత్వం రద్దు చేస్తానంటున్నదని విమర్శించారు. అంతేకాకుండా బుధవారం ఉదయం నుంచే కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తన ఇంటి ముందు కూడా పోలీసులు చక్కర్లు కొడుతున్నారని షబ్బీరు వివరించారు. పార్టీ ఆఫీస్‌లో నిరసన కార్యక్రమం చేసుకోవద్దంటే ఎలా? పార్టీ ఆఫీసుల వద్దకు రావద్దని షబ్బీర్ పోలీసులను హెచ్చరించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment