సాక్షి ,బెంగళూరు : మొదట పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వారి నుంచి తిరిగి భూములను స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అందులో భాగంగా మొదట బెంగళూరులో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన శనివారం మాట్లాడారు.
ప్రత్యేక న్యాయస్థానంలో కేసుల విచారణకు న్యాయమూర్తికు ఇద్దరు ఐఏఎస్ స్థాయి అధికారులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు సహకరిస్తారన్నారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పేదలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడతామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి న్యాయస్థానాల వద్ద ఎనిమిది వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
భవిష్యత్‌లో ఆక్రమణలకు సంబంధించి మరో 10 వేల కేసులు న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బగర్‌హుకుం భూముల సాగుకు ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పేద రైతులకు ముఖ్యంగా బగర్‌హుకుం భూముల సాగు చేసుకుటున్న వారికి నూతన చట్టం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
జిల్లా, తాలూకా స్థాయి కార్యాలయాల్లో చాలా కాలంగా పెండింగ్‌లోఉన్న ఫైల్స్‌ను పూర్తి చేసే పనిని నవంబర్ ఒకటో తేదీ నుంచి 30 రోజుల పాటు చేపట్టనున్నామని తెలిపారు. ‘సకాల’ ప్రాజెక్టు కింద నిర్ధిష్ట సమయంలోపు పనులు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణ, నగరాల్లోని కబ్జాదారులపై నిఘా
Published Sun, Oct 26 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement