BioAsia
-
లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీనోమ్ వ్యాలీ రెండో దశను 300 ఎకరాల్లో నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రూ.2 వేల కోట్లతో దానిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. 10 ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసి.. రూ.లక్ష కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, 5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో 21వ బయో ఏసియా–2024 సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జీవవైవిధ్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాలకు ప్రోత్సహకాలపై వారు చర్చించనున్నారు. ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్.. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ చెప్పారు. ప్రముఖ టకేడా సంస్థ బయోలాజికల్–ఈ సంస్థతో కలసి హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. హైదరాబాద్‌లో ఆర్అండ్డీ సెంటర్ ఏర్పాటుకు మిల్టెనీ బయోటెక్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ రంగానికి రాజధానిగా మారింది. ప్రపంచంలో మూడు కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే.. అందులో ఒకదాన్ని అందించిన ఘనత హైదరాబాద్‌కే దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా నిలిచింది’’అని సీఎం చెప్పారు. మెదక్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం గంటా గంటన్నర ప్రయాణ దూరంలోనే ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుందన్నారు. మూడు విభిన్న ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించేలా వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు. పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తామని.. అద్భుత మౌలిక సదుపాయాలతో సంపూర్ణమైన వ్యవస్థను రూపొందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్టార్టప్‌లు, కార్పొరేట్ల మధ్య వారధిగా ఉన్న ఎంఎస్ఎంఈలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిపెడతామన్నారు. ‘‘మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్లా మా ప్రభుత్వం పనిచేస్తుంది..’’అని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నైపుణ్య రాజధానికి హైదరాబాద్: శ్రీధర్‌బాబు హైదరాబాద్‌ను భారతదేశంలోనే నైపుణ్యం కలిగిన రాజధానిగా మార్చడానికి సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని విద్యార్థులందరికీ పరిశ్రమలతో కలసి పనిచేసే తప్పనిసరి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. దీనిద్వారా విద్యారంగానికి విలువను అందించేలా కొత్త విప్లవం తీసుకువస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, రెగ్యులేటరీ ఏజెన్సీల మధ్య సమ్మిళితమైన కొత్త డైనమిక్ లైఫ్ సైన్సెస్ పాలసీని కూడా తెస్తున్నామన్నారు. పలు దేశాల ప్రతినిధులతో సీఎం భేటీ బయో ఏషియా సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని వారిని సీఎం కోరారు. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్‌ను పూర్తి చేస్తామన్నారు. వెస్ట్రన్ ఆ్రస్టేలియా మంత్రి సాండర్సన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీ జెర్మిజూర్గన్స్, బెల్జియం అంబాసిడర్ డెడిర్ వాండర్ హసక్ తదితరులు సీఎంతో విడివిడిగా సమావేశమయ్యారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, భారత్‌లో తమ తొలి కమర్షియల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నామని వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ ఈ సందర్భంగా వివరించారు. -
BioAsia 2024: ప్రతిష్టాత్మకంగా బయోఏషియా సదస్సు
బయోఏషియా-2024 సదస్సు 21వ ఎడిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుండటంపై మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ, గ్లోబల్ లైఫ్-సైన్సెస్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి బయోఏషియా కీలక సాధనంగా ఉద్భవించిందన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారిగా బయోఏషియాకు హాజరవుతున్నారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ‘డేటా & ఏఐ: రీడిఫైనింగ్ పాసిబిలిటీస్’ అనే థీమ్‌తో జరగనున్న బయో ఏషియా 21వ ఎడిషన్‌లో ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లతో సహా 70 మందికిపైగా ప్రభావవంతమైన వక్తలు ప్రసంగించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మందికిపైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈవెంట్లో ఈసారి 200కిపైగా కంపెనీలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. -
వైద్య పరికరాల పరిశ్రమలకు చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అభివృద్ధి కోసం సరైన విధానాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని.. ఈ రంగానికి తగిన చేయూతనిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. ‘బయో ఆసియా 2023’ సదస్సులో భాగంగా ఆదివారం హెచ్ఐసీసీలో దేశంలోని 20 ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ అందులో పాల్గొని మాట్లాడారు. దేశంలో వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలు, పారిశ్రామిక సానుకూలతలను వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. కాగా దేశంలో వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన ప్రోత్సాహం, ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఇందులో మెడ్‌ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ బ్లాక్ వెల్, రాజీవ్‌నాథ్ (ఎండీ, హిందుస్థాన్ సినర్జీస్), ఆదిత్య బెనర్జీ (ఎండీ, బీబ్రౌన్ మెడికల్ ఇండియా), సుమీత్‌భట్ (సీఈవో, ట్రైవిట్రాన్ హెల్త్‌కేర్), శిశిర్ అగర్వాల్ (ఎండీ, టెరుమో ఇండియా), భార్గవ్ కోటాడియా (షాజహాన్ మెడికల్ టెక్నాలజీస్), సచిన్ గార్గ్ (డైరెక్టర్, ఇన్నోవేషన్ ఇమేజింగ్ టెక్నాలజీస్), జతిన్ మహాజన్ (ఎండీ, జె.మిత్రా) సహా ఇరవై ప్రముఖ వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
Bio Asia 2023 : హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు (ఫొటోలు)
-
హైదరాబాద్‌కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్‌తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్‌ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
జీవశాస్త్ర రంగంలో భారీ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయిలోనూ తనదైన ముద్ర వేస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గతేడాది కాలంలో తెలంగాణలో రూ. 6,400 కోట్ల విలువైన పెట్టుబడులు జీవశాస్త్ర రంగంలోనే వచ్చాయని చెప్పారు. 215 కొత్త, ప్రస్తుత కంపెనీలు పెట్టిన ఈ పెట్టుబడులతో 34 వేల మందికి ఉపాధి కల్పించగలిగామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘బయో ఆసియా’19వ సదస్సును వర్చువల్ పద్ధతిలో గురువారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీ ప్రాధాన్యాన్ని ప్ర పంచం గుర్తించిందన్నారు. కరోనా నియంత్రణకుa దేశీయంగా అభివృద్ధి చేసిన 3 టీకాల్లో రెండు హైదరాబాద్‌లోనే తయారవడం తమకు గర్వకారణమన్నారు. గతేడాది డిసెంబర్లో తాము 7 కంపెనీలతో మెడికల్ డివైజెస్ పార్క్‌ను ప్రారంభించగా రానున్న 6 నెలల్లో 20 కంపెనీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇందులో రూ. 1,500 కోట్లతో స్థాపించిన 50 కంపెనీలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే దేశం ప్రపంచ ఫార్మా రాజధానిగా అవతరించినా.. మేధోహక్కుల విధానం వంటివి మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. -
కరోనా మహమ్మారిగా మారడం అదృష్టమే! ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: ముప్ఫై ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న కరోనా వైరస్ రెండేళ్ల క్రితం మహమ్మారిగా మారడం మన అదృష్టమని.. మనిషికి ఏమాత్రం తెలియని వైరస్‌తో ముప్పు వచ్చి ఉంటే ఆ విపత్తును ఊహించలేమని డాక్టర్ డ్రూ వైజ్మాన్ అభిప్రాయపడ్డారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ వైజ్మాన్ గురువారం బయో ఆసియా సదస్సులో భాగంగా అపోలో గ్రూప్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో ఒక చర్చలో పాల్గొన్నారు. మోడిఫైడ్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకా అభివృద్ధిలో డాక్టర్ వైజ్మాన్ పరిశోధనలు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ రూపాంతరంతోనే కరోనా వైరస్ ప్రమాదం తొలగిపోలేదని.. భవిష్యత్‌లో ఈ వైరస్ రూపాంతరాలు విరుచుకుపడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో టీకాలను అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశం లేనంత వేగంగా వైరస్లు పుట్టుకురావచ్చని.. దీన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎంఆర్ఎన్ఏ సురక్షితం.. ఎంఆర్ఎన్ఏ సాయంతో టీకా అభివృద్ధి చేసిన క్రమాన్ని వైజ్మాన్ ఈ సందర్భంగా వివరించారు. సాధారణ పరిస్థితుల్లో ఆర్ఎన్ఏను శరీరంలోకి ఎక్కిస్తే అది కణజాలాన్ని దెబ్బతీస్తుందన్నారు. అందుకే తాము వాటిల్లో మార్పులు చేయడమే కాకుండా.. నానోస్థాయి కొవ్వుకణాల్లో బంధించి టీకాగా ఉపయోగించేలా చేశామని తెలిపారు. ఎంఆర్ఎన్ఏ టీకా వేగంగా పనిచేస్తుందని, సురక్షితమైందని, డీఎన్ఏను మారుస్తుందన్న అపోహల్లోనూ వాస్తవం లేదని వివరించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా కంపెనీలు తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకాలను వంద కోట్ల మంది తీసుకున్నారని, ఎలాంటి దుష్ఫలితాలూ దాదాపు కనిపించలేదని తెలిపారు. అన్ని రూపాంతరాలకూ ఒకే వ్యాక్సిన్... కరోనా వైరస్ రూపాంతరం చెందడం సహజమని, అల్ఫాతో మొదలై ఒమిక్రాన్ వరకూ ఇది పలు రూపాలు సంతరించుకుందని వైజ్మాన్ గుర్తు చేశారు. అయితే వైరస్ తన రూపం మార్చుకున్న ప్రతిసారీ టీకాలు అభివృద్ధి చేయడం అసాధ్యం... అందుకే తాము ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా అన్ని రకాల కరోనా రూపాంతరాలపై పనిచేసే టీకాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొన్ని టీకాల అభివృద్ధి ఇప్పటికే జరుగుతోందని ప్రాథమిక ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయని చెప్పారు. 20 ఏళ్లలో కరోనా మూడుసార్లు (సార్స్, మెర్స్, కోవిడ్ కారక సార్స్–కోవ్–2) మానవాళిపై దాడి చేసిందని, భవిష్యత్‌లోనూ మరో రూపంలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇతర వ్యాధులకు కూడా... ఆర్ఎన్ఏ అనేది సంక్లిష్టమైన పరమాణువు అయినా తయారీ చాలా సులువు అని డాక్టర్ వైజ్మాన్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని వాడేందుకయ్యే ఖర్చు కూడా తక్కువని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్ఎన్ఏ టీకాలు కరోనాకు మాత్రమే కాదు.. అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగించవచ్చు. హెచ్ఐవీ మొదలుకొని మలేరియా, ఇన్ఫ్లుయెంజా, హెచ్ఎస్వీ, హెచ్‌సీవీ వ్యాధులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఫుడ్ అలె ర్జీలు, కేన్సర్ వ్యాక్సిన్లు, మధుమేహం, కీళ్లవాతం వంటి వ్యాధుల చికిత్సలోనూ ఈ ఆర్ఎన్ఏను వాడవచ్చని.. ఈ దిశగానూ తాము పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. గుండెపోటు వంటి సమస్యలకు, శరీరంలో మంట/వాపులను తగ్గించేందుకు కూడా ఆర్ఎన్ఏ టెక్నాలజీని వాడవచ్చని చెప్పారు. ‘ఆర్ఎన్ఏ టెక్నాలజీని జన్యుచికిత్సలకూ వాడవచ్చన్నది నా అతిపెద్ద నమ్మకం. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికెల్ సెల్ అనీమియా వంటి వ్యాధులకు ఒక్క ఎంఆర్ఎన్ఏ ఇంజెక్షన్ ద్వారానే చికిత్స అందించే స్థితి వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు. -
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మహమ్మారి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం వర్చువల్ పద్ధతిలో మొదలైన 19వ బయో ఆసియా సదస్సులో బిల్‌గేట్స్, తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండేళ్ల కరోనా మహమ్మారి మనిషికి నేర్పించిన పాఠాలు ఏవని ప్రశ్నించగా గేట్స్ స్పందిస్తూ వ్యాక్సిన్లను అత్యంత వేగంగా తయారు చేయగలగడం మ నిషి సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. అ లాగే ఆక్సిజన్ కొరత విసిరిన సవాళ్లనూ సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. అంతర్జాతీయ సహకారంతో భారత్ టీకాలను వేగంగా తయారు చేసింద ని, ప్రజలందరికీ ఈ టీకాలను అందించే విషయంలో ధనిక దేశాలకంటే మెరుగ్గా వ్యవహరించిం దని కొనియాడారు. టీకాల సమర్థ పంపిణీతో ఎ న్నో విలువైన ప్రాణాలను కాపాడగలిగిందన్నారు. సిద్ధంగా ఉండాలి.... భవిష్యత్తులోనూ కరోనా లాంటి మహమ్మారులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు మానవాళి సంసిద్ధంగా ఉండాలని గేట్స్ ఆకాంక్షించారు. మెరుగైన వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో రాగల మహమ్మారి గురించి గేట్స్ 2015లోనే అంచనా వేయడాన్ని కేటీఆర్ ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కరోనా మాదిరిగా ఏళ్లపాటు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధనలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని కోరారు. జీవశాస్త్రంలో మనిషి ఊహించని స్థాయిలో ఆవిష్కరణలు జరగనున్నాయని, అవి భవిష్యత్ సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయని అన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏదే భవిష్యత్తు... హెచ్ఐవీ మొదలు అనేక ఇతర వ్యాధులకు చికిత్స అందించే సామర్థ్యంగల ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీదే భవిష్యత్తు అని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎంఆర్ఎన్ఏ సాం కేతికత అందర్నీ ఆశ్చర్యపరిచిందన్నారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గేట్స్ ఫౌండేషన్ ప్రయత్నాలు ము మ్మరం చేసిందని చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో చవకైన మందులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారతీయ కంపెనీలతోనూ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసు కున్నట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఐవీతోపాటు అనేక వ్యాధులకు రానున్న 10–15 ఏళ్లలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో సెన్సార్లు కృత్రిమ మేధ సా యంతో పనిచేసే పరికరాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయన్నారు. హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తారన్న కేటీఆర్ ప్రశ్నకు కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేశాక ఆసియాలో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. -
బయో ఆసియా సదస్సుకు బిల్‌గేట్స్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న ప్రారంభం కానున్న రెండ్రోజుల బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వార్షిక సదస్సు ‘బయో ఆసియా’లో బిల్ మెలిండా గేట్స్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్సీ్క, మెడ్ ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. బిల్ గేట్స్, అలెక్స్ గోర్సీ్క, జెఫ్‌మార్తా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నడుమ సాగే ఇష్టాగోష్టిలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, విశ్వవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందిపుచ్చుకోవాల్సిన సామర్థ్యాలు, ప్రభుత్వం, పరిశ్రమలు పోషించాల్సిన పాత్రపై మాట్లాడతారు. కోవిడ్ ప్రభావం, సప్లై చైన్‌లో అంతరాయం, ఆవిష్కరణల వాతావరణం, స్టార్టప్‌లు, ఆరోగ్య రక్షణ రంగంలో ఏఐ, ఎమ్ఎల్, డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత పాత్రపై జాన్సన్ అండ్ జాన్సన్ సీఈవో అలెక్స్ గోర్సీ్క కీలక ప్రసంగం చేయనున్నారు. మెడ్ టెక్ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, మెడ్ టెక్ రంగం అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలపై మెడ్ ట్రానిక్స్ సీఈఓ జెఫ్‌మార్తా ప్రసంగిస్తారు. 72 దేశాల నుంచి 31 వేల మంది.. ‘ఆరోగ్య రక్షణ రంగంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతీసారి జరిగే బయో ఏషియా సదస్సు సంబం ధిత రంగాలకు చెందిన వారిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తోంది. 2022 సదస్సు కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది. బిల్‌గేట్స్, గోర్సీ్క, మార్తా వంటి దూరదృష్టి కలిగిన వారు సదస్సులో పాల్గొనడం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు మేలు చేస్తుంది ’ మంత్రి కేటీ రామారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. 72 దేశాలకు చెందిన 31 వేల మంది ప్రతినిధులు వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొంటున్నారని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ అంతర్జాతీయ వేదిక భారతీయ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. -
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏసియా 19వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్ రెడీ’ నినాదంతో జరిగే ఈ సదస్సు లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్ కంపెనీలు, బయోటెక్ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషి స్తారు. నోబెల్ గ్రహీతలు డాక్టర్ కుర్ట్ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్ జుర్ హుస్సేన్, బారీ మార్షల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు హాజరుకానున్నారు. -
చికిత్సలపై పరిశోధనలకు ప్రపంచస్థాయి కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : వైద్యం తీరుతెన్నులు మారిపోతున్న ఈ ఆధునిక కాలానికి తగ్గ చికిత్స విధానాలపై పరిశోధనలు చేసే ఓ అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కణ, జన్యుస్థాయి చికిత్సలపై పరిశోధనలు చేపట్టే ఈ సంస్థను నిర్మించడంలో ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయం తీసుకోనున్నట్లు సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన బయోఆసియా సదస్సులో తెలిపారు. ఈ సంస్థ భారతీయులకు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే పరిమితమైన వ్యాధుల చికిత్సకు ప్రాధాన్యమిస్తుందని, కణ, జన్యుస్థాయి చికిత్సలను వీలైనంత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోందని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, కార్ల్ జూన్, స్విట్జర్లాండ్ రాయబారి ఆండ్రియాస్ బావుమ్, జయేశ్ రంజన్, వివిధ దేశాల ప్రతినిధులు జీవశాస్త్ర రంగాలకు రాజధాని.. హైదరాబాద్ నగరం జీవశాస్త్ర రంగాలకు దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారిందని, బయో ఆసియా వంటి సదస్సులు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయని మంత్రి కేటీఆర్ వివరించారు. సుమారు 37 దేశాల నుంచి 2 వేల మంది సభ్యులు ఈ సదస్సులో పాల్గొనడం విశేషమన్నారు. దేశవ్యాప్త ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 35 శాతం కంటే ఎక్కువని, 800కుపైగా ఫార్మా, బయోటెక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జీవశాస్త్ర రంగ కంపెనీల విలువ ఇప్పటికే 5 వేల కోట్ల డాలర్లుగా ఉంటే రానున్న పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు, కొత్తగా నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు అనువుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. లైఫ్ సైన్సెస్ గ్రిడ్ పేరుతో ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారం జినోమ్ వ్యాలీ విస్తరణతో జీవశాస్త్ర రంగ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఇప్పటికే కనీసం 20 కంపెనీలు పనిచేయడం మొదలుపెట్టాయని, సహజానంద్ మెడికల్ డివైజెస్ కంపెనీ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన వివరించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబం«ధించి రంగం సిద్ధమైందని, పర్యావరణ అనుమతులు కూడా లభించాయని చెప్పారు. బయోకాన్ సంస్థ పరిశోధన విభాగం సిన్‌జీన్ హైదరాబాద్‌లో రూ.170 కోట్లతో కేంద్రాన్ని, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఇక్కడ ఓ కేంద్రం ఏర్పాటు చేయడం జీవశాస్త్ర రంగం కేంద్ర బిందువుగా హైదరాబాద్ స్థాయిని పెంచేవేనని పేర్కొన్నారు. కార్ల్ జూన్‌కు ఎక్సలెన్సీ అవార్డు.. శరీర రోగ నిరోధక కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా కేన్సర్‌కు చికిత్స అందించే ఇమ్యూనోథెరపీని అభివృద్ధి చేసిన అమెరికన్ శాస్త్రవేత్త, పెన్సిల్వేనియా యూనిర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్ జూన్‌కు ఈ ఏడాది బయో ఆసియా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. జీవశాస్త్ర రంగంలో విశేష కృషి జరిపిన వారికి ఈ అవార్డు ఇస్తారు. రోగ నిరోధక కణాలనే కేన్సర్‌కు చికిత్స అందించొచ్చని తాము ముందు అనుకోలేదని కార్ల్ జూన్ తెలిపారు. అయితే 2010లో ఒక రోగితో మొదలైన ఈ ఇమ్యూనోథెరపీ విధానం రెండేళ్ల తర్వాత ముగ్గురికి విస్తరించిందని, ఆ తర్వాత 2017లో ఈ చికిత్స విధానానికి ఎఫ్‌డీఏ అనుమతులు లభించాయని, ప్రస్తుతం దీన్ని చాలా కేన్సర్ల చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజన్, బయోఆసియా సీఈవో శక్తి నాగప్పన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ బోర్డు సలహాదారు ప్రొఫెసర్ బాలసుబ్రమణ్యన్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు..
2013- రాష్ట్రీయం మెరుగైన ఈ-పాలనకు నెలవైన రాష్ట్రం 2013లో ప్రధాన సదస్సులకు వేదికగా నిలిచింది. పదో బయో ఆసియా సదస్సుతో పాటు తూర్పు ఆసియా, పసిఫిక్, దక్షిణాసియాల పర్యాటక సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది! రాష్ట్రంలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) డెరైక్టర్‌గా మలపాక యజ్ఞేశ్వర సత్యప్రసాద్ (ఎం.వై.ఎస్. ప్రసాద్) జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1953లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1975లో ఇస్రోలో చేరారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు. పులికాట్ సరస్సుకు అధిక సంఖ్యలో వలస వచ్చే ఫ్లెమింగో పక్షుల ప్రాధాన్యతను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహించింది. గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ నుంచి ఈ పక్షులు వేలాదిగా వలస వస్తాయి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధి కోఠివారి అగ్రహారానికి చెందిన గరిమెళ్ల మైథిలి అంతర్జాతీయ స్థాయి మహిళా రైతు అవార్డుకు ఎంపికయ్యారు. సేద్యంలో ‘విస్తరణ వ్యూహాలు, జీవన విధానం పెంపుదల’ అంశం ఆధారంగా మైథిలిని నాగపూర్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు జనవరి 28 నుంచి 30 వరకు జరిగింది. ఇందులో 45 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ రంగంలో అత్యున్నత కృషి చేసిన వారికి ఏటా ఇచ్చే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులను కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.కె.భాన్, ఫైజర్ ఫార్మా కంపెనీకి చెందిన ఫ్రీడా లూయిస్లకు ప్రదానం చేశారు. ఉపాధి హామీ చట్టంపై ఎనిమిదో జాతీయ సదస్సును ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సామాజిక సమానత్వాన్ని పెంపొందించినందుకుగాను విశాఖ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ-పాలనలో రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘వినియోగదారుల ప్రయోజనార్థం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)ని ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మకంగా ఉపయోగించడం’ అనే కేటగిరీలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్‌కు చెందిన ఈపీఐఎంఆర్‌ఎస్ ఐటీ విభాగానికి రజతం, ‘ఎగ్జెంప్లరీ రీ యూజ్ ఆఫ్ ఐసీటీ బేస్డ్ సొల్యూషన్స్’ కేటగిరీలో గురుకుల విద్యాసంస్థల్లో ఐటీ సేవలకుగాను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కాంస్య పతకాలు లభించాయి. హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్)కు ‘బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి న్యూయార్క్‌లో జరిగిన ఆరో వార్షిక ‘గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్’ కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 28న అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల నుంచి హెచ్‌ఎంఆర్‌ను గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఎంపిక చేసింది. 2013-14 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్చి 18న శాసనసభకు సమర్పించారు. వివరాలు.. బడ్జెట్ మొత్తం: రూ. 1,61,348 కోట్లు. ప్రణాళికేతర వ్యయం: రూ. 1,01,926 కోట్లు ప్రణాళికా వ్యయం: రూ. 59,422 కోట్లు ద్రవ్యలోటు: రూ. 24,487 కోట్లు రెవెన్యూ రాబడి: రూ.1,27,772.19 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.1,26,749.41 కోట్లు మొత్తం అప్పులు: రూ.1,79,637కోట్లు వ్యవసాయానికి కార్యాచరణ ప్రణాళిక:రాష్ట్రంలో తొలిసారి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ శాసనసభకు సమర్పించారు. వివరాలు.. కార్యాచరణ ప్రణాళిక వ్యయం: రూ.98,940.54 కోట్లు ఉచిత విద్యుత్: రూ.3,621.99 కోట్లు సహకార శాఖ: రూ. 197.40 కోట్లు రైతులకు రుణాలు: రూ.59,918 కోట్లు భారతీయ ఫార్మా రంగానికి అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు తెచ్చిన ఔషధ రంగ దిగ్గజం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కల్లం అంజి రెడ్డి (72) కేన్సర్ వ్యాధితో మార్చి 15న హైదరాబాద్‌లో కన్నుమూశారు. అంజిరెడ్డి 1984లో హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2011) అవార్డులతో సత్కరించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 1941, మే 27న అంజిరెడ్డి జన్మించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) పేరును రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి రాష్ర్ట పోలీస్ అకాడమీ (ఆర్బీవీఆర్ రెడ్డి అప్పా)గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరామిరెడ్డి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షిస్తూ, భావితరాలకు అందించేందుకుగాను ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల మేరకు 2013ను ‘తెలుగు భాష, సాంస్కృతిక వికాస సంవత్సరం’గా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 14న సాంస్కృతికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాలను కేంద్ర పర్యాటక శాఖ మార్చి 12న ప్రకటించింది. మొత్తం 36 విభాగాల్లో 87 అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను మార్చి 18న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. అందులో మన రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభించాయి. వివరాలు: సమగ్ర పర్యాటకరంగ అభివృద్ధి (రెస్ట్ ఆఫ్ ఇండియా విభాగంలో) - ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది; ఉత్తమ వారసత్వ నగరం - వరంగల్; ఉత్తమ విమానాశ్రయం (‘క్లాస్ టెన్ సిటీ’ విభాగంలో)- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్); ఉత్తమ విమానాశ్రయం (రెస్ట్ ఆఫ్ ఇండియా)-విశాఖపట్నం ఎయిర్‌పోర్టు;‘మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు-అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్; ఉత్తమ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్- హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్; బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ డెస్టినేషన్ కేటగిరీ ‘ఎ’ సిటీ - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య, సంగీత, లలితకళా అకాడమీలను పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష సంస్కృతి, నృత్యం, కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్ల భాషలను తప్పనిసరిగా చదివేలా ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు ఆసియా, పసిఫిక్, దక్షిణ ఆసియాల 25వ పర్యాటక సమావేశాలు హైదరాబాద్‌లో ఏప్రిల్ 11 నుంచి మూడు రోజులు జరిగాయి. 21 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఈ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా యూఎన్‌డబ్ల్యూటీవో సుస్థిర పర్యాటక అభివృద్ధి సమావేశం కూడా జరిగింది. తూర్పు, పసిఫిక్, దక్షిణాసియాల తదుపరి పర్యాటక సమావేశం ఫిలిప్పీన్స్‌లో, యూఎన్‌డబ్ల్యూటీవో సమావేశాన్ని 2015లో కాంబోడియాలో జరిపేందుకు నిర్ణయించారు. ఆడపిల్లల చదువును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘బంగారు తల్లి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డిలో ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు జననం నమోదైనప్పటి నుంచి కాలేజీ చదువు వరకూ ఏటా ప్రోత్సాహకాలను అందిస్తారు. మధ్యలో బడి ఆపకుండా చదివే అమ్మాయికి కాలేజీ చదువుల వరకూ మొత్తం రూ. 55,500 ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 18 ఏళ్ల వరకు వివాహం చేసుకోకుండా 12వ తరగతి పూర్తి చేసిన ఆడపిల్లలకు రూ. 50,000, డిగ్రీ పూర్తిచేస్తే మరో రూ. 50,000 బహుమతిగా ఇస్తారు. ఈ ప్రోత్సాహకాలు ఇప్పటివరకు ఆడపిల్లలకు కల్పిస్తున్న ప్రయోజనాలకు అదనంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు రాష్ర్ట జనాభా 8,45,80,777. 2001 లెక్కలతో పోల్చితే రాష్ర్ట జనాభా 11శాతం పెరిగింది. ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు. గ్రామీణ జనాభా 5,63,61,702. పట్టణ జనాభా 2,82,19,075. అత్యధిక జనాభా ఉన్న జిల్లా-రంగారెడ్డి (27,41,239). అత్యల్ప జనాభా ఉన్న జిల్లా- విజయనగరం (23,44,474). స్త్రీ, పురుష నిష్పత్తి: 992/1000. ఆరేళ్లలోపు పిల్లల్లో లింగ నిష్పత్తి- 939/1000. జన సాంద్రత: 307. అక్షరాస్యత- 67.02 శాతం (మహిళలు 59.15 శాతం, పురుషులు-74.88 శాతం). అక్షరాస్యతలో ప్రథమ స్థానం హైదరాబాద్ (75.87 శాతం). చివరి స్థానం మహబూబ్‌నగర్- 55.04 శాతం. రాష్ర్టంలో ఎస్టీలు- 6.59 శాతం.రాష్ర్టంలో ఎస్సీలు- 16.41 శాతం. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా పేరును ‘అనంతపురం’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న నిర్ణయించింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత జాతీయ పురస్కారం ‘నేషనల్ ఆర్థర్’ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి లభించింది. మరో ఆరుగురు భారత సంతతి వ్యక్తులతో కలుపుకొని 38 మంది దేశ, విదేశీయులకు కూడా ఈ అవార్డును బహూకరించారు. ఈ సత్కారాన్ని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం ఏప్రిల్ 27న ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ ప్రదానం చేశారు. దౌత్యవేత్త అయిన శ్రీనివాసులు రెడ్డి 1963 నుంచి జాతివివక్ష వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్థాయీ సంఘాలకు చైర్మన్లను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ 24న ప్రకటించారు. మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి చైర్మన్లుగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తొమ్మిది మందిని, ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి ముగ్గురిని నియమించారు. రాష్ర్ట శాసనసభ, శాసనమండలిలోని మొత్తం సభ్యులు ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ప్రతి సంఘంలో 31 మంది సభ్యులుగా ఉంటారు. బడ్జెట్లో శాఖల వారీగా జరిపిన కేటాయింపులపై స్థాయీ సంఘాలు సమగ్రంగా చర్చించి నివేదికలను రూపొందిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్‌ను మే 4న ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌కు రాష్ట్ర హోంమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రజా భద్రతా పర్యవేక్షణ, వ్యవస్థలో లోపాలను తొలగించడం వంటి విధులను ఈ కమిషన్ నిర్వర్తిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తుంది. పోలీసుల ఉత్తమ పనితీరుకు, వ్యవస్థాపరమైన లక్ష్యాలకు సంబంధించి ముందస్తు చర్యలకు సలహాలివ్వడం, పోలీసుల వృత్తి పరమైన విధానాలకు సంబంధించి కూడా ఈ కమిటీ సూచనలిస్తుంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లో భారీ ఓడరేవుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ఓడరేవుల నిర్మాణానికి రూ. 15,820 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 5.40 కోట్ల టన్నుల నిర్వహణ సామర్థ్యంగల ఓడరేవును నిర్మిస్తారు. దీనికి రూ. 8 వేల కోట్ల మేర పెట్టుబడులు అవసరం. ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే, కేంద్రం దుగరాజపట్నంపై మొగ్గుచూపింది. ప్రపంచంలో టాప్-100 ప్రతిభావంతులైన వైద్య నిపుణుల జాబితాలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు ఎంఎస్ గౌడ్‌కు చోటు లభించింది. భారత్ నుంచి జాబితాలో ఆయన ఒక్కరికే స్థానం దక్కింది. ఇంగ్లండ్‌లోని ‘కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్’ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. మెదక్ పట్టణానికి చెందిన ఎంఎస్ గౌడ్ దాదాపు 40 ఏళ్లుగా దంత వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలో పర్యావరణ నిర్వహణ సూచీ (ఈపీఐ)- 2012లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. నాణ్యమైన గాలి; నీరు, అటవీ సంరక్షణకు; చెత్త నిర్వహణకు అత్యుత్తమ పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌కు ఈ గుర్తింపు లభించింది. జాబితాలో సిక్కిం రెండో స్థానంలో నిలవగా హిమాచల్‌ప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. హర్యానా (27), బీహార్ (30) స్థానంలో నిలిచాయి. చివరిస్థానం (35) లో లక్షద్వీప్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా (కె.జి. సేన్‌గుప్తా) నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మే 21న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తాతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. జస్టిస్ సేన్‌గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్వర్క్స్.. ‘గూగుల్ ఇండియా’తో ఓ అవగాహన ఒప్పందంపై మే 14న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద ఇంజనీరింగ్ విద్యార్థులకు, బోధకులకు గూగుల్ శిక్షణ ఇస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గూగుల్ సంస్థ ప్రతినిధి నెల్సన్ మట్టోస్ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. గూగుల్.. దేశంలో విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ఆధునిక టెక్నాలజీల్లో గూగుల్ శిక్షణ ఇస్తుంది. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన అబిద్ రసూల్‌ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా డాక్టర్ పెరుమాళ్లపల్లి నేతాజీ సుభాష్ చంద్రబోస్ (గుంటూరు) నియమితులయ్యారు. సభ్యులుగా సయ్యద్ మఖ్బూల్ హుస్సేన్ బాషా (వైఎస్సార్ జిల్లా), డాక్టర్ హసన్ ఖురాతులేన్ (హైదరాబాద్), ప్రభా ఎలిజబెత్ జోసెఫ్ (తూర్పుగోదావరి), సర్దార్ సర్జీత్సింగ్ (రంగారెడ్డి), గౌతమ్‌జైన్ (హైదరాబాద్)లను నియమించినట్లు మే 16న ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కమిషన్ మూడేళ్లపాటు పనిచేస్తుంది. పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి వివిధ కేటగిరీల రిజర్వేషన్ శాతాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేస్తారు. జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రామపంచాయతీలైతే ఎస్టీలకు 6.28 శాతం, ఎస్సీలకు 19.43 శాతం, బీసీలకు 34 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తారు. మండల పరిషత్‌లైతే ఎస్టీలకు 6.99 శాతం, ఎస్సీలకు 19.32 శాతం, జిల్లా పరిషత్‌లైతే ఎస్టీలకు 9.15 శాతం, ఎస్సీలకు 18.88 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మిగిలిన స్థానాలు జనరల్ కేటగిరీకి ఉద్దేశించినవి. ఈ నాలుగు కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. శాంతి సమయంలో ధైర్యసాహసాలకిచ్చే రెండో అత్యున్నత అవార్డు అశోక్ చక్ర మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ప్రసాద్ బాబుకు దక్కింది. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. మరో ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. ఇవే కాకుండా 10 సౌర్య చక్ర అవార్డులతోపాటు మొత్తం 43 గ్యాలెంటరీ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్‌లో దాదాపు రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఇందులో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) సంస్థల ఏర్పాటుకు రూ. 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ సంస్థల ఏర్పాటుకు 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉంటాయి. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 56 లక్షల మందికి ఐటీఐఆర్ ఉపాధి కల్పిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్ర మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్‌గా 1981 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వి. భాస్కర్ సెప్టెంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అవార్డు లభించింది. చైనాలోని షాంఘైలో సెప్టెంబర్ 23న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ సదస్సులో ఆ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ హెన్రీ కోహెన్ బహూకరించారు. ఈ అంతర్జాతీయ అవార్డును ప్రతి నాలుగేళ్లకొకసారి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు నాగేశ్వర్‌రెడ్డి. ప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ (87) అక్టోబర్ 18న హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరులో 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ 17వ ఏట నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. అచ్చు అయిన తొలి కథ విమల. దాదాపు 43 పిల్లల కథలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలను రాశారు. 2012 సంవత్సరానికి ఆయన రాసిన నవల పాకుడురాళ్లుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు- 2013 హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి నవంబర్ 4న దీన్ని ప్రారంభించారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం (డబ్ల్యూఏఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు రోజులపాటు సదస్సును నిర్వహించింది. సుస్థిర భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, సన్నకారు రైతులపై దృష్టి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. దేశ, విదేశాల నుంచి 400 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. 2050 నాటికి 1000 కోట్ల జనాభాకు ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యవసాయేతర ఆదాయాలవైపునకు మళ్లుతున్నవారిని అడ్డుకునేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూరించాలని డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ బోల్గర్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదలైన క్షణం నుంచి జనంతో మమేకమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో పోరు బాట పట్టారు. మూడో అధికరణాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తున్నందున దాన్ని సవరించాలనే డిమాండ్‌తో జాతి యావత్తు దృష్టినీ ఆకర్షించారు. ఈ క్రమంలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు హైడెఫినిషన్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (ఏపీస్వాన్) ద్వారా అనుసంధానం చేసే ఈ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీంతో ఇటువంటి సౌకర్యం గల మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ వ్యవస్థ రాష్ట్ర రాజధానిని 23 జిల్లాలు, 1126 మండల కార్యాలయాలతో అనుసంధానం చేస్తుంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో రూ. 1200 కోట్లతో పెప్సికో సంస్థ ఏర్పాటుచేసే శీతల పానీయాల పరిశ్రమకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 21న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సంతరించుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీకాకుళంలో కాట్రగడ్డ వద్ద వంశధార నది నీటిని వాడుకొనేందుకు మళ్లింపు కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు వంశధార ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈ అడ్డుగోడ (సైడ్ వీయర్) నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఒడిశా చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ డిసెంబర్ 17న తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల 50 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలవుతుంది.