సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో సమావేశమై సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ ఎన్నికలను సవాలుగా స్వీకరించి అన్ని జాగ్రత్తలతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. నిజామాబాద్ స్థానానికి పోలింగ్ వేళల్లో మార్పు ఉండదని, అభ్యర్థులు ఎందరున్నా సమ యం సరిపోతుందని స్పష్టం చేశారు.
అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ‘ఎల్’ఆకృతిలో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. 27,185 బ్యాలెట్ యూనిట్లు, 3,530 కంట్రోల్ యూనిట్లు, 3,651 వీవీప్యాట్‌లను తరలించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో పని చేయని యంత్రాలను మార్చడానికి రెట్టిం పు సంఖ్యలో కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈవీఎంల నిర్వహణకు 560 మంది ఇంజనీ ర్లు విధుల్లో చేరారన్నారు. ఇప్పటికే అక్కడ ఈవీఎంల ప్రథమ స్థాయి తనిఖీలు చేపట్టామని తెలిపారు.
ఈవీఎంలలో అభ్యర్థు ల వివరాలు పొందుపరిచే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 500 ఈవీఎంలతో బ్యాలెట్ పేపర్లను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అనంతరం రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఈవీఎంలను 7వ తేదీ రాత్రికి అసెంబ్లీ స్థానాలకు, అక్కడి నుంచి మూడో ర్యాం డమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు పంపుతామన్నారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ వారు ఎంపిక చేసుకున్న గుర్తులను కేటాయించామన్నారు. ఓటర్లను గుర్తించే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రం బయటే ఉంటారన్నారు. పోలింగ్ కేంద్రం లోపల ఈవీఎంను నిర్వహించే అధికారులుంటారని చెప్పారు.
వేగంగా ఏర్పాట్లు..
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానా లకు ఎన్నికల ఏర్పాట్లు వేగం గా జరుగుతున్నాయని రజత్‌కుమార్ తెలిపారు. నిజామా బాద్ సహా అన్ని లోక్‌సభ స్థానాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు చేరినట్లు చెప్పారు. ఓట ర్ల జాబితాలో కొత్తగా 20 లక్షల మందికిపైగా ఓటర్లు చేరారని, వారి లో 80% మందికి ఇప్పటికే ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 35 శాతమే పంపిణీ జరిగిందని, 8లోగా 100% పూర్తి చేస్తామన్నారు. వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొనే విద్యార్థులు ఓటేసేందుకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో 370 పోస్టులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాయని, పలు పత్రికల్లో 233 పెయిడ్ వార్త లు వచ్చినట్లు గుర్తించామని, సంబంధీకులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment