సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏసియా 19వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్ రెడీ’ నినాదంతో జరిగే ఈ సదస్సు లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్ కంపెనీలు, బయోటెక్ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషి స్తారు. నోబెల్ గ్రహీతలు డాక్టర్ కుర్ట్ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్ జుర్ హుస్సేన్, బారీ మార్షల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment