టోల్ ట్యాక్స్ అడిగితే కాల్చి పారేస్తా! | Toll booth employee threatened in Ajmer | Sakshi
Sakshi News home page

టోల్ ట్యాక్స్ అడిగితే కాల్చి పారేస్తా!

Published Wed, May 25 2016 2:41 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

టోల్ ట్యాక్స్ అడిగితే కాల్చి పారేస్తా! - Sakshi

టోల్ ట్యాక్స్ అడిగితే కాల్చి పారేస్తా!

టోల్ గేట్ వద్ద పనిచేయడానికి ఉద్యోగులు, అధికారులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

జైపూర్: టోల్ గేట్ వద్ద పనిచేయడానికి ఉద్యోగులు, అధికారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. తాజా సంఘటనలు చూస్తే నిజమే అనిపించక మానదు. ఇటీవలే గుర్గావ్ లో టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఓ బస్సు డ్రైవర్ ఏకంగా వ్యక్తినే ఢీకొట్టడానికి వెనుకాడలేదన్న విషయం తెలిసిందే. గుర్గావ్లోని ఖేర్కీధౌలా టోల్‌ప్లాజా దగ్గర టోల్ టాక్స్ రూ.60 కట్టడానికి ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నిరాకరించాడు. అడ్డు వచ్చిన టోల్ మేనేజర్ను ఢీకొట్టాలని  ప్రయత్నించగా అతడు వెంటనే పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ విషయాన్ని మరవకముందే అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

టోల్ ప్లాజా సూపర్ వైజర్ అజ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సర్వార్ రోడ్ దారిలో వెళ్తున్న ఓ వాహనం టోల్ ప్లాజా దగ్గరకు రాగానే సూపర్ వైజర్ అంకిత్ మీనా టోల్ ట్యాక్స్ చెల్లించాలని అడుగుతుండగా ధన్ సింగ్ అనే వ్యక్తి తన డ్రైవర్ తో కలిసి గన్ చూపించి కాల్చుతానంటూ ఆయనను బెదిరించారు. ఈ విషయంపై అంకిత్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు గతంలో టోల్ ప్లాజాలో పనిచేసిన మరో వ్యక్తి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీటీవీ లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement