Gas Stations
-
108 ఇం‘ధన’ సమస్యలు
-
108 ఇం‘ధన’ సమస్యలు
• వాహనాలకు డీజిల్ నింపలేమని తేల్చిచెబుతున్న పెట్రోల్ బంకులు • రుణ అర్హతను కోల్పోయారంటూ స్పష్టీకరణ • 50 రోజులుగా పైసా నిధులివ్వని సర్కారు సాక్షి, అమరావతి ఆపదలో ఆదుకునే 108 వాహనాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే అనేక వాహనాలను మూలనపడేసిన సర్కారు.. చివరకు డీజిల్ పట్టించుకునేందుకు రుణ అర్హతను కోల్పోయేలా చేసింది. ప్రభుత్వం ఎప్పుడైనా నిధులు జాప్యం చేసినప్పుడు నిర్వహణ సంస్థే పెట్రోలు బంకులకు అప్పుగా డీజిల్ నింపాలని లేఖ ఇచ్చేది. నిర్వహణ సంస్థపై నమ్మకం, సర్కారు వాహనాలే కదా అనే భరోసాతో నెలరోజుల పాటు పెట్రోలు బంకుల యజమానులు వాహనాలకు అప్పుగా డీజిల్ పోసేవారు. అయితే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో డీజిల్ పొయ్యడానికి బంకుల యజమానులు నిరాకరిస్తున్నారు. ఇరవై రోజులుగా మీరు రుణ అర్హత కోల్పోయారని తేల్చిచెబుతుండడంతో 108 వాహనాలు నడుపుతున్న పైలెట్లు తెల్లముఖం వేస్తున్నారు. అవగాహనా ఒప్పందం ప్రకారం ఒక్కో త్రైమాసికానికి ముందస్తుగానే నిర్వహణ సంస్థకు నిధులివ్వాలి. కానీ జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. నిధులున్నా చెల్లింపులు చేయడం లేదు. ఫైలు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వద్దే ఉంది. వాహనాలు ఆగిపోతున్నా, ఉద్యోగులకు జీతాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్‌తోనే జీవీకే సంస్థకు నిర్వహణ కాలం ముగిసింది. అయితే ప్రభుత్వం అర్హత లేని కొత్త సంస్థకు టెండర్లు దక్కేలా చేయడంతో జీవీకే కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ కొత్త సంస్థకు అర్హత లేదంటూ మళ్లీ జీవీకేకే బాధ్యతలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను ఎలా తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు పలువురు అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. మరోవైపు 108కు కాల్ చేస్తే చాలా చోట్ల జాప్యం జరుగుతుండటంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుని ఆస్పత్రులకు వెళుతున్నారు. -
ఇక పాత నోట్లకు పెట్రోల్ నో
-
ఇక పాత నోట్లకు పెట్రోల్ నో
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో రూ. 500 నోట్లు చెల్లవు ► మిగతా అనుమతించిన సేవలకు వాడుకోవచ్చన్న కేంద్రం ► నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు ► రూ. 200 మించితేనే పాత 500 నోటుకు అనుమతి న్యూఢిల్లీ: డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 15 వరకూ పాత నోట్లు వాడుకోవచ్చని గతవారం ప్రభుత్వం పేర్కొన్నా... కొన్ని చోట్ల ఈ సౌకర్యం దుర్వినియోగం అవుతోందన్న వార్తల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అన్ని టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లు(పీవోఎస్)లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులతో టోల్ చెల్లించవచ్చని, టోల్ రూ. 200 కంటే ఎక్కువుంటే పాత రూ. 500 నోటును అనుమతిస్తారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌స(ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొనుగోలు చేసి టోల్ చెల్లించవచ్చని, నగదు చెల్లింపులు చేసేవారు... ఆలస్యం కాకుండా చిల్లర దగ్గర పెట్టుకోవాలని సూచించింది. టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 15 అర్ధరాత్రి వరకూ పాత 500 నోట్లు తీసుకుంటారని, పాస్టాగ్స కొనుగోలుకు, 200 కంటే టోల్ ఎక్కువుంటేనే పాత 500 నోట్లను స్వీకరిస్తారని తెలిపింది. ఫాస్టాగ్‌స వాడితే టోల్ ఫీజు నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇస్తారని, ఈ వాలెట్ల ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని పేర్కొంది. ఆయిల్, గ్యాస్ కంపెనీలు డిజిటల్ చెల్లింపులకు విసృ్తత ఏర్పాట్లు చేశాయని, అందుకే పెట్రోల్ బంకుల్ని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది. ఎల్పీజీ సిలిండర్లకు మాత్రం పాత 500 నోట్లు తీసుకుంటారని కేంద్రం స్పష్టం చేసింది. 90 శాతం ఏటీఎంల్లో మార్పులు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2 లక్షలకుపైగా ఏటీఎంల్లో 90 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని ఏటీఎం తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్స ఎండీ తెలిపారు. నవంబర్ 30 లోపు అన్ని ఏటీఎంల్లో మార్పులు పూర్తయ్యేలా ఆర్బీఐ నియమించిన టాస్క్‌ఫోర్స్‌కు గడువునిచ్చారని, 1.80 లక్షల ఏటీఎంల్లో కొత్త 2 వేలు, 5 వందల నోట్లు వచ్చేలా మార్పులు పూర్తయ్యాయని చెప్పారు. నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తల విషయంలో బ్యాంకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. జీతం కోసం క్యూలో అష్టకష్టాలు ఉద్యోగులు, కార్మికులు జీతాల కోసం గురువారం బ్యాంకుల ముందు భారీ క్యూలతో తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే నగదుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని బ్యాంకులు చెప్పినా వాస్తవంగా ఆ పరిస్థితులు కన్పించలేదు. వారానికి రూ. 24 వేలు విత్‌డ్రా పరిమితి ఉన్నా ఒక వ్యక్తికి కేవలం రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రాకు అనుమతించారు. మరికొన్ని చోట్ల రూ. 10 వేలు, రూ. 12 వేల చొప్పున విత్‌డ్రా సౌకర్యం కల్పించారు. ఇక దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ఏటీఎంలు నగదు లేక మూతబడ్డాయి. దాదాపు 90 % ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. పనిచేసిన ఏటీఎంల్లో ఎక్కువ శాతం రూ. 2 వేల నోట్లే వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదు: జైట్లీ నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందన్న భయాల్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ బిల్లు ప్రస్తుత విధానాల్ని పూర్తిగా మార్చేస్తాయని ఆయన పేర్కొన్నారు. జీడీపీ పరిమాణం గణనీయ స్థాయిలో పెరుగుతుందని భువనేశ్వర్‌లో నిర్వహించిన మేకిన్ ఒడిశా సదస్సు సందర్భంగా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఆర్థిక పరిస్థితి సమీక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్, ఇతర ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్ని పిలవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. జనవరిలో ఈ భేటీ ఉంటుందని కమిటీ ఛైర్మన్ థామస్ చెప్పారు. బెంగళూరులో రూ. 6 కోట్ల స్వాధీనం బెంగళూరులో ఐటీ అధికారులు ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారి జయచంద్ర ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2వేలు, రూ.500 కొత్త నోట్ల కట్టలే ఎక్కువగా ఉన్నాయని, వాటి విలువ రూ.4.7 కోట్లు ఉండొచ్చని తెలిసింది. జయచంద్ర స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. దాదాపు 14 కిలోల బంగారు, వెండి నగలు, వస్తువులతో పాటు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. -
నేటి నుంచి నోట్ల మార్పిడి
జిల్లాకు చేరిన కొత్త నోట్లు ఉదయం 10 నుంచి శ్రీకారం బ్యాంకుల ప్రత్యేక ఏర్పాట్లు ► చుక్కలు చూపించిన చిల్లర కొరత ► బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల మూత ► చేతులెత్తేసిన పెట్రోల్ బంకులు ► పెద్ద నోట్లను తిరస్కరించిన రిటైలర్లు, మెడికల్ షాపులు ► రూ.400కు పడిపోయిన రూ.500 విలువ ► జోరుగా సాగిన కమీషన్ వ్యాపారం ► నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. రియల్ వ్యాపారాలు ► చిరు వ్యాపారాలు వెలవెల.. మాల్స్ మాత్రం కళకళ ► రవాణా కార్యకలాపాలకూ అంతరాయం నర్సీపట్నం నుంచి పేషెంట్‌ను తీసుకొని కేజీహెచ్‌కు వచ్చాను. రూ.500 నోటు ఇస్తే బయటెక్కడా తీసుకోలేదు. ఉదయం నుంచీ టిఫిన్ చేయలేదు. భోజనం కూడా దొరికే పరిస్థితి లేదు.. ఓ వ్యక్తి ఆవేదన ఉదయం పాలకోసం వెళ్లాను.. కిరాణా షాపునకు వెళ్లాను.. చివరికి పెట్రోల్ బంకుకు వెళ్లాను.. చిల్లర లేదన్నారు.. రూ.500 మొత్తానికి పెట్రోల్ కొట్టించుకోమన్నారు... ఓ మెడికో ఆందోళన రూ.500 నోటుతో కేజీహెచ్‌కు వచ్చాను. ఎవరూ తీసుకోకపోవడంతో చివరికి రూ.500 నోటును రూ. 400తో మార్చుకున్నాను. వంద నష్టపోయాను... ఓ కార్పెంటర్ వ్యధ ప్రతి వాళ్లు పెద్ద నోట్లే తీసుకొస్తున్నారు.. మేం మాత్రం ఎక్కడి నుంచి చిల్లర నోట్లు తేగలం.. చిల్లర కొరతతో వ్యాపారాలు కోల్పోతున్నాం.. ఓ చిరు వ్యాపారి నిస్సహాయత.. ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు కరెన్సీ కల్లోలంలో చిక్కుకున్నారు. చిరు వ్యాపారాలు చిన్నబోయాయి. చిన్న, మధ్యతరగతి ప్రజలు చిల్లర కోసం చుక్కలు చూశారు. ఇదే అదనుగా కమీషన్ వ్యాపారులు విజృంభించారు. కాసుల పంట పండించుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో రూ.500 దగ్గర రూ.100 కమీషన్ గుంజుకున్నారు. సాధారణంగా మార్కెట్లలో వందకు 5 రూపాయలు కమీషన్‌తో చిల్లర వ్యాపారం చేసే వారు, కొందరు తెలివైన వ్యక్తులు చిల్లర సమస్యను అవకాశంగా తీసుకొని ఒక్కరోజులోనే వేల రూపాయలు గడించారు. బ్యాంకులు, ఏటీఎంలు మూతపడటం వల్ల జిల్లాలో సుమారు రూ.150 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్లు, రవాణా సేవలు, అనకాపల్లి బెల్లం మార్కెట్ లావాదేవీలు, బంగారం వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది.మందుల షాపులు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో 11వ తేదీ వరకు పెద్ద నోట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినా వంద నోట్ల కొరత ఆ ప్రకటనను పరిహసించింది. చిల్లర లేదంటూ వినియోగదారులను చాలా చోట్ల తిప్పి పంపారు.టోల్గేట్ల వద్ద ఇదే చిల్లర సమస్యతో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. శుక్రవారం వరకు టోల్ ఫీజు మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా టోల్‌ప్లాజాల నిర్వాహకులు దాన్ని అమలు చేయలేదు. మొత్తం మీద పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపితే.. చిల్లర కొరత కరెన్సీ కల్లోలం సృష్టించింది. విశాఖపట్నం : ‘ధనమేరా అన్నిటికి మూలం..ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అన్నట్టుగా తయారైంది. నిన్నటి వరకు వంద రూపాయలకు విలువ లేదు.. కానీ ఆ వంద రూపాయలున్న వాడే గొప్పొడు ఇప్పుడు. వాడి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. రూ.500, రూ.1000 చలామణి రద్దు నోట్ల కావడంతో వంద నోటు కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. పాల ప్యాకెట్ల నుంచి మొదలైన చిల్లర ఝంజాటం పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది. తమ వద్దనున్న పెద్దనోట్లు మార్చుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరో పక్క వీరి బలహీనతను ఆసరాగా చేసు కుని కమిషన్ వ్యాపారం జోరందుకుంది. స్తంభించిన లావాదేవీలు.. వెలవెలబోరుున మార్కెట్లు పెద్దనోట్ల రద్దు ప్రభావం అన్ని వర్గాలపై చూపుతోంది. దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కల్గించింది. వందనోట్ల కొరతతో వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యారుు. కేంద్ర నిర్ణయంతో ఏటీఎంలు మూతపడ్డారుు. పోస్టాఫీసులు, బ్యాంకులు లావాదేవీలు నిలిచిపోయారుు. ఆన్లైన్ లావాదేవీలకు ఇబ్బంది లేకున్నప్పటికీ నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయారుు. బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడడంతో సుమారు రూ.150 కోట్ల్లకు పైగా లావాదేవీలు స్తంభించినట్టుగా చెబుతున్నారు. మరోపక్క పెద్ద షాపింగ్ మాల్స్, బంగారు దుకాణాల్లో సైతం నగదు ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచినప్పటికి స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగారుు. సినిమా హాళ్లు, హోటల్స్, చిరువ్యాపారాలు పూర్తిగా వెలవెలబోయారుు. సుమారు రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు నిలిచిపోరుునట్టుగా చెబుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పాట్లు పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు ప్రభుత్వ పాలబూత్ల్లో సైతం పెద్దనోట్లు చలామణి విషయంలో ప్రజలకు ఆయా వర్గాల వారికి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. పెట్రోల్ బంకుల్లో పెద్ద నోట్లు తీసుకున్నప్పటికీ వాటికి సరపడా పెట్రోల్, డీజిల్ పోరుుంచుకోవాలే తప్ప చిల్లర ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో ఘర్షణలు చోటుచేసుకున్నారుు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్ద నోట్లు చెల్లుతాయని, అరుుతే చిల్లర మాత్రం ఇవ్వలేమని, టికెట్ వెనుక రాస్తాం...ఆ తర్వాత వచ్చి తీసుకోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్లలో సిబ్బంది, కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగడంతో గందర గోళం నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లో ఇదే పరిస్థితి కన్పించింది. అక్కడ చిల్లర లేదని..సరిపడా సొమ్ములిస్తేనే టికెట్లు ఇస్తామని సిబ్బంది తెగేసి చెప్పడంతో ప్రయాణికుల పరిస్థితి అయోమయంగా తయారైంది. విజయవాడ వెళ్లే ప్రయాణి కులు ఐదొందల నోటు ఇచ్చి కనీసం చెన్నై వరకు టికెట్ ఇవ్వమన్నా చిల్లర ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చిల్లర ఇవ్వకపోవడంతో పెద్ద నోట్లు ఇవ్వలేక.. చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకుని వెనుదిరిగారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయారుు. ఎక్కడా పెద్ద నోట్లు తీసు కోబోమని చెప్పడంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లను వారుుదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎక్కడా పట్టుమని పది కూడా జరగలేదని రిజిస్ట్రేషన్ అధికారులే చెబుతున్నారు. ఎన్‌హెచ్-16పై అగనంపూడి, నక్కపల్లి వద్ద ఉన్న టోల్‌ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు తప్పలేదు. టోల్ ప్లాజా సిబ్బంది పెద్దనోట్లు తీసుకునేందుకు నిరాకరించడంతో వందల సంఖ్యలో వాహనాలు గంటల తరబడి బారులుతీరి కన్పించారుు. చివరకు 11వ తేదీ అర్థరాత్రి వరకు ప్లాజాల్లో ఎలాంటి రుసుములు వసూలు చేయరని కేంద్రం ప్రకటించినప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సాయంత్రం వరకు వసూళ్లు కొనసాగించారు. పలు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు కేజీహెచ్‌లో కూడా పెద్దనోట్లు అనుమతించక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు చాలా ఇబ్బందులపడ్డారు. సెవెన్‌హిల్స్ వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెద్దనోట్లను తీసుకోకపోవడంతో సిబ్బందికి రోగులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నారుు. మరో పక్క రూ.500కు రూ.300, రూ.1000 నోటుకు రూ.600 నుంచి రూ.700కు ఇచ్చే కమీషన్ వ్యాపారాలు జోరందుకున్నారుు. కొంత మంది బ్రోకర్లు రంగంలోకి దిగి కమీషన్ వ్యాపారం జోరుగా సాగించారు. బుధవారం ఒక్కరోజే ఈ రకంగా సుమారు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా చెబుతున్నారు. -
నమ్మకమివ్వని అమ్మకం
కొలతల్లో మాయాజాలం దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో మోసం నిలువుదోపిడీకి గురవుతున్న వినియోగదారులు తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేసే వారు మెజీషియన్లయితే.. చాలామంది వ్యాపారులు వారినే మించిపోతున్నారు. తూకంలో మాయాజాలంతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇంద్రజాలంలో సిద్ధహస్తులు ఉన్నదాన్ని లేనట్టు చేస్తే.. వీరు మాత్రం లేని బరువును ఉన్నట్టు చూపించి జనానికి టోకరా వేస్తున్నారు. తూనికలు కొలతల్లో బురిడీతో వినియోగదారులు రోజూ అడుగడుగునా మోసపోతున్నారు. యలమంచిలి : యలమంచిలి పట్టణంలోని ఓ చికెన్ దుకాణంలో శ్రీనివాసరావు అనే ఉద్యోగి కిలో చికెన్ కొన్నారు. బరువుతగ్గినట్టు అనుమానం రావడంతో మరో దుకాణం లో తూకం వేయిస్తే 900 గ్రాములే ఉంది... అనకాపల్లికి చెందిన శ్యామల ఓ చిల్లర దుకాణంలో రెండు కిలోల కందిపప్పు కొనుగోలు చేశారు. ఎలక్ట్రానిక్ కాటా తూకమే అయినా మోసం జరిగినట్టు అనుమానం వచ్చి మరో దుకాణంలో కందిపప్పును తూకం వేయించారు. 100 గ్రాములు తగ్గడంతో వ్యాపారితో తగాదాకు దిగారు. మనలో ప్రతి ఒక్కరికీ ఇలాటి అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయితే తెలియక కొంత, తెలిసినా అడిగే తీరిక లేక కొంత.. ఉదాసీనత వల్ల కొంత.. మొత్తం మీద చాలా సందర్భాల్లో ఈ మోసాలు మరుగున పడిపోతూనే ఉంటాయి. దీంతో పలువురు వ్యాపారులు ఇదో ఆనవాయితీగా మోసం చేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్ బంక్, కిరాణా దుకాణం, రేషన్‌షాపు దగ్గర నుంచి పండ్లు, మాంసం, కూరగాయలు, వస్త్రాలు, చివరకు బంగారం వస్తువులు కూడా కొలతల ప్రకారం అమ్మాల్సిందే. అయితే అమ్మకాల్లో నమ్మకం కొరవడుతోందనివినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినా పద్ధతిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకుల్లో బాదుడు పెట్రోల్ బంకుల పంపుల్లో తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణలోనే కొలతలు నిర్ధారించాలి. చాలా చోట్ల వీరు వెళ్లకుండానే బంకు యజమానులు ఇష్టానుసారం ఖరారు చేస్తున్నారు. లీటరు పెట్రోల్, డీజిల్ వేయడానికి కొలతలు నమోదు చేసేటప్పుడు 50 నుంచి 100 మి.లీ. తక్కువ పడేలా నమోదు చేస్తున్నట్టు బంకుల్లో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. దోపిడీ తీరిలా.. రెండేళ్లకోసారి కాటాలు, తూకంరాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఈ పరిస్థితే ఉండడం లేదు. కొందరు రేషన్ షాపుల నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాటాలను పక్కనపెట్టి పాత రాళ్లను వినియోగిస్తున్నారు. రెండేళ్లకిందట అమలులోకి వచ్చిన ప్యాకింగ్ కమోడిటీస్ చట్టం నూతన నిబంధనల ప్రకారం ప్రతివస్తువును ప్యాకింగ్ చేసి విక్రయించాలి. వాటిపై తయారు చేసిన తేది, నికర బరువు, ధర, ఎప్పటిలోగా వినియోగించాలనే వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ పద్ధతిని పాటించేవారే లేరన్నది విస్పష్టం. నామమాత్రంగా కేసులు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 30వేలు ఉన్నాయి. వీటిపై 2014-15 ఆర్ధిక సంవత్సరంల ో ఇప్పటి వరకు కేవలం 300 కేసులు నమోదు చేసి రూ.11లక్షలు అపరాధ రుసుము కింద వసూలు చేశామని ఆ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ థామస్ రవికుమార్ తెలిపారు. తన పరిధిలో 34 మండలాల్లో అనకాపల్లి, నర్సీపట్నం ఇన్స్పెక్టర్లు కూడా తనిఖీ చేస్తారని తెలిపారు. వినియోగదారులు మోసాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. -
సినీ ఫక్కీలో బంకులో మోసం
సీసీ కెమెరాలో చిక్కిన నిందితుడు రావికమతం : రావికమతంలోని ఓ వ పెట్రోల్ బంకులో ఓ అపరిచిత వ్యక్తి సినీ ఫక్కీలో మోసం చేసి రూ.25 వేల అపహరించుకుపోయాడు. దీనిపై బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్ఐ వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. రావికమతం సుశీల ఏజెన్సీ ఆధ్వర్వంలో నడుస్తున్న బంకుకు సోమవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అక్కడ సూపర్ వైజర్ అప్పారావుతో మాట్లాడుతూ.. తనను తహశీల్దార్ కుమార్ పంపించారని, బంకు యజమాని తనకు తెలుసని తెలిపాడు. రూ. 25 వేలకు ఎన్ని లీటర్ల డీజిల్ వస్తుందో అంతటి కి బిల్లు కావాలని, తర్వాత వచ్చి డీజిల్ తీసుకెళ్తామని చెప్పాడు. అత్యవసరంగా రూ. 25 వేలు కావాలని, ఆ మొత్తం చోడవరం పంపించాలని వారిని నమ్మబలికాడు. మొత్తం రూ.50 వేలు కార్యాలయానికి వస్తే ఇస్తానని వారితో చెప్పాడు. దీంతో వారు బంకు యజ మాని శేషుతో మాట్లాడారు. ఆయన సైతం నమ్మి బిల్లుతో పాటు, రూ.25 వేలు ఆ వ్యక్తికి ఇవ్వాలని సూచించారు. అతని వెంట వెళ్లి రూ. 50 వేలు తేవాలని సిబ్బందికి సూచించాడు. దీంతో రూ. 25 వేలు తీసుకున్న ఆ వ్యక్తి మరొకరికి ఇచ్చి పంపేశాడు. మొత్తం రూ. 50 వేలు తన వెంట వస్తే ఇస్తానంటూ.. బంకు ఉద్యోగి ఈశ్వరరావును వెంట తీసుకుని రావికమతం ఉన్నత పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ఈశ్వరరావును చెట్టుకింద కూర్చొమని చెప్పి.. ఆ వ్యక్తి ఉన్నత పాఠశాలలోకి ప్రవేశించాడు. అక్కడే 20 నిముషాలు వేచి ఉన్న ఈశ్వరరావు.. లోపలికి వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టూ పక్కల వెతికాడు. ఆ వ్యక్తి ఆచూకీ కనిపించ కపోవడంతో ఉపాధ్యాయులను అడిగాడు. ఎవరో వ్యక్తి వచ్చారని,వెనుక గేటు నుంచి వెళ్లిపోయాడని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించి, బంకు యాజమానికి ఫోన్లో జరిగింది వివరించాడు. వెంటనే బంకు యాజమాని పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీని సేకరించి విచారణ చేపడుతున్నారు. -
రేపట్నుంచి పెట్రోల్ బంకుల నిరవధిక బంద్
- పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణస్పష్టీకరణ గుంటూరు వెస్ట్/సాక్షి, హైదరాబాద్/సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ ఒకటోతేదీ ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోలు బంకులు నిరవధికంగా మూతపడనున్నాయి. డీజిల్, పెట్రోలుపై లీటరుకు రూ.4 చొప్పున అదనంగా పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ పెట్రోల్ బంకుల నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ మంగళవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక రవాణా బంద్ చేపడుతున్నట్టు, ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని సరుకు రవాణా వాహనాలు, పెట్రోలు, డీజిల్ రవాణా వాహనాలు, పెట్రోలు బంకుల కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
కల్తీ పెట్రోలు విక్రయిస్తే కఠిన చర్యలు
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారిణి (డీఎస్ఓ) విజయరాణి హెచ్చరించారు. శుక్రవారం పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోలు విక్రయాలపై కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పది ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ పెట్రోలు బంకుల యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల వివరాలు... చిత్తూరులోని మిట్టూరు సమీపంలోని పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారని, తద్వారా వాహనాలు పాడయి, మైలేజ్ రావడం లేదని ఒక ఫిర్యాదు అందింది. చిత్తూరు నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారని సంతపేటకు చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. పుత్తూరులో మార్కెట్‌కు సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో ఫీడింగ్ కరెక్టుగా లేదని, రీడింగ్‌లో పైసలు తేడాలు ఉన్నాయని పుత్తూరుకు చెందిన అరుణ్ ఫిర్యాదు చేశారు. వి.కోటలోని పేర్నంబట్ రోడ్డు ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టేటప్పుడు రీడింగ్ కనిపించడంలేదని, క ల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వి.కోటకు చెందిన రాజేష్ ఫిర్యాదు చేశారు. శాంతిపురం పెట్రోల్ బంకులో వ్యాట్ మొత్తం ఎక్కువగా వసూలు చేస్తున్నారని కుప్పంకు చెందిన దేవరాజ్ ఫిర్యాదు చేశారు. అరగొండ బస్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నట్లు అరగొండకు చెందిన మునిరత్నం ఫిర్యాదు చేశారు. అలాగే తిరుపతి, చంద్రగిరిలోని పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని పలువురు ఫిర్యాదులు చేశారు. -
పెట్రోల్ బంకుల్లో ఆధార్
నేటి నుంచి మున్సిపాలిటీల పరిధిలో అమలు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు విజయవాడ : ఈ నెల 13 నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద రవాణా శాఖ సిబ్బంది, మెప్మా వాలంటీర్ల సహాయంతో ఆధార్ నంబర్లు సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ రాష్ట్ర స్థాయిలో పెట్రోల్ కంపెనీల కోఆర్డినేటర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఏర్పాట్లు చేశామని వివరించారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు ఇచ్చినట్లు తెలిపారు. తొలుత తిరువూరు, నూజివీడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీలలో ఆధార్ వివరాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు. వాహన యజమానులు తమ వాహన రిజిస్ట్రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను పెట్రోలు బంకుల వద్ద మెప్మా వాలింటీర్లకు అందజేసి వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. రవాణా శాఖలో వాహన నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసినందుకు వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రవాణా శాఖ వెబ్సైట్ www.aptransport.org ద్వారా కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని ఆపరేటర్లకు సూచించారు. -
సమైక్యాంధ్ర....మహోద్యమం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు జడివానలోనూ ఆగలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా 16వ రోజు ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాల ఆందోళనలు మహోద్యమంగా సాగాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు ఎక్కడికక్కడ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలు పాత సినిమా హాల్ సెంటర్లో డ్వాక్రా మహిళలు లక్ష్మీదేవి చిత్రపటాన్ని, కలశాన్ని అందంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ వేద పండితులు చిట్టి చంద్రశేఖర శర్మచే శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. రాష్ట్ర విభజన జరగకుండా, అందరూ సమైక్యంగా ఉండాలని మహిళలు లక్ష్మీదేవిని ప్రార్థించారు. జగ్గయ్యపేటలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వ ద్ద రోడ్డుపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీటీపీఎస్లోని మహిళా ఉద్యోగులు థర్మల్ గేట్ బయట రోడ్డుపైనే జోరువానలోనూ వరలక్ష్మీ వ్రతం పూజాదికాలు నిర్వహించారు. జాగో నాయకా! విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కుక్క మెడలో, జాగో నాయకా జాగో బోర్డు కట్టి నిరసన తెలిపారు. పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ విజయవాడలో సమావేశమై ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. మరుపిళ్ల చిట్టి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. చెన్నుపాటి పెట్రోల్ బంకు వద్ద నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగిన విద్యార్థుల జేఏసీ ర్యాలీలో మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పాల్గొన్నారు. వినూత్న నిరసనలు.. జిల్లాలో శుక్రవారం నిరసనలు వినూత్నంగా సాగాయి. కలిదిండిలో ఎన్జీవోలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు నిర్వహించి దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల వ్యాపారులు నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో రైతుబజార్ బంద్ పాటించారు. హిజ్రాలు కూడా నిరసన ప్రదర్శన చేశారు. గుడివాడలో కేసీఆర్, సోనియా మాస్క్‌లతో గొర్రెలను ఊరేగిస్తూ మాంసం వర్తకులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ యజమానులు ఖాళీ ట్రాక్టర్లతో ర్యాలీ చేయగా, రైతుబజారులో వంటావార్పు నిర్వహించారు. మచిలీపట్నంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది శుక్రవారం స్థానిక కోనేరుసెంటర్‌లో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలేదీక్షలను పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి ప్రారంభించారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ పశువుల్ని ఊరేగించారు. కుక్కకు, ఎద్దుకు మెడలో దండలు వేసి పట్టణంలో ఊరేగించి సమైక్యాంధ్రను విడదీయవద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. పెడనలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు జరిపిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాం ప్రసాదు మద్దతు పలికారు. బంటుమిల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో వంటలు చేయటం, ఇడ్లీ పిండి కడగటం, దోసెలు, గారెలు, మినప అట్లు, పెసర అట్లు వేయటం, చపాతీలు తయారు చేయటం లాంటి పనులు చేస్తూ తమ నిసరన తెలిపారు. హిజ్రాలు బంటుమిల్లి రోడ్డులో నాట్యాలు చేస్తూ నిరసనను తెలిపారు. చాట్రాయి మండలం చనుబండలో రోడ్డుపై క్షవరం చే సి జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. నూజివీడులో ఎల్ఐసీ ఏజంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బైక్ మెకానిక్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నగాంధీబొమ్మ సెంటరులో ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ నిర్వహించారు. నందిగామ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేశారు. మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్లో జాతీయ రహదారిపై శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఉయ్యూరులో భారీ ప్రదర్శన జోరువానలోనూ ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ప్రధాన సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షల్లో మండల పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయనీయకుండా, పోలీసులు తీసుకెళ్లిపోవటం ఉద్రిక్తతకు దారితీసింది. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో పామర్రు ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట ప్రదర్శనలు చేశారు. -
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరం
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఈ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. దాదాపు పాలన స్తంభించిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. అత్యవసర విభాగాలు తప్పితే మిగతావన్నీ ఉద్యమ బాటలో ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. విద్యార్థులు, న్యాయవాదులు, వ్యాపారులు, వైద్యులు, విద్యుత్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులు మూత పడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలను ఉద్యమకారులు అడ్డుకుంటున్నారు. దీంతో భారీ వాహనాల రాకపోకలు తగ్గాయి. పెట్రోల్ బంకుల్లో చమురు విక్రయాలు 20 నుంచి 30 శాతం మేరకు తగ్గిపోయాయని జిల్లా పెట్రోల్ బంకుల యజమానుల సంక్షేమ సంఘం కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో ఉద్యమం తీవ్రతరం కావడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రైవేట్ వాహనాలతోపాటు, ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా తగ్గిపోయాయి. విశాఖ నుంచి తెలంగాణలోని జిల్లాలకు వెళ్లాల్సిన అంతర్రాష్ట్ర సర్వీసులు అధిక సంఖ్యలో నిలిచిపోనున్నాయి. జిల్లా నుంచి తూర్పు గోదావరి కేవలం రాత్రి సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఫలితంగా రీజియన్ పరిధిలో రోజుకి రూ.30 లక్షల నష్టం వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి బస్సులను నిలిపివేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు తెలిపారు. ఈ ప్రభావం నిత్యావసరాలతో పాటు అన్నింటిపై పడే అవకాశముంది. సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆరా నర్సీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఉద్యమంపై ప్రత్యేకాధికారిగా నియమితులైన అడిషనల్ డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఉమాపతి, ఎస్పీ దుగ్గల్ గురువారం స్థానిక టౌన్ పోలీస్‌స్టేషను సందర్శించారు. పది రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని గమనించి, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అడిషనల్ డీజీ స్థానిక పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. కార్యక్రమంలో ఓఎస్డీ దామోదర్, ఇన్చార్జ్ డీఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు స్థానిక సీఐలు రాజేంద్రకుమార్, ప్రసాదరావులు పాల్గొన్నారు.