Nijamabad district
-
వడగళ్లవానతో భారీ నష్టం
సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 14,553 మంది రైతులు నష్టపోయారని నివేదికలో పేర్కొన్నారు. వరి 16,298 ఎకరాల్లో, మక్క 2,784.16 ఎకరాల్లో, జొన్న 705.2 ఎకరాల్లో, గోధుమ ఐదు ఎకరాల్లో, ఉల్లిగడ్డ 12 ఎకరాలు, బొప్పాయి పది ఎకరాలు, పొగాకు 20 ఎకరాలు, మామిడి 192 ఎకరాలు, కూరగాయలు 45 ఎకరాల్లో దెబ్బతిన్నాయని పేర్కొ న్నారు. తాడ్వాయి మండలంలోని బ్రహా్మజీవాడి గ్రామంలో గాలిదుమారానికి రేకుల షెడ్డు కూలిపోవడంతో అందులో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరోనాలుగు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 6,058 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పది మండలాల్లోని 44 గ్రామాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 3,076 మంది రైతులు నష్టపోయారన్నారు. అత్యధికంగా 5,661 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 292 ఎకరాల్లో మక్క, 93 ఎకరాల్లో జొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. -
ఆందోళనలో నిజామాబాద్ జిల్లా రైతులు
-
గుండెలు పిండేసే దృశ్యం..
-
‘ఇంటికి పోదాం లేవయ్యా..’ హృదయ విదారక దృశ్యం
కరోనా భయంతో కళ్లముందే చెట్టంత కొడుకు కూర్చున్న చోటనే విగతజీవిగా మారడంతో కన్నపేగు కన్నీటి రోదన హృదయాలను ద్రవీంపచేస్తోంది. ‘ఇంటికి పోదాం లేవయ్యా..’ అంటూ ప్రాణాలు కోల్పోయిన భర్తను పట్టుకుని భార్య విలపించిన హృదయ విదారక దృశ్యం గుండెలను పిండెస్తోంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. బోధన్ టౌన్/రెంజల్: కరోనా సోకకున్నా పలువురు అనవసరంగా ఆందోళన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో అనవసర ఆందోళన పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడు. కరోనా లక్షణాలుగా భావించి తన భార్య లక్ష్మి, తల్లి గంగామణి, తమ్ము డు గంగాధర్‌తో కలసి ఆదివారం రెంజల్ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. టెస్టు చేయించుకున్న అశోక్ నీరసంగా ఉందని పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి తల్లి, భార్యతో కలసి కూర్చున్నాడు. తరచూ కోవిడ్‌వార్తలు వింటున్న ఆయన పరీక్ష ఫలితం రాకముందే తనకున్న లక్షణాలను బట్టి కోవిడ్ వచ్చిందేమోనని తీవ్ర భయాందోళనకు లోనయ్యాడు. దీంతో ఆయన అక్కడిక్కడే చెట్టుకిందే కుప్ప కూలిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి, భార్య బాధితుడి భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘ఇంటికి పోదాం లేవయ్యా’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. కుమారుడిని పట్టుకుని అశోక్ తల్లి గంగామణి కన్నీటిపర్యంతమయింది. ఇదిలాఉంటే అనంతరం వచ్చిన కరోనా పరీక్ష ఫలితాల్లో అశోక్ కరోనా నెగెటివ్ అని తేలింది. చదవండి: పరీక్ష కోసమని వచ్చి.. కుర్చీలో కూర్చుని అలాగే.. -
ఇందూరు గడ్డపై ‘ఉగ్ర’ కదలికలు?!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయా.? సమస్యాత్మక ప్రాంతాలే అడ్డాగా స్లీపర్ సెల్స్ కీలకంగా పని చేస్తున్నాయా.? స్వచ్ఛంద సంస్థ ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయా..? అంటే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో జిల్లాలో పలుమార్లు ఉగ్రవాద కదలికలు వె లుగు చూశాయి. తాజాగా వారం వ్యవధిలో చోటు చే సుకున్న రెండు ఘటనలతో మరోమారు ఉగ్రవాద కా ర్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి. నిజామాబాద్ మండలం గుండారంలో జాతిపిత గాంధీజీ విగ్రహానికి మసి పూసిన నిందితులు దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ వేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. గుండారం గ్రామంలో గల గాంధీ విగ్రహానికి నల్ల రంగ పూసి ఉన్నట్లు ఆదివారం మధ్యాహ్నం గమనించిన స్థానిక యువకులు, విగ్రహం మెడలో పేపర్ల దండ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విగ్రహం వద్దకు వెళ్లి పరిశీలించగా, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ కనిపించింది. అందులో ‘పాకిస్తాన్ జిందాబాద్.. ఇండియా డౌన్ డౌన్ డౌన్.. జీహాద్.., షాదుల్లాను విడుదల చేయాలి.. కాశ్మీర్ పాకిస్తాన్ దే..’ అంటూ తెల్ల కాగితాలపై రాసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాజా ఘటనతో జిల్లాలో అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో విష ప్రచారం చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. జిల్లాలో ‘ఉగ్ర’ కార్యకలాపాలను గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవలే పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కొన్ని రోజులుగా అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై కన్నేసినట్లు సమాచారం. మూడు చోట్ల స్లీపర్ సెల్స్! ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అసాంఘిక శక్తుల కార్యకలాపాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. అయినా ఎక్కడో ఒకచోట ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు జిల్లాలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బోధన్‌లోని అత్యంత సమస్యాత్మకమైన మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లి మండలంలోని ఓ గ్రామంలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు గతంలోనే గుర్తించాయి. అలాగే, నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని సముదాయాల్లోనూ కొందరు అనుమానిత వ్యక్తులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు గతంలోనే పక్కా సమాచారముంది. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే రైళ్లలో వస్తున్న కొందరు అనుమానితులు రాత్రి పొద్దుపోయే వరకూ రైల్వే స్టేషన్ సమీపంలోని సముదాయాల్లో కొందరు స్థానికులతో భేటీ వేస్తున్నట్లు కూడా గతంలోనే గుర్తించారు. ఇక, నిషేధిత సంస్థ సిమికి సంబంధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు గత వారం కలెక్టరేట్ వద్ద అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ తాజాగా గుండారంలో వెలుగు చూసిన పేపర్ల దండలో అగంతకులు డిమాండ్ చేయడం చూస్తుంటే జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు పోలీసులు సూత్రప్రాయంగా నిర్ధారణకు వచ్చారు. గాంధీజీ విగ్రహానికి మసి పూసి, దేశ వ్యతిరేక నినాదాలు రాసిన అగంతకులను గుర్తించే పనిలో పడ్డారు. ‘స్వచ్ఛందంగా’ విష ప్రచారం.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసాంఘిక శక్తలు కదలికలు ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. అవగాహన సదస్సులతో గుట్టు చప్పుడు కాకుండా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్న ఘటనలు ఇటీవల పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, రెంజల్, నందిపేట, కామారెడ్డి ప్రాంతాల్లో ఇలాంటి ఈ వ్యవహారాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతి లేకుండా అవగాహన సదస్సుల పేరిట ఈ విష ప్రచారం కొనసాగుతోంది. జగిత్యాల నుంచి కొందరు జిల్లాకు వచ్చి ఒక సంస్థ పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట మాలపల్లి ప్రాంతంలో ఒక నిర్మాణాన్ని చేపట్టి, స్థానికు యువతను రెచ్చగొట్టేందుకు ఓ సంస్థ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇది గమనించిన పోలీసులు పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంబంధిత యువకుల తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, వదిలేశారు. ఇక, ఒక మహిళతో పట్టణ శివారులోని ఓ గ్రామంలో అవగాహన సదస్సు పేరిట నిషేదిత సంస్థ అందించిన పుస్తకాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్‌లో తల దాచుకుంటూ కార్యకలాపాల నిమిత్తం జగిత్యాలకు వెళ్తున్న కరుడు గట్టిన ఉగ్రవాది అజాం ఘోరిని ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. 2002లో సారంగపూర్ ఎస్టీడీ బూత్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ హతమయ్యాడు. 1998లో బోధన్‌లోని ఓ సైకిల్ షాప్ యజమానిని అజాం ఘోరీ అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. వీరిలో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ ఇద్దరు దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల నిందితులకు సహకరించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. తాజాగా నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమవడంతో జిల్లాలో ఉగ్ర కదలికలపై మరోమారు జోరుగా చర్చ జరుగుతోంది. -
పిచ్చికుక్కల స్వైరవిహారం
సాక్షి, రెంజల్(బోధన్): మండలంలోని బాగేపల్లి గ్రా మంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకుటు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది, పన్నెండు రోజులుగా పిచ్చికుక్కలు పశువులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వాటి భయానికి ఇంట్లో నుంచి రాత్రిపూట బ యటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. రా త్రి సమయంలో పశువుల పాకల్లో కట్టెసిన పశువు లపై దాడులు చేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. బర్రెలను తలుగులకు కట్టేసి ఉంచడంతో అవి ఎదురు తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ నాయకుడు సాయిబాబగౌడ్‌కు చెందిన పశువుల పాకలోని రెండు గేదెలపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. శుక్రవారం పశువుల పాకను శుభ్రం చేసేందుకు వెళ్లగా గేదెలు అపస్మారకస్థితిలో ఉన్న ట్లు గుర్తించారు. అప్పటికే ఓ గేదె మృత్యువాత ప డినట్లు గుర్తించారు. ఇప్పటికే అనేక పశువులను పిచ్చికుక్కలు దాడి చేశా యని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బా ధిత రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దించి గ్రామంలో రాత్రిపూట సంచరిస్తున్న పిచ్చి కుక్కలను సంహరించాలని కోరుతున్నారు. -
నేడు ఇందూరుకు సీఈవో
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో సమావేశమై సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ ఎన్నికలను సవాలుగా స్వీకరించి అన్ని జాగ్రత్తలతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. నిజామాబాద్ స్థానానికి పోలింగ్ వేళల్లో మార్పు ఉండదని, అభ్యర్థులు ఎందరున్నా సమ యం సరిపోతుందని స్పష్టం చేశారు. అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ‘ఎల్’ఆకృతిలో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. 27,185 బ్యాలెట్ యూనిట్లు, 3,530 కంట్రోల్ యూనిట్లు, 3,651 వీవీప్యాట్లను తరలించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో పని చేయని యంత్రాలను మార్చడానికి రెట్టిం పు సంఖ్యలో కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈవీఎంల నిర్వహణకు 560 మంది ఇంజనీ ర్లు విధుల్లో చేరారన్నారు. ఇప్పటికే అక్కడ ఈవీఎంల ప్రథమ స్థాయి తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈవీఎంలలో అభ్యర్థు ల వివరాలు పొందుపరిచే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 500 ఈవీఎంలతో బ్యాలెట్ పేపర్లను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అనంతరం రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఈవీఎంలను 7వ తేదీ రాత్రికి అసెంబ్లీ స్థానాలకు, అక్కడి నుంచి మూడో ర్యాం డమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు పంపుతామన్నారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ వారు ఎంపిక చేసుకున్న గుర్తులను కేటాయించామన్నారు. ఓటర్లను గుర్తించే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రం బయటే ఉంటారన్నారు. పోలింగ్ కేంద్రం లోపల ఈవీఎంను నిర్వహించే అధికారులుంటారని చెప్పారు. వేగంగా ఏర్పాట్లు.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానా లకు ఎన్నికల ఏర్పాట్లు వేగం గా జరుగుతున్నాయని రజత్‌కుమార్ తెలిపారు. నిజామా బాద్ సహా అన్ని లోక్‌సభ స్థానాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు చేరినట్లు చెప్పారు. ఓట ర్ల జాబితాలో కొత్తగా 20 లక్షల మందికిపైగా ఓటర్లు చేరారని, వారి లో 80% మందికి ఇప్పటికే ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 35 శాతమే పంపిణీ జరిగిందని, 8లోగా 100% పూర్తి చేస్తామన్నారు. వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొనే విద్యార్థులు ఓటేసేందుకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో 370 పోస్టులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాయని, పలు పత్రికల్లో 233 పెయిడ్ వార్త లు వచ్చినట్లు గుర్తించామని, సంబంధీకులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. -
నిజామాబాద్ జిల్లాలో యువకుడి న్యాయపోరాటం
-
నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ యోగితా రాణా ఫోన్: 9491036933 పోలీస్ కమిషనర్ కార్తికేయ ఫోన్: 9440795400 ఇతర ముఖ్య అధికారులు జేసీ: రవీందర్‌రెడ్డి 9491036090 జెడ్పీ సీఈవో: మోహన్‌లాల్ 9849900106 ఆర్డీవో: యాదిరెడ్డి 9491036891 డీఆర్వో: పద్మాకర్ 9491036911 మండలాలు 27: (నందిపేట, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, కోటగిరి , డిచ్పల్లి, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి. కొత్త మండలాలు ఇవీ.. ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ దక్షిణం, నిజామాబాద్ ఉత్తరం, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, రుద్రూరు) రెవెన్యూ డివిజన్లు: నిజామాబాద్, బోధన్ , ఆర్మూర్ మున్సిపాలిటీలు/కార్పొరేషన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు పరిశ్రమలు: బోధన్ షుగర్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ, అలీసాగర్, గోదావరిపై 18 ఎత్తిపోతల పథకాలు ఎమ్మెల్యేలు: బిగాల గణేశ్‌గుప్తా(నిజామాబాద్ అర్బన్) బాజిరెడ్డి గోవర్ధన్(నిజామాబాద్ రూరల్) ఆశన్నగారి జీవన్‌రెడ్డి(ఆర్మూర్) షకీల్ అహ్మద్(బోదన్), వేముల ప్రశాంత్‌రెడ్డి(బాల్కొండ) ఎంపీ: కల్వకుంట్ల కవిత(నిజామాబాద్) పర్యాటక ప్రాంతాలు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, డిచ్పల్లి ఖిలా రామాలయం, రఘునాథ ఆలయం అలీసాగర్ ఉద్యానవనం, సిద్దుల గుట్ట జాతీయ రహదారులు: జిల్లా మీదుగా ఎన్‌హెచ్ 64. డిచ్పల్లి, ఆర్మూర్, బాల్కొండ మీదుగా ఎన్‌హెచ్ 44 రైల్వేలైన్: నిజామాబాద్-హైదరాబాద్ వరకు 185 కి.మీ. మార్గం ఖనిజాలు: ఇసుక క్వారీలు గ్రామ పంచాయతీలు: 395