నేటి నుంచి నోట్ల మార్పిడి | From today's currency exchange | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నోట్ల మార్పిడి

Published Fri, Nov 11 2016 1:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

నేటి నుంచి నోట్ల మార్పిడి

నేటి నుంచి నోట్ల మార్పిడి

జిల్లాకు చేరిన కొత్త నోట్లు
ఉదయం 10 నుంచి శ్రీకారం
బ్యాంకుల ప్రత్యేక ఏర్పాట్లు

చుక్కలు చూపించిన చిల్లర కొరత
బ్యాంకులు, ఏటీఎంలు,  పోస్టాఫీసుల మూత
చేతులెత్తేసిన పెట్రోల్ బంకులు
పెద్ద నోట్లను తిరస్కరించిన రిటైలర్లు, మెడికల్ షాపులు
రూ.400కు  పడిపోయిన రూ.500 విలువ
జోరుగా సాగిన కమీషన్ వ్యాపారం
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. రియల్ వ్యాపారాలు
చిరు వ్యాపారాలు వెలవెల.. మాల్స్ మాత్రం కళకళ
రవాణా కార్యకలాపాలకూ  అంతరాయం

నర్సీపట్నం నుంచి పేషెంట్‌ను తీసుకొని కేజీహెచ్‌కు వచ్చాను. రూ.500 నోటు ఇస్తే బయటెక్కడా తీసుకోలేదు. ఉదయం నుంచీ టిఫిన్ చేయలేదు. భోజనం కూడా దొరికే పరిస్థితి లేదు.. ఓ వ్యక్తి ఆవేదన ఉదయం పాలకోసం వెళ్లాను.. కిరాణా షాపునకు వెళ్లాను.. చివరికి పెట్రోల్ బంకుకు వెళ్లాను.. చిల్లర లేదన్నారు.. రూ.500 మొత్తానికి పెట్రోల్ కొట్టించుకోమన్నారు... ఓ మెడికో ఆందోళన

రూ.500 నోటుతో కేజీహెచ్‌కు వచ్చాను. ఎవరూ తీసుకోకపోవడంతో చివరికి రూ.500 నోటును రూ. 400తో మార్చుకున్నాను. వంద నష్టపోయాను...  ఓ కార్పెంటర్ వ్యధ ప్రతి వాళ్లు పెద్ద నోట్లే తీసుకొస్తున్నారు.. మేం మాత్రం ఎక్కడి నుంచి చిల్లర నోట్లు తేగలం.. చిల్లర కొరతతో వ్యాపారాలు కోల్పోతున్నాం.. ఓ చిరు వ్యాపారి నిస్సహాయత.. ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు కరెన్సీ కల్లోలంలో చిక్కుకున్నారు. చిరు వ్యాపారాలు చిన్నబోయాయి. చిన్న, మధ్యతరగతి ప్రజలు చిల్లర కోసం చుక్కలు చూశారు. ఇదే అదనుగా కమీషన్ వ్యాపారులు విజృంభించారు. కాసుల పంట పండించుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో రూ.500 దగ్గర రూ.100 కమీషన్ గుంజుకున్నారు. సాధారణంగా మార్కెట్లలో వందకు 5 రూపాయలు కమీషన్‌తో చిల్లర వ్యాపారం చేసే వారు, కొందరు తెలివైన వ్యక్తులు చిల్లర సమస్యను అవకాశంగా తీసుకొని ఒక్కరోజులోనే వేల రూపాయలు గడించారు.

బ్యాంకులు, ఏటీఎంలు మూతపడటం వల్ల జిల్లాలో సుమారు రూ.150 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్లు, రవాణా సేవలు, అనకాపల్లి బెల్లం మార్కెట్ లావాదేవీలు, బంగారం వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది.మందుల షాపులు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో 11వ తేదీ వరకు పెద్ద నోట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినా వంద నోట్ల కొరత ఆ ప్రకటనను పరిహసించింది. చిల్లర లేదంటూ వినియోగదారులను చాలా చోట్ల తిప్పి పంపారు.టోల్‌గేట్ల వద్ద ఇదే చిల్లర సమస్యతో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. శుక్రవారం వరకు టోల్ ఫీజు మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా టోల్‌ప్లాజాల నిర్వాహకులు దాన్ని అమలు చేయలేదు. మొత్తం మీద పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపితే.. చిల్లర కొరత కరెన్సీ కల్లోలం సృష్టించింది.

విశాఖపట్నం : ‘ధనమేరా అన్నిటికి మూలం..ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అన్నట్టుగా తయారైంది. నిన్నటి వరకు వంద రూపాయలకు విలువ లేదు.. కానీ ఆ వంద రూపాయలున్న వాడే గొప్పొడు ఇప్పుడు. వాడి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. రూ.500, రూ.1000 చలామణి రద్దు నోట్ల కావడంతో వంద నోటు కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. పాల ప్యాకెట్ల నుంచి మొదలైన చిల్లర ఝంజాటం పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది. తమ వద్దనున్న పెద్దనోట్లు మార్చుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరో పక్క వీరి బలహీనతను ఆసరాగా చేసు కుని కమిషన్ వ్యాపారం జోరందుకుంది.

స్తంభించిన లావాదేవీలు.. వెలవెలబోరుున మార్కెట్లు
పెద్దనోట్ల రద్దు ప్రభావం అన్ని వర్గాలపై చూపుతోంది. దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కల్గించింది. వందనోట్ల కొరతతో వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యారుు. కేంద్ర నిర్ణయంతో ఏటీఎంలు మూతపడ్డారుు. పోస్టాఫీసులు, బ్యాంకులు లావాదేవీలు నిలిచిపోయారుు. ఆన్‌లైన్ లావాదేవీలకు ఇబ్బంది లేకున్నప్పటికీ నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయారుు. బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడడంతో సుమారు రూ.150 కోట్ల్లకు పైగా లావాదేవీలు స్తంభించినట్టుగా చెబుతున్నారు. మరోపక్క పెద్ద షాపింగ్ మాల్స్, బంగారు దుకాణాల్లో సైతం నగదు ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచినప్పటికి స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగారుు. సినిమా హాళ్లు, హోటల్స్, చిరువ్యాపారాలు పూర్తిగా వెలవెలబోయారుు. సుమారు రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు నిలిచిపోరుునట్టుగా చెబుతున్నారు. 

బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పాట్లు
పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు ప్రభుత్వ పాలబూత్‌ల్లో సైతం పెద్దనోట్లు చలామణి విషయంలో ప్రజలకు ఆయా వర్గాల వారికి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. పెట్రోల్ బంకుల్లో పెద్ద నోట్లు తీసుకున్నప్పటికీ వాటికి సరపడా పెట్రోల్, డీజిల్ పోరుుంచుకోవాలే తప్ప చిల్లర ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో ఘర్షణలు చోటుచేసుకున్నారుు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్ద నోట్లు చెల్లుతాయని, అరుుతే చిల్లర మాత్రం ఇవ్వలేమని, టికెట్ వెనుక రాస్తాం...ఆ తర్వాత వచ్చి తీసుకోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్లలో సిబ్బంది, కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగడంతో గందర గోళం నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌లో ఇదే పరిస్థితి కన్పించింది. అక్కడ చిల్లర లేదని..సరిపడా సొమ్ములిస్తేనే టికెట్లు ఇస్తామని సిబ్బంది తెగేసి చెప్పడంతో ప్రయాణికుల పరిస్థితి అయోమయంగా తయారైంది. విజయవాడ వెళ్లే ప్రయాణి కులు ఐదొందల నోటు ఇచ్చి కనీసం చెన్నై వరకు టికెట్ ఇవ్వమన్నా చిల్లర ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చిల్లర ఇవ్వకపోవడంతో పెద్ద నోట్లు ఇవ్వలేక.. చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకుని వెనుదిరిగారు. 

జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయారుు. ఎక్కడా పెద్ద నోట్లు తీసు కోబోమని చెప్పడంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లను వారుుదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎక్కడా పట్టుమని పది కూడా జరగలేదని రిజిస్ట్రేషన్ అధికారులే చెబుతున్నారు. 

ఎన్‌హెచ్-16పై అగనంపూడి, నక్కపల్లి వద్ద ఉన్న టోల్‌ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు తప్పలేదు. టోల్ ప్లాజా సిబ్బంది పెద్దనోట్లు తీసుకునేందుకు నిరాకరించడంతో వందల సంఖ్యలో వాహనాలు గంటల తరబడి బారులుతీరి కన్పించారుు. చివరకు 11వ తేదీ అర్థరాత్రి వరకు ప్లాజాల్లో ఎలాంటి రుసుములు వసూలు చేయరని కేంద్రం ప్రకటించినప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సాయంత్రం వరకు వసూళ్లు కొనసాగించారు.

పలు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు కేజీహెచ్‌లో కూడా పెద్దనోట్లు అనుమతించక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు చాలా ఇబ్బందులపడ్డారు. సెవెన్‌హిల్స్ వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెద్దనోట్లను తీసుకోకపోవడంతో సిబ్బందికి రోగులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నారుు. 

మరో పక్క రూ.500కు రూ.300, రూ.1000 నోటుకు రూ.600 నుంచి రూ.700కు ఇచ్చే కమీషన్ వ్యాపారాలు జోరందుకున్నారుు. కొంత మంది బ్రోకర్లు రంగంలోకి దిగి కమీషన్ వ్యాపారం జోరుగా సాగించారు. బుధవారం ఒక్కరోజే ఈ రకంగా సుమారు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement