Jayacandra
-
ఇక పాత నోట్లకు పెట్రోల్ నో
-
ఇక పాత నోట్లకు పెట్రోల్ నో
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో రూ. 500 నోట్లు చెల్లవు ► మిగతా అనుమతించిన సేవలకు వాడుకోవచ్చన్న కేంద్రం ► నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు ► రూ. 200 మించితేనే పాత 500 నోటుకు అనుమతి న్యూఢిల్లీ: డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 15 వరకూ పాత నోట్లు వాడుకోవచ్చని గతవారం ప్రభుత్వం పేర్కొన్నా... కొన్ని చోట్ల ఈ సౌకర్యం దుర్వినియోగం అవుతోందన్న వార్తల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అన్ని టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లు(పీవోఎస్)లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులతో టోల్ చెల్లించవచ్చని, టోల్ రూ. 200 కంటే ఎక్కువుంటే పాత రూ. 500 నోటును అనుమతిస్తారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌స(ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొనుగోలు చేసి టోల్ చెల్లించవచ్చని, నగదు చెల్లింపులు చేసేవారు... ఆలస్యం కాకుండా చిల్లర దగ్గర పెట్టుకోవాలని సూచించింది. టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 15 అర్ధరాత్రి వరకూ పాత 500 నోట్లు తీసుకుంటారని, పాస్టాగ్స కొనుగోలుకు, 200 కంటే టోల్ ఎక్కువుంటేనే పాత 500 నోట్లను స్వీకరిస్తారని తెలిపింది. ఫాస్టాగ్‌స వాడితే టోల్ ఫీజు నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇస్తారని, ఈ వాలెట్ల ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని పేర్కొంది. ఆయిల్, గ్యాస్ కంపెనీలు డిజిటల్ చెల్లింపులకు విసృ్తత ఏర్పాట్లు చేశాయని, అందుకే పెట్రోల్ బంకుల్ని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది. ఎల్పీజీ సిలిండర్లకు మాత్రం పాత 500 నోట్లు తీసుకుంటారని కేంద్రం స్పష్టం చేసింది. 90 శాతం ఏటీఎంల్లో మార్పులు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2 లక్షలకుపైగా ఏటీఎంల్లో 90 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని ఏటీఎం తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్స ఎండీ తెలిపారు. నవంబర్ 30 లోపు అన్ని ఏటీఎంల్లో మార్పులు పూర్తయ్యేలా ఆర్బీఐ నియమించిన టాస్క్‌ఫోర్స్‌కు గడువునిచ్చారని, 1.80 లక్షల ఏటీఎంల్లో కొత్త 2 వేలు, 5 వందల నోట్లు వచ్చేలా మార్పులు పూర్తయ్యాయని చెప్పారు. నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తల విషయంలో బ్యాంకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. జీతం కోసం క్యూలో అష్టకష్టాలు ఉద్యోగులు, కార్మికులు జీతాల కోసం గురువారం బ్యాంకుల ముందు భారీ క్యూలతో తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే నగదుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని బ్యాంకులు చెప్పినా వాస్తవంగా ఆ పరిస్థితులు కన్పించలేదు. వారానికి రూ. 24 వేలు విత్‌డ్రా పరిమితి ఉన్నా ఒక వ్యక్తికి కేవలం రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రాకు అనుమతించారు. మరికొన్ని చోట్ల రూ. 10 వేలు, రూ. 12 వేల చొప్పున విత్‌డ్రా సౌకర్యం కల్పించారు. ఇక దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ఏటీఎంలు నగదు లేక మూతబడ్డాయి. దాదాపు 90 % ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. పనిచేసిన ఏటీఎంల్లో ఎక్కువ శాతం రూ. 2 వేల నోట్లే వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదు: జైట్లీ నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందన్న భయాల్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ బిల్లు ప్రస్తుత విధానాల్ని పూర్తిగా మార్చేస్తాయని ఆయన పేర్కొన్నారు. జీడీపీ పరిమాణం గణనీయ స్థాయిలో పెరుగుతుందని భువనేశ్వర్‌లో నిర్వహించిన మేకిన్ ఒడిశా సదస్సు సందర్భంగా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఆర్థిక పరిస్థితి సమీక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్, ఇతర ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్ని పిలవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. జనవరిలో ఈ భేటీ ఉంటుందని కమిటీ ఛైర్మన్ థామస్ చెప్పారు. బెంగళూరులో రూ. 6 కోట్ల స్వాధీనం బెంగళూరులో ఐటీ అధికారులు ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారి జయచంద్ర ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2వేలు, రూ.500 కొత్త నోట్ల కట్టలే ఎక్కువగా ఉన్నాయని, వాటి విలువ రూ.4.7 కోట్లు ఉండొచ్చని తెలిసింది. జయచంద్ర స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. దాదాపు 14 కిలోల బంగారు, వెండి నగలు, వస్తువులతో పాటు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. -
పట్టణ, నగరాల్లోని కబ్జాదారులపై నిఘా
సాక్షి ,బెంగళూరు : మొదట పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వారి నుంచి తిరిగి భూములను స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అందులో భాగంగా మొదట బెంగళూరులో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన శనివారం మాట్లాడారు. ప్రత్యేక న్యాయస్థానంలో కేసుల విచారణకు న్యాయమూర్తికు ఇద్దరు ఐఏఎస్ స్థాయి అధికారులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు సహకరిస్తారన్నారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పేదలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడతామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి న్యాయస్థానాల వద్ద ఎనిమిది వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో ఆక్రమణలకు సంబంధించి మరో 10 వేల కేసులు న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బగర్‌హుకుం భూముల సాగుకు ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పేద రైతులకు ముఖ్యంగా బగర్‌హుకుం భూముల సాగు చేసుకుటున్న వారికి నూతన చట్టం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. జిల్లా, తాలూకా స్థాయి కార్యాలయాల్లో చాలా కాలంగా పెండింగ్‌లోఉన్న ఫైల్స్‌ను పూర్తి చేసే పనిని నవంబర్ ఒకటో తేదీ నుంచి 30 రోజుల పాటు చేపట్టనున్నామని తెలిపారు. ‘సకాల’ ప్రాజెక్టు కింద నిర్ధిష్ట సమయంలోపు పనులు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కృత్రిమ పాలు విక్రయిస్తే జైలుకే...
మంత్రి జయచంద్ర హెచ్చరిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కృత్రిమ పాలను ఉత్పత్తి చేసే వారికి జైలు శిక్ష విధించడానికి చట్టాన్ని తీసుకు రానున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాకు తుది రూపునిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ గుండె దినం సందర్భంగా కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) సోమవారం నగరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులను సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.... రాష్ట్ర సరిహద్దుల్లో రసాయనాలతో కూడిన పాలను తయారు చేసి, అమ్ముతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఆరోగ్య, పశు సంవర్ధక శాఖలు సంయుక్తంగా నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై కార్యాచారణ చేపట్టినప్పటికీ పూర్తిగా నియంత్రించడానికి సాధ్యం కావడం లేదన్నారు. ఇలాంటి కృత్రిమ పాలను ఉత్పత్తి చేస్తున్న వారిని జైలుకు పంపాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కాగా శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం కనుక, దీనిపై కేఎంఎఫ్ అవగాహన కల్పిస్తోందన్నారు. పుట్టిన మూడు నెలలకే గుండె జబ్బులు వస్తుండడం ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. రాష్ర్టంలో వైద్యుల కొరత ఉందని, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తరచూ దాడులు జరుగుతుండడంతో గ్రామాలకు వెళ్లడానికి వైద్యులు జంకుతున్నారని ఆయన తెలిపారు. కాగా జయదేవ గుండె ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సీఎన్. మంజునాథ్ సన్మానం అందుకుని మాట్లాడుతూ ఇటీవల విటమిన్ డీ కొరత ఎక్కువగా కనిపిస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు పాలలో ఆ విటమిన్‌ను కలపాల్సిందిగా కేఎంఎఫ్‌కు సూచించారని చెప్పారు. దీంతో ఏ, డీ విటమిన్లను అందులో కలుపుతున్నారని వెల్లడించారు. డీ విటమిన్ కొరత వల్ల గుండె సంబంధ రోగాలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఇటీవల మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 70 నుంచి 75 శాతం మందికి డీ విటమిన్ లోపించినట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. సన్మానాన్ని అందుకున్న వారిలో మల్య ఆస్పత్రికి చెందిన డాక్టర్ వీకే. శ్రీనివాస్, డాక్టర్ హెచ్ఎస్. శ్రీకంఠ ఉన్నారు. -
‘సకాల’లో స్పందించకపోతే కఠిన చర్యలు
సాక్షి, బెంగళూరు : సకాల దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర హెచ్చరించారు. ‘సకాల’ పనితీరుకు సంబంధించిననివేదికను విధానసౌధాలో మీడియాకు సోమవారం వివరించారు. నిర్ధిష్ట గడువులోగా దరఖాస్తులు పరిష్కరించడంలో ఏడుసార్లు విఫలమైన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూపొందించిన నిబంధనలకు గవర్నర్ కార్యాలయం అనుమతిచ్చిందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరిస్తామని అన్నారు. రాష్ట్రంలో సకాల ప్రారంభించి రెండేళ్లు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 669 సేవలు సకలా ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 5.78 కోట్ల దరఖాస్తులు సకాల కింద ప్రభుత్వానికి రాగా అందులో 7.70 కోట్ల దరఖాస్తులను పరిష్కరించినట్లు వివరించారు. 524 దరఖాస్తులకు సంబంధించి నిర్ధిష్ట వ్యవధిలోగా పనులు పూర్తిచేయకపోవడం వల్ల సంబంధిత దరఖాస్తుదారునికి రూ.67,440 పరిహారంగా అందించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కామన్వెల్త్ అసోషియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్రశస్తి పోటీల్లో సకాల తుది దశలో ఉందన్నారు. త్వరలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఫైనల్ పోటీల్లో తప్పక ‘సకాల’కు ప్రశస్తి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు చట్టప్రకారం సహకరిస్తానని గవర్నర్ వజుభాయ్రుడాభాయ్ వాలా భరోసా ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య సఖ్యత లేదని కొన్ని మీడియాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.