బయోఏషియా-2024 సదస్సు 21వ ఎడిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.
హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుండటంపై మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ, గ్లోబల్ లైఫ్-సైన్సెస్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి బయోఏషియా కీలక సాధనంగా ఉద్భవించిందన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారిగా బయోఏషియాకు హాజరవుతున్నారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు.
‘డేటా & ఏఐ: రీడిఫైనింగ్ పాసిబిలిటీస్’ అనే థీమ్‌తో జరగనున్న బయో ఏషియా 21వ ఎడిషన్‌లో ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్‌లతో సహా 70 మందికిపైగా ప్రభావవంతమైన వక్తలు ప్రసంగించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మందికిపైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈవెంట్‌లో ఈసారి 200కిపైగా కంపెనీలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment