డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 15 వరకూ పాత నోట్లు వాడుకోవచ్చని గతవారం ప్రభుత్వం పేర్కొన్నా... కొన్ని చోట్ల ఈ సౌకర్యం దుర్వినియోగం అవుతోందన్న వార్తల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది.