
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు సం బంధించి ఎగ్జిట్ పోల్స్‌తోపాటు, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్టం ప్రకారం ఆంక్షలున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా వాటి ని నిక్కచ్చిగా పాటించాలని బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951కు సంబంధించిన సెక్షన్ 126ఎ లోని సబ్ సెక్షన్(1), (2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్ ఈనెల 11న (గురువారం) ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ఆయన వివరించారు.
ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని తెలిపారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, లేదా మరే ఇతర పోల్ సర్వే లు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ వంటివి నిషిద్ధమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment